బీజేపీలో జనసేన విలీనం : మంత్రుల సంచలన వ్యాఖ్యలు

Submitted on 3 December 2019
janasena merge in bjp

ఏపీలో రాజకీయ వేడెక్కింది. అధికార వైసీపీ, జనసేనాని పవన్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. ప్రభుత్వాన్ని, సీఎం జగన్ ని పవన్ టార్గెట్ చేశారు. జగన్ పాలనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా.. మోడీ, అమిత్ షా లాంటి వారే ఈ దేశానికి కరెక్ట్ అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. గతంలో మోడీ, అమిత్ షా లపై తీవ్ర విమర్శలు చేసిన పవన్.. సడెన్ గా వారిని పొగడటం, మద్దతివ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మోడీ, షా లను ఉద్దేశించి పవన్ చేసిన కామెంట్స్ పై ఏపీ మంత్రులు అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. పవన్ తన జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేస్తారేమో అనే సందేహాలు వ్యక్తం చేశారు. విలీనం ఆలోచన ఉంది కాబట్టే.. అమిత్ షా ని పవన్ పొగిడారు అని అంటున్నారు.

పవన్ తన పార్టీని బీజేపీలో విలీనం చేసే యోచనలో ఉన్నారని మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని అన్నారు. విలీనం ఆలోచన ఉంది కాబట్టే అమిత్ షా ని పవన్ పొగిడారని నాని చెప్పారు. జనసేనను బీజేపీలో విలీనం చేసేందుకు.. పవన్ భారీ ఏర్పాట్లు చేసుకున్నట్టు కనిపిస్తోందన్నారు. అమిత్ షా ను పొగడటం, మద్దతివ్వడం ద్వారా పవన్ విలీన సంకేతాలు ఇచ్చారని మంత్రి చెప్పారు. జనసేనను విలీనం చేయాలని అమిత్ షా అడిగారని గతంలో పవనే స్వయంగా చెప్పారని మంత్రి గుర్తు చేశారు.

సీఎం జగన్ ని జగన్ రెడ్డి అని పిలిస్తే.. తాము పవన్ ని.. పవన్ నాయుడు అనే పిలుస్తామని మంత్రి కొడాలి నాని తేల్చి చెప్పారు. చంద్రబాబు తానా అంటే పవన్ తందానా అంటాడు అని విమర్శించారు. సీఎంగా జగన్ ను పవన్ గుర్తించకుంటే.. జగన్ పదవి ఏమైనా రద్దవుతుందా అని ప్రశ్నించారు. సోనియాని ఎదిరించారు కాబట్టే.. జగన్ జైలుకెళ్లారని కొడాలి నాని అన్నారు. అమిత్ షా, మోడీలను పొగుడుతారు కాబట్టే పవన్ జైలుకి వెళ్లలేదన్నారు. పవన్ తన జనసేనని బీజేపీలో విలీనం చేస్తారేమో అనే అనుమానం వ్యక్తం చేశారు కొడాలి నాని.

చంద్రబాబు దగ్గర రెమ్యునరేషన్ తీసుకుని సీఎం జగన్ పై పవన్ విమర్శలు చేస్తున్నారని మంత్రి పేర్నినాని ఆరోపించారు. పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకుని ఫ్యాన్స్ కి ఏం మేసేజ్ ఇస్తున్నారని ప్రశ్నించారు. పవిత్రమైన స్త్రీని పవన్ విలాస వస్తువుగా చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

janasena
MERGE
Pawan kalyan
BJP
perni nani
cm jagan
Amit Shah
Modi

మరిన్ని వార్తలు