భారత్ దెబ్బకు దిగొచ్చిన పాక్ : ఉగ్రవాద సంస్థలపై నిషేధం

Submitted on 21 February 2019
JuD, FIF banned

పుల్వామా ఉగ్రదాడితో ఇక పాక్ విషయంలో చర్చలు ఉండబోవని, చర్యలే ఉంటాయని భారత ప్రభుత్వం పాక్ కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాక్ విషయంలో భారత్ కఠిన చర్యలకు దిగుతోంది. అదే సమయంలో దౌత్యపరంగా భారత్ చేస్తున్న ప్రయత్నాలకు దిగొచ్చిన పాక్ ప్రభుత్వం అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్ నేతృత్వంలోని జమాత్ ఉద్ దవా(JUD), ఫలాహ్-ఈ-ఇన్సానియత్ షౌండేషన్(FIF)లపై నిషేధాన్ని పునరుద్ధరించింది.

గురువారం(ఫిబ్రవరి-21,2019) పాక్ ప్రధాని కార్యాలయంలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలో సమావేశమైన జాతీయ భధ్రతా కమిటీ జేయూడీ,ఎఫ్ఐఎఫ్ లపై ఉన్న నిషేధాన్ని పునరుద్ధరించింది. పుల్వామా ఉగ్రదాడి సేపథ్యంలో భౌగోళిక,వ్యూహాత్మక, జాతీయ భధ్రత పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించారు.2017ఫిబ్రవరిలో అప్పటి పాక్ ప్రెసిడెంట్ మమ్నూన్ హుస్సేన్ యాంటీ టెర్రరిజం చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ జారీ చేశారు. దీని ప్రకారం ఉగ్రవాద సంస్థలు, ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, ఐక్యరాజ్యసమితి భధ్రతా కౌన్సిల్ లిస్ట్ లోని సంస్థలపై కూడా నిషేధం విధించబడింది. ఈ చర్య ద్వారా జేయూడీ,ఎఫ్ఐఎఫ్ లపై నిషేధం విధించినట్లయింది.

అయితే ఈ ఆర్డినెన్స్ కాలం ముగిసిపోవడంతో నిషేధిత సంస్థల జాబితా నుంచి హఫీజ్ సయూద్ కి చెందిన రెండు సంస్థలకు స్వేచ్ఛ కలిగింది. అయితే అప్పుడు రద్దు అయిన నిషేధాన్ని ఇప్పుడు మళ్లీ పునరుద్ధరిస్తూ ఇమ్రాన్ నిర్ణయం తీసుకొన్నారు. అయితే ఈ నిషేధానికి పెద్దగా విలువ ఉండదన్న విషయం అందరికీ తెలిసిందే. ఏదో తూతూ మంత్రంగా ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకొంటున్నట్లు ప్రపంచాన్ని నమ్మించేందుకు పాక్ ఈ నిర్ణయం తీసుకొంది. ఎప్పటిలానే హఫీజ్ సయూద్ పాక్ లో స్వేచ్ఛగా విహరిస్తూ తన కార్యక్రమాలను కొనసాగించడం,పాక్ ఎటువంటి చర్యలు తీసుకోకపోడం మామూలే.

Pak
PULWAMA
ban
jud
fif
nsc
Orders
IMRAN KHAN
Mamnoon Hussain
Hafiz Saeed
organizations

మరిన్ని వార్తలు