
ఓ జడ్జి పెద్ద మనస్సుతో చేసిన పని అందరి మనస్సులను గెలుచుకుంటోంది. ఓ మహిళా అడ్వకేట్ బిడ్డను ఎత్తుకుని..చక్కగా లాలిస్తూ ఆమెతో ప్రమాణం చేసిన జడ్జి వీడియో పసిబిడ్డను సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అమెరికాలో జరిగిన ఈ సంఘటన అందరి మనస్సుల్ని గెలుచుకుంటోంది. జులియానా లామర్ అనే యువతి లా కోర్స్ చదివే సమంయలో గర్భం దాల్చింది. ఆమె కోర్స్ పూర్తయ్యేనాటికి పండండి బిడ్డకు జన్మనిచ్చింది. అంతేకాదు తాను లాయర్ గా ప్రమాణం చేస్తున్న సమయంలో ఆ బిడ్డ ఏడుపు మొదలు పెట్టింది. దీంతో జులియానాతో లాయర్ గా ప్రమాణం చేయిస్తున్న జడ్జ్ రిచర్డ్ డింకిన్స్ జులియానా బిడ్డను ఒక చేత్తో ఎత్తుకుని లాలిస్తూనే..మరో చేత్తో ప్రమాణ పత్రాన్ని పట్టుకుని ఆమెతో ప్రమాణం చేయించారు.
ఈ సందర్భంగా జడ్జ్ రిచర్డ్ డింకిన్స్ మాట్లాడుతూ..చిన్ని బిడ్డను ఎత్తుకుని ప్రమాణం చేయించటంతో వర్ణించలేదని అనుభూతిని కలిగించిందని అన్నారు. బిడ్డను ఎత్తుకుని ప్రమాణం చేయించిన ఈ క్లిప్ తన లా స్కూల్ సహోద్యోగి సారా మార్టిన్ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో తిరిగి షేర్ చేసిన ఈ వీడియోకు నెటిజన్లు ఫిదా అయ్యారు. లక్ష మందికి పైగా దీన్ని వీక్షించారు.
జడ్జ్ రిచర్డ్ డింకిన్స్ కు ప్రెసిడెన్షియల్ గుడ్ హ్యుమానిటీ అవార్డు ఇవ్వాలని కొందరు అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. మరికొందరు స్త్రీలకు గౌరవించే సంప్రదాయం ఉందని చెప్పటానికి ఇదొక చక్కని ఉదాహరణ అంటు అభివర్ణించారు. జులియానా బిడ్డ సరిగ్గా ప్రమాణం చేసే సమయానికి ఏడ్వటం వల్లనే ఇంత గొప్ప మానవీయ దృశ్యం ప్రపంచానికి దక్కిందని అభిప్రాయపడుతున్నారు. ఆ పిల్లాడు పెద్దయ్యాక ఈ వీడియోను దాచి ఉంచి చూపించాలని ..అది అతనికి చక్కటి అనుభూతిని కలిగిస్తుందని ఇంకొందరు సూచించారు.