కోడి కత్తి కేసు: ఎన్ఐఏ కస్టడీలో జగన్ కేసు నిందితుడు

Submitted on 12 January 2019
Jagan case accused in the NIA custody

విజయవాడ:  వైఎ్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో వ హత్యాయత్నానికి ప్రయత్నించిన నిందితుడు శ్రీనివాసరావును శనివారం  జాతీయ దర్యాప్తు సంస్ధ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు శ్రీనివాసరావును ఎన్ఐఏ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది.
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో శ్రీనివాసరావు కు  వైద్యపరీక్షలు పూర్తి అయ్యాయి. రోడ్డు మార్గం గుండా శ్రీనివాసరావును హైదరాబాదుకు తరలిస్తున్నారు. కాగా నిందుతుడికి 3 రోజులకొక సారి వైద్యపరీక్షలు నిర్వహించాలని, అతని న్యాయవాది సమక్షంలోనే విచారించాలని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కోన్నారు. 
 

Murder attempt
YS Jaganmohan Reddy
Visakha air port
NIA team
NIA court
jagan case investigation

మరిన్ని వార్తలు