హీరోగా సుడిగాలి సుధీర్

Submitted on 25 May 2019
Jabardasth Comedian Sudigali Sudheer Get Chance In Movies

జబర్దస్త్, ఢీ షోలతో బుల్లితెరపై స్టార్ కమెడియన్ గా దూసుకుపోతున్న సుడిగాలి సుధీర్ ఇప్పుడు హీరోగా నటించనున్నాడు. 'సాఫ్ట్‌వేర్ సుధీర్‌' అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో ధన్యా హీరోయిన్. రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ 50 శాతం పూర్తి అయింది. ఈ సినిమాను జులై చివరి వారంలో విడుదలకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. 

ఈ సందర్భంగా సుధీర్ మాట్లాడుతూ... ''అందరూ నన్ను హీరో అంటున్నారు. కానీ  ఈ సినిమాకు కథే హీరో. నాకు ఈ కథ చెప్పగానే చాలా థ్రిల్లింగ్‌‌గా అనిపించింది. సినిమా మంచి విజయాన్ని ఇస్తుందని అనుకుంటున్నా’ అని తెలిపాడు.  టీవీ షోలో తెచ్చుకున్న సుడిగాలి సుధీర్..సినిమాల్లో రాణిస్తాడా ? లేదా ? అనేది చూడాలి. 

Jabardasth Comedian
Sudigali Sudheer
Chance In Movies
2019

మరిన్ని వార్తలు