ఫీచర్స్ సూపర్ అంట : జియో 3 కమింగ్ సూన్

Submitted on 9 February 2019
JioPhone 3 coming this year: Specifications, expected price and launch date

రిలయన్స్ జియో లవర్స్ కు గుడ్ న్యూస్. మరో జియో కొత్త ఫోన్ మార్కెట్లోకి వచ్చేస్తోంది. అదే జియో ఫోన్ 3. అత్యంత చౌకైన ధరకే స్మార్ట్ మొబైల్ ఫోన్లను మార్కెట్లోకి తెచ్చిన జియో ఫోన్ కంపెనీ ఈ ఏడాది కొత్త మోడల్ ను లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే మార్కెట్లో జియోఫోన్, జియో ఫోన్ 2 సేల్స్ సునామీ సృష్టిస్తున్నాయి. రానున్న జియో 3 ఫోన్ అచ్చం బ్లాక్ బెర్రీ మోడల్ ను పోలి ఉండి యూజర్లను మరింత ఎట్రాక్ట్ చేస్తోంది. 


అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫీచర్లు, ఫాస్ట్ డేటా నెట్ వర్క్ అందిస్తుండటంతో అందరూ జియో స్మార్ట్ ఫోన్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. జియో ఫోన్ 2 ను మార్కెట్లోకి విడుదల చేసి సక్సెస్ సాధించిన జియో.. జియో 3 ఫోన్ ను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తున్నట్టు కంపెనీ ఎగ్జిక్యూటీవ్ ఓ వెబ్ సైట్ లో ఎక్స్ క్లూజివ్ రిపోర్ట్ ను పెట్టారు.

 

ఈ ఏడాది జూన్ లో జియో 3 ఫోన్ లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలిపారు. అదే నెలలో జియో కొత్త ఫోన్ Free ఆర్డర్లు ప్రారంభం అవుతాయిని, ఆగస్టు నుంచి కొత్త ఫోన్ షిప్ మెంట్స్ స్టార్ట్ అవుతాయని చెప్పారు. ప్రస్తుతం జియో ఫోన్ రెండు మోడళ్ల కంటే ఈ జియో ఫోన్ 3 లో ఫీచర్లు మరింత ఆకర్షణీయంగా ఉంటాయట. తొలి మోడల్ ఫోన్లో T9 కీప్యాడ్ ఉండగా.. జియో ఫోన్ 2 లో QWERTY కీ ప్యాడ్ మాత్రమే ఉంది. కొత్తగా వచ్చే జియో 3 ఫోన్ లో Touch Screen తో రానుంది. జియో ఫోన్ 3 ధర రూ.4వేల 500 వరకు ఉండే అవకాశం ఉంది. 

జియో ఫోన్ 3 ఫీచర్లు ఇవే.. 
Display :  5 అంగుళాల బిగ్గర్ స్ర్కీన్. రీకాలింగ్ ఆప్షన్. 
Design : బ్లాక్ బెర్రీ డిజైన్, టైపికల్ ఫీచర్ ఫోన్, ప్లాస్టిక్ బాడీ (నాట్ రివీల్డ్)
Battery: 3000 మెగాహెడ్జ్ బ్యాటరీ సైజు 
Camera : 5 మెగాఫిక్సల్ రియర్ కెమెరా, 2 మెగా ఫిక్సల్ సెల్ఫీ కెమెరా
OS:  గూగుల్ ఆండ్రాయిడ్ గో OS, 2GB RAM 
Storage:  ఇంటర్నల్ స్టోరేజీ 64GB, ఎక్స్ పాండబుల్ మైక్రో SD కార్డు
Price : జియో ఫోన్ 3 ధర రూ. 4వేల 500 మాత్రమే

Read Also:  జియో ఆస్తులు అమ్ముతున్న అంబానీ

Read Also:  కండిషన్స్ అప్లై: వోడాఫోన్ కొత్త రీఛార్జ్ ప్లాన్

Read Also:  టాక్ టైమ్ ఈజ్ బ్యాక్ : వోడాఫోన్ 3 రీఛార్జ్ ప్లాన్స్ ఇవే

Read Also:  ఓపిక పట్టండీ : 3 నెలల్లో భారీగా తగ్గనున్న DTH ఛానళ్ల ధరలు

Read Also:  ఎంపీకే షాక్ : సీఎం రమేష్ వాట్సాప్ బ్యాన్

Read Also:  వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక: మీ అకౌంట్ బ్లాక్ కాకూడదంటే..

JioPhone 3
specifications
QWERTY keypad
Touchscreen display
JIO
Jio phone 2

మరిన్ని వార్తలు