చిరు చిన్నల్లుడు-దిల్లున్నోడు

Submitted on 11 February 2019
Kalyan Dev Pledged as a Organ Donar-10TV

మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుండి ఆయన తర్వాత చాలామంది హీరోలుగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి, సక్సెస్‌ఫుల్‌గా కెరీర్ కంటిన్యూ చేస్తున్నారు. ఇటీవలే చిరు మేనల్లుడు, సాయిధరమ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా హీరోగా రంగంలోకి దిగాడు. చిరంజీవి చిన్నకూతురు శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్.. విజేత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ రోజు కళ్యాణ్ దేవ్ బర్త్ డే.. పుట్టినరోజు నాడు కళ్యాణ్ చేసిన ఒక మంచి పనికి సోషల్ మీడియాలో హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది. అవయవ దానంపై అవగాహన కలిగిస్తూ, అపోలో హాస్పిటల్‌కి తన అవయవాలను చెయ్యనున్నట్టు చెప్పాడు.

ఈ మేరకు అపోలో వారిని కలిసి, ఆర్గాన్ డొనేషన్‌కి సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్తి చేసాడు.. కళ్యాణ్ దేవ్ చేసిన మంచిపనికి మెగా ఫ్యాన్స్ అతణ్ణి ప్రశంసిస్తున్నారు. త్వరలో కళ్యాణ్ రెండవ సినిమాకి సంబంధించిన అప్‌డేట్స్ తెలియనున్నాయి.

Kalyan Dev
Happy Birthday Kalyan Dev
Apollo
Kalyan Dev Pledged as a Organ Donar

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు