ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు రాజీనామా

Submitted on 27 May 2019
K Raghavendra Rao Resigns for SVBC Channel

టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తి ఛానల్ "శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్"(SVBC) ఛానెల్ చైర్మన్ పదవికి దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు రాజీనామా చేశారు. వయోభారం కారణంగా చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్టు ఆయన వెల్లడించారు. టీటీడీ యాజమాన్యానికి, సిబ్బందికి ఆ తిరుమలేశుడి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నట్టు ఆయన కోరుకున్నారు. తనకు ఇన్నాళ్లు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

రాఘవేంద్ర రావు 2015 నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా ఉంటున్నారు. టీటీడీ బోర్డు మీటింగ్ జరగనున్న నేపధ్యంలో బోర్డు సభ్యులు రాజీనామాలు చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తుండగా.. అంతకుముందే రాఘవేంద్ర రావు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా ఏపీలో ప్రభుత్వం మారిన క్రమంలో టీటీడీలో కూడా మార్పులు జరిగే అవకాశం కనిపిస్తుంది. 

K Raghavendra Rao
TTD
SVBC Channel

మరిన్ని వార్తలు