పాల్ పైత్యం : విజయమ్మ, షర్మిల నాకే ఓటు వేస్తారు

Submitted on 17 February 2019
KA Paul Sensational Comments On YS Jagan Mohan Reddy

ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ వింత వింతగా మాట్లాడుతున్నారు. ఆయన చేసే వ్యాఖ్యలు జనాలను విస్మయానికి గురి చేస్తున్నాయి. తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో తెలియదు కానీ.. పాల్‌ను జనాలు కమెడియన్‌లా చూస్తున్నారు. తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ గురించి పాల్ చేసిన కామెంట్స్ షాక్‌కు గురి చేశాయి. జగన్ ఓట్లు  చీల్చడానికే తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు కొందరు ఆరోపిస్తున్నారని.. కానీ అందులో వాస్తవం లేదని పాల్ అన్నారు. జగన్ ఓట్లు చీల్చడానికి నేనొందుకు వస్తాను అని ఆయన  ప్రశ్నించారు. అసలు జగన్‌కు ఓట్లు ఉంటేనే కదా చీల్చడానికి అని పాల్ బాంబు పేల్చారు.

నేను వచ్చిన తర్వాత ఆయనకు నూటికి 10ఓట్లు కూడా లేవన్నారు. ఇంకొక్క 75 రోజులు తర్వాత..  జగన్ తల్లి విజయమ్మ గారే... ఓరేయ్ నీకెందుకు రా రాజకీయం. ఇంట్లో ఉండరా. లేదా 20 ఏళ్లు జైలుకి వెళతావు అని జగన్‌తో అంటారని పాల్ చెప్పారు. అంతేకాదు జగన్ తల్లి విజయమ్మ, చెల్లి  షర్మిల కూడా నాకే ఓటు వేస్తారని పాల్ తెలిపారు. షర్మిల భర్త అనిల్‌కి నేనంటే అభిమానం అని, ఆయన కూడా నాకే ఓటు వేస్తారని పాల్ చెప్పడం విశేషం.

 

ఇక.. తనకు మెంటల్ ఉందని ఎర్రగడ్డ ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం జరిగిందని పాల్ అన్నారు. తనను ఇప్పటికీ ఎర్రగడ్డ ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.  ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ ఉన్న సువార్తికుడిగా ఆర్టికల్స్‌ వచ్చాయన్నారు. ఏ రోజు ఎప్పుడు ఎక్కడ ఉన్నానో చెప్పగల మెమరీ తనకు ఉందని గొప్పలు చెప్పారు.

ka paul sensational comments on ys jagan
Ysrcp
ys jagan votes
vijayamma
sharmila
ap elections

మరిన్ని వార్తలు