సో గ్రేట్ : చాయ్ వాలా పెద్ద మనస్సుకు వీవీఎస్ లక్ష్మణ్ ఫిదా 

Submitted on 7 November 2019
Kanpur Tea Seller Mohammed Mahboob Malik  Is An Inspiration For VVS Laxman

ఓ సాధారణ చాయ్ వాలా పెద్ద మనస్సుకు ప్రముఖ మాజీ  క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఫిదా అయ్యారు. అతను చేస్తున్న సేవను ప్రశంసించారు లక్ష్మణ్. స్ఫూర్తినిస్తున్న నువ్వు సో..గ్రేట్ అంటూ తన ట్విట్టర్ ద్వారా అభినందించారు..

వివరాల్లోకి వెళితే..కాన్పూర్‌కు చెందిన చాయ్‌వాలా పేరు మహ్మద్ మహబూబ్ మాలిక్‌. శారదా నగర్ ఏరియాలో ఓ చిన్న టీ షాపు నడుపుతుంటాడు.అతని ఆదాయం అంతంత మాత్రమే. కానీ మనస్సుండాలే కాని మార్గం ఉండకపోదు అని నమ్మిన మాలిక్..టీ షాపుతో తనకు వచ్చే చిన్నపాటి ఆదాయంతో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 40మంది పిల్లలను చదివిస్తున్నాడు. టీ అమ్మడం ద్వారా వచ్చిన మాలిక్ ఆదాయంలో దాదాపు 80శాతం డబ్బును ఆ 40మంది పిల్లల  చదువు కోసం ఖర్చు పెడుతున్నాడు.

ఈ విషయం లక్ష్మణ్ కు తెలిసింది. దీంతో  మాలిక్ ఫొటోను ట్విట్టర్‌లో పోస్ చేశాడు.  ‘‘మాలిక్.. నువ్వు చేస్తున్న పని నలుగురికీ స్పూర్తిదాయకం’’ అంటూ ట్విట్టర్ ద్వారా అభినందించారు.  దీంతో నెటిజన్లు మాలిక్ పెద్ద మనస్సుని ప్రశంసిస్తున్నారు. 

నాలుగు సంవత్సరాలుగా స్కూల్ నిర్వహిస్తున్న మాలిక్..
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్‌లోని శారదా నగర్ ఏరియాలో నిరుపేద పిల్లల కోసం ఒక పాఠశాల నడుపుతున్నాడు. 2015లో ప్రారంభించిన ఈ పాఠశాల సుమారు 40 మంది పిల్లలకు ఉచిత విద్యనందిస్తున్నాడు. అంతేకాదు వారి యూనిఫాంలు, స్టేషనరీ, పుస్తకాలు మొదలైన వాటిని కూడా స్పాన్సర్ చేస్తున్నాడు. వారికి ఏవైనా అనారోగ్యం కలిగినా..ఆ ఖర్చులు కూడా మాలికే చూసుకుంటున్నాడు. 

UP
Kanpur Tea Seller
Mohammed Mahboob Malik
Inspiration For VVS Laxman
twetter

మరిన్ని వార్తలు