చంద్రబాబు బీసీలను మోసం చేశారు : బీసీ గర్జనలో జగన్

Submitted on 17 February 2019
jagan addressed at bc garjana in eluru

ఏలూరు : సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రస్తాయిలో మండిపడ్డారు. చంద్రబాబు బీసీలను మోసం చేశారని విమర్శించారు. ఫిభ్రవరి 17న ఏలూరులో ఏర్పాటు చేసిన వైసీపీ బీసీ గర్జన సభలో జగన్ ప్రసంగించారు. చంద్రబాబు ఎన్నికల మ్యానిఫెస్టో ఎంతవరకు అమలు చేశారని ప్రశ్నించారు. అంతకముందు అమర జవాన్లకు సభ శ్రద్ధాంజలి ఘటించింది.

 

2014 ఎన్నికల ముందు చంద్రబాబు బీసీలకు డిక్లరేషన్ చేశారని.. ఎన్నికల మేనిఫెస్టో తర్వాత బీసీ డిక్లరేషన్ ప్రవేశపెట్టారని తెలిపారు. అధికారంలోకి వచ్చాక బీసీ డిక్లరేషన్ కు దిక్కు లేదన్నారు. ఎన్నికలు వచ్చాయి కాబట్టి.. మళ్లీ డిక్లరేషన్ అంటున్నారని విమర్శించారు. కేంద్రంలో కూడా బీసీ సబ్ ప్లాన్ కు 25 శాతం నిధులు కేటాయించేలా కృషి చేస్తానని చంద్రబాబు చేశారని విమర్శించారు.

 

చంద్రబాబు బీసీలకు 119 హామీలు ఇచ్చారని..కానీ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. బీసీ విద్యార్థులు ఇంజినీర్లు, డాక్టర్లు కావాలని వైఎస్ ఆర్ ఫీజు రియింబర్స్ మెంట్ ఇచ్చారని గుర్తు చేశారు. చంద్రబాబు అరకొరగా ఫీజు రియింబర్స్ మెంట్ ఇస్తున్నారని విమర్శించారు. ఫీజు రియింబర్స్ మెంట్ బాకాయిలు ఉన్నాయన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ రాక.. 450 మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీ కోర్సులు పూర్తి చేసినా పట్టాలు రాలేదన్నారు. అన్నదాత సుఖీభవ అంటూ చంద్రబాబు రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.

 

తాము అధికారంలోకి రాగానే ఏం చేస్తామో చెప్పడానికే బీసీ గర్జన చేపట్టామని చెప్పారు. పాదయాత్రలో ఉండగానే బీసీ సమస్యలు తెలుసుకున్నానని తెలిపారు. నేటికీ మన సమాజంలో బీసీలు వెనుకబడి ఉన్నారని వాపోయారు. అధికారంలోకి రాగానే పేదల జీవితాల్లో వెలుగు నింపుతానని భరోసా ఇచ్చారు. ఈరోజు కురుక్షేత్రం చివరి రోజు అన్నట్లుగా ఉందన్నారు. బీసీల సమస్యల అధ్యయనం కోసం కమిటీ వేశానని తెలిపారు. బీసీలు మన జాతికి వెన్నెముక కులాలు అని కొనియాడారు. ’బీసీలు అంటే వెనుకబడిన తరగతులు కాదు.. భారతీయ సంస్కృతిని నెలబెట్టిన వారు’ అని పేర్కొన్నారు.

ycp jagan
addressed
bc garjana
Eluru

మరిన్ని వార్తలు