మొబైల్, వెబ్ వెర్షన్ : ‘Jio News’ యాప్ వచ్చేసింది

Submitted on 12 April 2019
Jio News With Support for Over 12 Indian Languages Debuts on Android, iOS, Web

ప్రముఖ రిలయన్స్ జియో కొత్త యాప్ ను రిలీజ్ చేసింది. ఎన్నికలు.. ఐపీఎల్ సీజన్ వేళ స్మార్ట్ యూజర్ల కోసం రిలయన్స్ సంస్థ.. ‘జియో న్యూస్’ యాప్ ను ప్రవేశపెట్టింది. ఈ యాప్.. Android,  iOS  యూజర్లకు అందుబాటులో ఉంటుంది. అంతేకాదు.. మొబైల్ యూజర్లకు మాత్రమే కాకుండా.. వెబ్ ఆధారిత వెబ్ సైట్ ను కూడా జియో లాంచ్ చేసింది. ఎప్పటికప్పుడూ ప్రపంచ వ్యాప్తంగా రియల్ టై న్యూస్ అప్ డేట్స్  ఈ యాప్ ద్వారా పొందవచ్చు. 2019 లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు, IPL 2019, రాబోయే ప్రపంచ కప్ తాజా కథనాలను జియో న్యూస్ యాప్ ద్వారా చూడవచ్చు.

12  ప్రాంతీయ భాషలకు సపోర్ట్ :
ఈ యాప్ మొత్తం 12 భారతీయ భాషలకు సపోర్ట్ చేసేలా రూపొందించారు. 150కుపైగా లైవ్ న్యూస్ ఛానెళ్ల ప్రసారాలు, 800 మ్యాగజైన్లు, 250 ప్లస్ న్యూస్ పేపర్లు, వివిధ ఆన్ లైన్ బ్లాగుల న్యూస్ కంటెంట్ ను ఎప్పటికప్పుడూ ఈ జియో న్యూస్ ద్వారా పొందవచ్చు. మొబైల్ వెర్షన్ మాత్రమే కాదు.. వెబ్ వెర్షన్ కూడా అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా, భారత్ లోని అన్ని News Websites న్యూస్ అప్ డేట్స్ కూడా చూడవచ్చు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మిషన్ లెర్నింగ్ (ఎంఐ) టెక్నాలజీతో రూపొందించిన ఈ జియో న్యూస్ యాప్ ద్వారా వేలాది న్యూస్ సోర్స్ కంటెంట్ ను యూజర్లు సెర్చ్ చేయవచ్చు. 
Read Also : ఏప్రిల్ 11 నుంచే : PUBG గేమ్ బ్యాన్

ఇండియాలో మాట్లాడే ప్రాంతీయ భాషల్లో న్యూస్ కంటెంట్ ను జియో అందించనుంది. బెంగాలీ, ఇంగ్లీష్, గుజరాతీ, హిందీ, మరాఠి, పంజాబీ, తమిళ్, ఉర్దూ భాషల్లో జియో న్యూస్ సర్వీసును అందించనున్నట్టు మీడియా సమావేశంలో రిలయన్స్ జియో వెల్లడించింది. అంతేకాదు.. యూజర్లు తమకు నచ్చిన న్యూస్ వెబ్ సైట్ల సిగ్మెంట్లు (పాలిటిక్స్, స్పోర్ట్స్, ఎంటర్ టైన్ మెంట్, బిజినెస్, టెక్నాలజీ, లైఫ్ స్టయిల్, ఫ్యాషన్, హెల్త్, ఫైనాన్షియల్)ను తమ హోంపేజీగా ఎంచుకోవచ్చు. 150 లైవ్ టీవీ న్యూస్ ఛానెళ్ల న్యూస్ అప్ డేట్స్ ను టెక్స్ట్ ఫార్మాట్ లో యూజర్లు పొందవచ్చు. ఇందులో ట్రెండింగ్ వీడియోలు, ఆటోమోటీవ్, బాలీవుడ్, ఫ్యాషన్, హెల్త్, టెక్నాలజీ, స్పోర్ట్స్ న్యూ వీడియోలను పొందవచ్చు.

Jio న్యూస్.. మైగ్రేట్ కావొచ్చు :
జియో న్యూస్ అదనంగా జియో ఎక్స్ ప్రెస్ న్యూస్, జియో మ్యాగ్స్, జియో న్యూస్ పేపర్, లైవ్ టీవీ, వీడియోలను ఆఫర్ చేస్తోంది. రిలయన్స్ జియో యాప్ ను వాడుతున్న యూజర్లు.. జియో న్యూస్ కు మైగ్రేట్ అయ్యే అవకాశం ఉంది. జియో యూజర్లకు ప్రత్యేకించి ప్రీమియం యాక్సస్ ను అందిస్తోంది. నాన్ జియో యూజర్లు ఈ యాప్ సర్వీసును యాక్సస్ చేసుకోవాలంటే.. జియో న్యూస్ ట్రయల్ పిరియడ్ ద్వారా లాగిన్ కావాల్సి ఉంటుంది.  

జియో న్యూస్ యూజర్లు.. మ్యాగజైన్లు, న్యూస్ పేపర్ల అప్ డేట్స్ ను తమ డివైజ్ ల్లో డౌన్ లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా నేరుగా చదువుకోవచ్చు.  జియో న్యూస్ యాప్.. గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో అందుబాటులో ఉంది. ఈ యాప్ ను వెబ్ ఆధారిత సర్వీసు డెస్క్ టాప్ పై కూడా యాక్సస్ చేసుకోవచ్చు.
Read Also : భారీ కుంభకోణం : 20 బ్యాంకుల నుంచి రూ.2వేల 500 కోట్లు దోచేశారు

Jio News
12 Indian Languages
Android
iOS
Web


మరిన్ని వార్తలు