ఏప్రిల్ 8 నుంచి.. 12 విడతల్లో JEE మెయిన్స్‌

Submitted on 16 March 2019
JEE Mains 2019 Exam Latest Schedule Realeased

జాతీయ స్థాయి ఇంజనీరింగ్‌ విద్యా సంస్థల్లో (BE/B-TECH) కోర్సుల్లో ప్రవేశానికి JEE మెయిన్స్‌–2019 పరీక్షలను ఏప్రిల్ 8 నుంచి 12 విడతల్లో నిర్వహించాలని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్ణయించింది. (B.Arch/B.Planning) కోర్సుల్లో ప్రవేశాలకు ఏప్రిల్‌ 7న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. లోక్‌సభ ఎన్నికలు వచ్చే నెల 11, 18, 23, 29 తేదీల్లో, మే 6, 12, 19 తేదీల్లో నిర్వహించనున్నారు. జాయింట్ ఎంట్రన్స్ పరీక్షలో పేపర్ 1 (BE/B-TECH), పేపర్ 2 (B.Arch/B.Planning) అనే రెండు సెట్స్ ఉంటాయి.

అభ్యర్ధులు ఇంటర్మీడియట్, BSC కనీసం 75% మార్కులతో విద్యా అర్హత కలిగి ఉండాలి. అన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వాస్తవానికి ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్‌ 7 నుంచి 20వ తేదీ మధ్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొత్త షెడ్యూల్ రిలీజ్ చేశారు.

JEE Main 2019
Exam Schedule
Latest Schedule
2019

తెలంగాణలో ఆంధ్రవాళ్లను కొడుతున్నారన్న పవన్ కల్యాణ్

Choices

మరిన్ని వార్తలు