చంపేద్దామని అనుకున్నారా : పరీక్షల్లో కాపీ కొట్టకుండా ముఖాలకు అట్టపెట్టెలు

Submitted on 19 October 2019
Karnataka college's 'out-of-the-box' method to check copying

పరీక్షల్లో పిల్లలు కాపీ కొట్టకుండా ఉండేందుకు కర్నాటకలోని ఓ కాలేజీ యాజమాన్యం చేసిన పని ఇప్పుడు చర్చకు దారితీసింది. కాలేజీ యాజమాన్యం తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇది టూ మచ్ అని పేరెంట్స్ ఫైర్ అవుతున్నారు. ఇంతకీ వారు ఏం చేశారో తెలుసా.. విద్యార్థుల ముఖాలకు అట్టపెట్టెలు తొడిగారు. అట్టపెట్టెకి ఓ వైపు మాత్రమే కట్ చేశారు. దీంతో విద్యార్థులు దిక్కులు చూడరని, కాపీ కొట్టలేరని కాలేజీ యాజమాన్యం వివరించింది.

పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ ని అడ్డుకునేందుకు స్కూల్, కాలేజీ యాజమాన్యాలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. కొందరు పెద్ద సంఖ్యలో ఇన్విజలేటర్లను పెడుతున్నారు. మరికొందరేమో ఏకంగా ఎగ్జామ్ హాల్స్ లో సీసీ కెమెరాలు బిగిస్తున్నారు. కర్నాటక రాష్ట్రం హవేరిలోని భగత్ పీయూ కాలేజీ యాజమాన్యం మరో అడుగు ముందుకేసింది. ఏకంగా విద్యార్థుల ముఖాలకు అట్టపెట్టెలు తొడిగింది. భగత్ పీయూ కాలేజీలో థర్డ్ మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. విద్యార్థులు పక్కచూపులు చూడకుండా వారి ముఖాలకు అట్టపెట్టెలు పెట్టించి మరీ పరీక్ష రాయించారు. కళ్ల భాగం వరకే తెరిచి ఉండేలా ముఖాలకు అట్టపెట్టెలు పెట్టడంతో కొంతమంది ఊపిరాడక ఇబ్బందులు పడ్డారు. 

మాల్ ప్రాక్టీస్ ని అడ్డుకునేందుకు అడ్మినిస్ట్రేటర్ సతీష్ ఈ పరిష్కారం సూచించారు. ఓ వైపు కట్ చేసి ఉన్న బాక్సులను విద్యార్థుల ముఖాలకు తొడిగారు. మూడు వైపుల బాక్స్ క్లోజ్ చేసి ఉంది. ఇలా చేయడం ద్వారా విద్యార్థులు దిక్కులు చూడటం కష్టం అవుతుందని, కాపీ కొట్టేందుకు చాన్సే ఉండదని యాజమాన్యం వివరించింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

కాగా ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. ఇది టూ మచ్ అని పేరెంట్స్ మండిపడ్డారు. ఈ ఎక్స్ పరిమెంట్ పరమ చెత్తగా ఉందని ఫైర్ అయ్యారు. తీవ్ర విమర్శలు రావడంతో విద్యాశాఖ అధికారులు స్పందించారు. వెంటనే ఆ ప్రయోగాన్ని ఆపాలని కాలేజీ పెద్దలను ఆదేశించారు. దీనిపై విచారణకు కూడా ఆదేశాలు ఇచ్చారు. ఆ కాలేజీ యాజమాన్యానికి షో కాజ్ నోటీసులూ జారీ చేశారు. వెంటనే దీనిపై వివరణ ఇవ్వాలన్నారు. అట్టపెట్టెల ఐడియా రివర్స్ అవడంతో కాలేజీ యాజమాన్యం తల పట్టుకుంది. అట్టపెట్టెల ఐడియా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Karnataka college
out of the box
check copying
cartoons

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు