నవ్వాలా లేక ఏడ్వాలా! : అబ్దుల్లా కామెంట్స్ పై జయప్రద

Submitted on 22 April 2019
Jaya Prada on remarks by Abdullah (SP leader Azam Khan's son): Can't decide whether to laugh or cry

ఎస్పీ నాయకుడు అజంఖాన్ కుమారుడు అబ్దుల్లా తనను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలపై జయప్రద స్పందించారు.తనకు నవ్వాలో లేక ఏడవాలో అర్థం కావడం లేదన్నారు.తండ్రిలాగే కొడుకు అని ఆమె అన్నారు.అబ్దుల్లా ఇలా మాట్లాడతాడని తాను ఊహించలేదని ఆమె అన్నారు.అతడు చదువుకున్న వ్యక్తి అని జయప్రద తెలిపారు.తనను ఉద్దేశించి అజంఖాన్ అమ్రాపాలి అంటే కొడుకు అబ్దుల్లా అనార్కలి అన్నారని,సమాజంలోని మహిళలను మీరు చూసే తీరు ఈ విధంగానే ఉంటుందా అని జయప్రద ప్రశ్నించారు.
Also Read : బాప్ ఏక్ నెంబర్..బేటా దస్ నెంబర్ : జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు

రాంపూర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆజంఖాన్ తనయుడు అబ్దుల్లా ఆజంఖాన్.. జయప్రదపై పరోక్ష విమర్శలు చేశారు. సభకు హాజరైన ప్రజలను చూశాక జోష్ వచ్చిందో.. లేదంటే... తండ్రిలాగే తానుకూడా ఫేమస్ అవ్వాలనుకున్నాడో ఏమోగానీ... ఆమెపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తమకు.. ఆలీ కావాలి, భజరంగ్‌ బలీ కావాలి అన్న అబ్దుల్లా.. అనార్కలీ మాత్రం వద్దని జయప్రదను ఉద్దేశించి అన్నారు.

కొన్ని రోజుల క్రితం ఆజంఖాన్ కూడా... జయప్రదను తానే రాంపూర్‌కు తెచ్చానని.. ఎవ్వరూ ఆమె శరీరాన్ని తాకకుండా జాగ్రత్తలు తీసుకున్నానని చెప్పారు. అంతేకాదు ఆమె అసలు రూపం తెలుసుకునేందుకు ప్రజలకు 17 ఏళ్లుపడితే...ఆమె ఖాకీ అండర్‌వేర్ వేసుకుంటుందనే విషయాన్ని తాను 17 రోజుల్లోనే  గుర్తించానని వివాదాస్పద కామెంట్స్ చేశారు.

Jayaprada
Abdullah
remarks
Comments
Anarkali
UP
loksabha elections
cry
LAUGH
EDUCATED
womens
Society

మరిన్ని వార్తలు