కర్ణాటక ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్...కాంగ్రెస్ MLA సంచలన వ్యాఖ్యలు

Submitted on 21 May 2019
Karnataka Congress leader appeals Muslims to 'join hands' with BJP if need arises


కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ కు కౌంట్ డౌన్ మొదలైనట్లు కన్పిస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సొంత పార్టీపైనే తిరుగుబాటుకు సిద్ధమైనట్లు కన్పిస్తోంది.అయితే ఇదంతా బీజేపీ వ్యూహంలో భాగమే అన్న వాదనలు కర్ణాకటకలో జోరుగా వినిపిస్తున్నాయి.ఎగ్జిట్ పోల్స్ విడుదల అయిన సందర్భంగా కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోషన్ బేగ్  చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు కర్నాటక రాజకీయాల్లో కాక రేపుతున్నాయి.

కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు దినేష్ గూండూరావు, సిద్ధరామయ్య సహా సీఎల్‌పీ నేతలు ఎన్నికల ప్రచారాన్ని కూడా సరిగా నిర్వహించలేకపోయారని, రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి దిగజారడానికి వారే కారణమని కూడా రోషన్ బేగ్ మండిపడ్డారు.సిద్దరామయ్య పెద్ద అహంకారి అని,వెంటనే ఆయన సీఎల్పీ పదవికి,పీసీసీ ఇంచార్జి దినేష్ గుండురావ్ లు తమ పదవులకు రాజీనామా చేయాలని ఆయన అన్నారు.కర్ణాటక కాంగ్రెస్ ఇంచార్జి కేసీ వేణుగోపాల్ ని ఆయన ఓ బఫూన్ అంటూ తీవ్ర విమర్శలు చేశారు.రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ఒక్క ముస్లిం కూడా ఆ టీంలో ఉండరని ఆయన విమర్శించారు.పరిస్థితిని బట్టి కాంగ్రెస్‌ను వీడేందుకు, బీజేపీతో చేతులు కలిపేందుకు వెనుకాడేది లేదని పరోక్షంగా వెల్లడించారు.


 ఎన్డీయే తిరిగి అధికారంలోకి వస్తే పరిస్థికి అనుగుణంగా రాజీపడాలని ముస్లిం సోదరులకు నేను అప్పీల్ చేస్తున్నాను' అని ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్నారు. బీజేపీతో ముస్లింలు చేతులు కలపాలని మీ మాటలకు అర్ధమా అని మీడియా ప్రశ్నించినప్పుడు, అవసరమైతే చేతులు కలపాల్సి ఉంటుందని, ఒక పార్టీకి మనం (ముస్లింలు) విధేయులుగా ఉండిపోరాదని ఆయన సమాధానమిచ్చారు. కర్ణాటకలో ముస్లింలకు జరిగిన దేమిటి? కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు మాత్రమే ముస్లింలకు ఇచ్చిందని  రోషన్ బేగ్ విమర్శించారు.రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌ను వీడేందుకు నిర్ణయం తీసుకున్నట్టేనా అని మీడియా మళ్లీ అడిగినప్పుడు, పరిస్థితిని బట్టి అలా జరగొచ్చని అన్నారు. గౌరవం ఇవ్వని పార్టీలో మేము (ముస్లింలు) ఉండలేమని, హుందాగా, గౌరవంతో జీవించాలని తాము కోరుకుంటున్నామని, తమకు అలాంటి గౌరవం దక్కనప్పుడు అక్కడ తాము ఉండిపోలేమని, ఎవరైతే ప్రేమ, ఆప్యాయతలతో ముందుకొస్తారో వారితోనే తాము కలిసి ఉంటామని పరోక్షంగా కాంగ్రెస్ పట్ల తన అసంతృప్తిని వెల్లడించారు.
 

Congress
MLA
karnataka
muslims
BJP
ROSHAN
BAIG
Support
SIDDARAMAIH
DINESH GUNDURAO
KC Venugopal
BAFUN

మరిన్ని వార్తలు