గురువు విగ్రహాన్ని ఆవిష్కరించిన శిష్యులు

Submitted on 8 November 2019
Kamal Haasan and Rajinikanth unveiled statue of the legendary filmmaker K Balachander

విశ్వనాయకుడు కమల్ హాసన్ తన 65వ పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు. నవంబర్ 7 కమల్ పుట్టినరోజే కాదు.. ఈ ఏడాదితో నటుడిగా 60 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. అదే రోజు తన తండ్రి శ్రీనివాసన్ వర్ధంతి కూడా కావడంతో, తమిళనాడు రాష్ట్రం రామాంతపురం జిల్లాలోని తన స్వగ్రామం పరమకుడిలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు కమల్..

నవంబర్ 8న చెన్నైలో తన సొంత ప్రొడక్షన్‌ రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ కోసం నిర్మించిన కొత్త కార్యలయం ప్రారంభోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు కమల్.. సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Read Also : NBK 106 క్రేజీ అప్‌డేట్

కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రముఖ దర్శకులు, స్వర్గీయ బాలచందర్ గారి విగ్రహాన్ని రజనీ, కమల్ కలిసి ఆవిష్కరించారు. తమకు నటనలో ఓనమాలు నేర్పించి, సినిమా రంగంలో సూపర్ స్టార్లుగా ఎదగడానికి బాటలు వేసిన గురువు  బాలచందర్ అంటే రజనీ, కమల్ ఇద్దరికీ ఎంతో గౌరవం.. కోలీవుడ్‌కి చెందిన పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

K Balachander
Kamal Haasan
rajinikanth
K Balachander statue

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు