ట్రాయ్ రిపోర్ట్ : 4G మొబైల్ బ్రాడ్‌ బ్యాండ్‌లో జియోనే టాప్ 

Submitted on 17 September 2019
Jio tops TRAI's 4G mobile broadband chart in August with 21.3 mbps speed

రిలయన్స్ జియో మరో రికార్డు సృష్టించింది. 4G మొబైల్ బ్రాడ్ బ్యాండ్ చార్ట్‌లో రిలయన్స్ జియో అగ్రస్థానంలో నిలిచింది. ఆగస్టు నెలలో సగటున 21.3 Mbps డౌన్ లోడ్ స్పీడ్‌తో టాప్ లో నిలిచినట్టు టెలికం రెగ్యులేటర్ TRAI రిపోర్టులో ప్రకటించింది. అప్ లోడ్ స్పీడ్ లో రిలయన్స్ జియో 5.5mbps స్పీడ్ తో ముందంజలో కొనసాగుతోంది.

జియో డౌన్ లోడ్ స్పీడ్ ఎక్కువగా ఉండటంతో ఆన్ లైన్ వీడియో, మెసేజ్ లను యూజర్లు ఈజీగా పొందేందుకు సాయపడినట్టు రిపోర్టు తెలిపింది. మరి కొంతమంది యూజర్లకు జియో అప్ లోడింగ్ స్పీడ్ తో ఫొటోలు, వీడియోలు, ఇతర డాక్యుమెంట్లను ఆన్ లైన్ లో సులభంగా పంపేందుకు వీలైందని పేర్కొంది. 

ఆగస్టులో 4G ట్రాయ్ చార్ట్ లో.. ఎయిర్ టెల్ సగటున 8.2 mbps డౌన్ లోడ్ స్పీడ్‌తో జియో తర్వాతి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వోడాఫోన్ (7.7mbps), ఐడియా సెల్యూలర్ (6.1mbps)తో వరుసగా నిలిచాయి. మొబైల్ బిజినెస్ కోసం వోడాఫోన్, ఐడియాలో విలీనం అయినప్పటికీ, రెండెంటికీ సంబంధించి పనితీరును TRAI వేర్వేరుగా రిపోర్టు ఇచ్చింది. అప్ లోడ్ సిగ్మంట్ లో ఐడియా నెట్ వర్క్ 5.1 mbps స్పీడ్ తో వోడాఫోన్ తర్వాతి స్థానంలో నిలిచింది. 

జియో (4.4mbps), ఎయిర్ టెల్ (3.1mbps) స్పీడ్ తో స్థానల్లో ఉన్నాయి. ప్రభుత్వ టెలికం రంగ సంస్థ BSNL మాత్రం 3G డౌన్ లోడ్, అప్ లోడ్ సగటు స్పీడ్‌తో ట్రాయ్ చార్ట్ లో ఆధిక్యంలో కొనసాగుతోంది. బీఎస్ఎన్ఎల్ 3G డౌన్ లోడ్ స్పీడ్ 2.6mbps, అప్ లోడ్ స్పీడ్ 1.2mbps రికార్డు అయింది. డౌన్ లోడ్ స్పీడ్ లో 2mbps తో ఐడియా తర్వాతి స్థానంలో బీఎస్ఎన్ఎల్ నిలవగా.. వోడాఫోన్ 1.8mbps, ఎయిర్ టెల్ 1.5mbps స్పీడ్ తో తర్వాతి స్థానంలో ఉన్నాయి. 

అప్ లోడ్ స్పీడ్ లో మాత్రం అన్ని ప్రైవేట్ సంస్థలు మాత్రం బీఎస్ఎన్ఎల్ కంటే వెనుకబడి ఉన్నాయి. వోడాఫోన్, ఐడియా నెట్ వర్క్ లు 1.1mbps 3G అప్ లోడ్ స్పీడ్ తో దగ్గరి పోటీదారులుగా నిలిచాయి. ఎయిర్ టెల్ 3G నెట్ వర్క్ యావరేజ్ అప్ లోడ్ స్పీడ్ 0.7mbpsగా రికార్డు అయినట్టు ట్రాయ్ డేటా వెల్లడించింది. దేశ వ్యాప్తంగా రియల్ టైం ఆధారిత మైస్పీడ్ అప్లికేషన్ సాయంతో ట్రాయ్ డేటా ఆధారంగా మొబైల్ బ్రాడ్ బ్యాండ్ నెట్ వర్క్ యావరేజ్ స్పీడ్‌ను గణించింది.  

JIO
reliance jio
4G mobile broadband
TRAI
chart
mbps speed
Vodaphone
Airtel
bsnl network

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు