కోహ్లీకి కోడికూర : నల్లకోడి తిని.. బలంగా ఉండండి

Submitted on 3 January 2019
kadak diet tip for virat kohli and team india

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇతర టీమిండియా సభ్యులు తమ రోజువారీ ఆహారంలో గ్రిల్డ్ చికెన్ తీసుకుంటున్నట్లు మీడియా ద్వారా తెలిసిందని, గ్రిల్డ్ చికెన్ లో కొలస్ట్రాల్, కొవ్వు శాతం అధికంగా ఉంటాయని వెంటనే ఆటగాళ్లు అది తినడం మానివేయాలని మధ్యప్రదేశ్ జబువాలోని కషి విఘ్యాన్ కేంద్ర(కడక్ నాథ్ రీసెర్చ్ సెంటర్) హెడ్ డాక్టర్ ఎస్ థోమర్ బీసీసీఐ, విరాట్ కోహ్లీకి లేఖ రాశారు. తక్కువ కొలస్ట్రాల్, కొవ్వు శాతం తక్కువగా, ఐరన్ శాతం అధికంగా, ప్రొటీన్లు ఎక్కువగా ఉండే కడక్ నాథ్ చికెన్ ను ఆటగాళ్లు తమ రోజువారీ ఆహారంలో తీసుకోవాలని లేఖ ద్వారా కోరారు. కడక్ నాథ్ చికెన్ తినడం వల్ల ఆటగాళ్లు మరింత ఎనర్జీతో ఉండగలరని తెలిపింది. బ్లాక్ ఎంచుకోండి..ఫిట్ గా ఉండండి అంటూ ఆయన తన లేఖ ద్వారా టీమిండియా ఆటగాళ్లను కోరారు.


 నల్లగా మసిబొగ్గులా ఉండే కడక్ నాథ్ కోళ్లకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒకప్పుడు అంతరించిపోయే దశలో ఉన్న ఈ కడక్ నాథ్ జాతి కోళ్లు ఇప్పుడు  జబువా జిల్లాలో ఫౌల్ట్రీ వ్యాపారంగా వెలిగిపోతుంది.  సాథారణ పౌల్ట్రీ కోళ్లలో 18శాతం పొట్రీన్లు ఉంటే కడక్ నాథ్ లో వీటి శాతం 21-24 మధ్యలో ఉంటుంది. కొవ్వు శాతం సాధారణ ఫౌల్ట్రీ కోళ్లలో 25శాతం ఉంటే కడక్ నాథ్ కోళ్లలో 1.94-2.6శాతం మాత్రమే ఉంటుంది. కొలస్ట్రాల్ కూడా సాధారణ ఫౌల్ట్రీలో 100 గ్రాములకి 218 మిల్లీ గ్రాములు ఉంటే కడక్ నాథ్ లో 100 గ్రాములకు 59 మిల్లీగ్రాములు ఉంటుంది.

అంతేకాకుండా ఈ చికెన్ తినడం వల్ల అనేక వ్యాధులు కూడా నయమయ్యే అవకాశముందని సైంటిస్టులు తేల్చారు. భారత్ లోని ఢిల్లీ, ముంబై నగరాల్లోని ఫైవ్ స్టార్ హోటళ్లు కడక్ నాథ్ జాతి కోళ్లను దిగుమతి చేసుకుంటున్నాయి. ప్రత్యేక ధరలతో విదేశాల్లోని హోటళ్లు కూడా ఈ కోళ్లను దిగుమతి చేసుకుంటున్నాయి. ఇటీవల కడక్ నాథ్ జాతి కోళ్లకు గాను మధ్యప్రదేశ్ జీఐ ట్యాగ్ గుర్తింపు పొందింది. మధ్యప్రదేశ్ లోని బిల్, బిలాలా కమ్యూనిటి సభ్యలు సంప్రదాయంగా తమ రోజువారీ ఆహారంలో కడక్ నాథ్ ని తీసుకుంటారు. అయితే వీటిని కలిమసి అనే పేరుతో వారు పిలుస్తారు.  బీసీసీఐ సమాధానం కోసం ఎదురుచూస్తున్నామని, పాజిటీవ్ రెస్ఫాన్స్ వస్తే తాము ఈ జాతి కోళ్ల గురించి అధిక సమాచారం ఇస్తామని, వాటి సేకరణలో బీసీసీఐకి తాము సహాయం అందిస్తామని డాక్టర్ థోమర్ తెలిపారు.

kohli# kadaknath chiken# energy

మరిన్ని వార్తలు