మాటకు మాట : విజయసాయి - లక్ష్మీనారాయణ మధ్య ట్విట్టర్ వార్

Submitted on 20 April 2019
JANASENA,YSRCP LEADERS,VIZAYASAI REDDY,LAXMINARAYANA TWITTER WAR CONTINOUS

ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఇంకా పొలిటికల్ హీట్ కొనసాగుతూనే ఉంది.వైసీపీ,జనసేన నేతల మధ్య పరస్పర ఆరోపణలతో రాజకీయం వేడెక్కింది. వైసీపీ నాయకుడు,రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి, జనసేన నేత జేడీ లక్ష్మీనారాయణల మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతోంది. 

జనసేన 88 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని జేడీ లక్ష్మీనారాయణ అన్నారు.దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలపై సెటైర్లు వేశారు.సొంతంగా పోటీ చేసిందే 65 సీట్లలో. పవన్ కళ్యాణ్ అనుంగు అనుచరుడు జెడి లక్ష్మీనారాయణేమో 88 స్థానాల్లో గెల్చి జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తుందని జోస్యం చెబుతున్నాడు. ఇతను దర్యాప్తు చేసిన కేసుల్లో కూడా ఇలాగే లేనివి ఉన్నట్టు రాసాడు. ఇది కూడా చంద్రబాబు బ్రీఫింగేనా?అని విజయసాయి ట్వీట్ చేశారు.
Also Read : ఎన్నికల కోడ్ ఒక్క APలోనే ఉందా? - లోకేష్ ట్వీట్

విజయసాయి ట్వీట్ కు లక్ష్మీనారాయణ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.గౌరవనీయులు, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు,జనసేన పోటీ చేసింది 140 స్థానాలు సొంత బలం మీద.మిత్రపక్షాలైన బి.ఎస్.పి 21, సి.పి.ఐ., సి.పి.ఎం వామపక్షాలు 14.అలా మొత్తం చేరి 175 స్థానాలకు జనసేన కూటమి పోటీ చేసింది.మా లెక్కలు ఖచ్చితంగా ఉంటాయి, మా లెక్కలు సరిగ్గా ఉంటాయి.మీరు CA చదివారు అయినా కూడా మీ లెక్కలు తప్పులు ఎలా అవుతున్నాయో మాకు అర్ధం అవ్వట్లేదు.మీ లెక్కలు సరిచూసుకోండి ఎందుకంటే మేము సత్యం, న్యాయం మీద ఆధారపడి పనిచేసేవాళ్ళం కాబట్టి.మీ తప్పుడు లెక్కల వల్ల ఎంతోమంది ఇరుక్కున్నారు.ఇప్పటికైనా మంచి లెక్కలు నేర్చే విధానాన్ని మొదలుపెట్టండి అంటూ కౌంటర్ ట్వీట్ చేశారు.
Also Read : టీడీపీ నేత సీఎం రమేష్ మేనల్లుడు ఆత్మహత్య

అయితే లక్ష్మీనారాయణ ట్వీట్ కు కౌంటర్ గా విజయసాయి వరుస ట్వీట్ లు చేశారు.జేడీ గారూ, గ్లాసు పార్టీలో మీరేమిటో నాకు తెలియదు. చంద్రబాబుకు మీ పార్టీ ఇచ్చిన బీ ఫారాలు పోను మిగిలింది 65 సీట్లు. మరో పార్టనర్ పాల్  బీ ఫారాలు ‘పోగొట్టుకున్నట్టు’ గానే మీ నాయకుడూ 80 సీట్లలో డమ్మీలను దింపి ‘త్యాగం’ చేశారు. ఈ లెక్కలు తికమకగా ఉంటే బాబు దగ్గర ట్యూషన్‌కు వెళ్ళండి. లక్ష్మీనారాయణ గారూ… మీరు ఈ రోజుకూ జేడీనే.

కాకపోతే ఇప్పుడు తెలుగుదేశానికి-జనసేనకు జాయింట్ డైరెక్టర్!  నేరగాళ్ళ పార్టీకి, విలువల్లేని పార్టీకి తమరే సంయుక్త సంచాలకులు అని విజయసాయి ట్వీట్  లు చేశారు. సొంతంగా పోటీ చేసిందే 65 సీట్లలో. పవన్ కళ్యాణ్ అనుంగు అనుచరుడు జెడి లక్ష్మీనారాయణేమో 88 స్థానాల్లో గెల్చి జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తుందని జోస్యం చెబుతున్నాడు. ఇతను దర్యాప్తు చేసిన కేసుల్లో కూడా ఇలాగే లేనివి ఉన్నట్టు రాసాడు. ఇది కూడా చంద్రబాబు బ్రీఫింగేనా?అని విజయసాయి వరుస ట్వీట్ లు చేశారు.

LAXMINARAYANA
janasena
Ysrcp
VIZAYA SAI REDDY
tweets
AP
Elections

మరిన్ని వార్తలు