వెరీ చీప్ : జియో 4జీ డేటా ప్లాన్ వోచర్లు ఇవే

Submitted on 15 February 2019
Jio 4G data vouchers available users can avail to speed data more

ప్రముఖ రిలయన్స్ జియో నెట్ వర్క్ సరికొత్త ఆఫర్లతో దేశవ్యాప్తంగా తమ వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఇప్పటికే అన్ లిమిటెడ్ ఫ్రీ వాయిస్ కాల్స్, డేటా సర్వీసులను అందిస్తోన్న జియో.. వెరీ చీపెస్ట్ 4జీ డేటా ప్లాన్ రూ.11, రూ.21, రూ. 51, రూ.101 వోచర్లను అందుబాటులోకి తెచ్చింది. 4జీ డేటా ప్లాన్ ఆఫర్లలో అన్ లిమిటెడ్ ఫ్రీ వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ బెనిఫెట్స్ ప్యాక్ బండెల్స్ ను ప్రవేశపెట్టింది.

ఇందులో వ్యాలిడెటీ ఫిరియడ్, ప్రైస్ బ్రాకెట్స్, బెనిఫెట్స్ కు సంబంధించిన అన్నీ వోచర్లు జియో కంపెనీ వెబ్ సైట్ లో రూ.11 డేటా వోచర్లు నుంచి అందుబాటులో ఉన్నాయి. సాధారంగా డేటా ప్లాన్ FUP పరిమితి మించితే.. ఆ తరువాత మీ ఫోన్లలో నెట్ స్పీడ్ తగ్గిపోతుంది. FUP లిమిట్ దాటిన తరువాత 60kbps కు స్పీడ్ పడిపోతుంది. దీంతో డేటా యూజర్లు చిరాకు పడుతుంటారు. 

అందుకే జియో తమ యూజర్ల కోసం అన్ లిమిటెడ్ డేటా ప్లాన్లను అతి తక్కువ ధరకే అందిస్తోంది. దీనివల్ల FUP లిమిట్ దాటినప్పటికీ మీ డేటా స్పీడ్ ఎంతమాత్రం పడిపోదు. జియో 4జీ డేటా వోచర్లు వాడితే మీ డేటా పరుగులు పెట్టాల్సిందే. మీరు ఏదైనా ఎగ్జిస్టింగ్ డేటా ప్లాన్ లో ఉంటే.. ఆ డేటా ప్లాన్ కాలపరిమితిపైనే డేటా బూస్టర్ వర్తిస్తుంది. మీరు వాడే డేటా ప్లాన్ లిమిట్ దాటినప్పుడు స్పీడ్ తగ్గకుండా ఈ బూస్టర్ 4జీ డేటా ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే చాలు.
 

జియో ప్లాన్ కింద రూ.142 యాక్టివేట్ చేసుకుంటే.. మీకు రోజుకు 1.5జీబీ డేటా వస్తుంది. ఒకరోజులో వాడాల్సిన డేటా మొత్తం గంటల వ్యవధిలోనే వాడేస్తే.. మీ డేటా స్పీడ్ 60కేబీపీఎస్ లకు పడిపోతుంది. డేటా వేగం తగ్గిపోతుంది. చిరాకు తెప్పిస్తుంది. మళ్లీ డేటా కావాలంటే మరుసటి రోజు (12AM)దాటే వరకు వేచిచూడాల్సిందే. అప్పటివరకూ ఉండలేము.. కంటిన్యూగా డేటా కావాలంటే మాత్రం 4జీ డేటా వోచర్లను యాక్టివేట్ చేసుకోవాల్సిందే. జియో యూజర్లు ప్రీపెయిడ్ లేదా పోస్ట్ పెయిడ్ ప్లాన్ యాక్టివేట్ చేసుకొని ఉంటే చాలు.. 4జీ డేటా వోచర్ ప్లాన్ పొందొచ్చు. 4జీ వాయిస్ కాల్స్ ఎప్పుడూ ఉచితమే. కాల్స్ కు వోచర్ డేటాతో సంబంధం లేదు. డేటా కట్ కానేకాదు. 

జియో 4జీ డేటా వోచర్లు మీకోసం.. 
* రూ. 11 డేటా వోచర్ : ఈ ఆఫర్ పై 400 ఎంబీల అన్ లిమిటెడ్ 4జీ డేటా పొందొచ్చు ఎగ్జిస్టింగ్ డేటా ప్లాన్ వ్యాలిడెటీ ఫిరయడ్ పైనే వర్తిస్తుంది. 
* రూ.21 డేటా వోచర్ : ఈ వోచర్ పై 1జీబీ అన్ లిమిటెడ్ 4జీ డేటా ఆఫర్ సేమ్ వ్యాలిడేటీపై అందిస్తోంది. 
* రూ.51 డేటా వోచర్ : జియో అందించే ఈ వోచర్ పై 3జీబీ అన్ లిమిటెడ్ 4జీ డేటా పొందొచ్చు.. సేమ్ వ్యాలిడెటీ.
* రూ. 101 డేటా వోచర్ : ఈ ఆఫర్ పై జియో అందించే డేటా 6జీబీ అన్ లిమిటెడ్ 4జీ డేటాను సేమ్ వ్యాలిడేటీపై పొందొచ్చు.  

Also Read : TikTok పట్టించింది : టీ అమ్ముతున్న సీఎం యోగి డూప్

Also Read : రక్తం మ‌రుగుతోంది : బుడ్గామ్ సీఆర్పీఎఫ్ క్యాంప్ కి జ‌వాన్ల‌ మృతదేహాలు

Also Read : వన్ నేషన్ - వన్ నెంబర్ : 112 గుర్తుపెట్టుకుంటే చాలు

JIO
4G data
vouchers
FUP limit 

మరిన్ని వార్తలు