ఐటమ్ సాంగ్.. ఎప్పుడు ఎక్కడ పుట్టిందో తెలుసా!

Submitted on 18 January 2019
Item song in first cinema who given idea to play in role and it its way out

ఐటమ్ సాంగ్.. పెద్ద హీరో నుంచి చిన్న హీరో వరకు ఏ సినిమాలోనైనా ఐటమ్ సాంగ్ కామన్. ఐదు నిమిషాల నిడివి ఉండే ఈ ఐటమ్ సాంగ్ ఉండాల్సిందే. సినిమా హిట్ కావాలంటే ఐటమ్ సాంగ్ ఉండాల్సిందే. అవసరం ఉన్నా లేకున్నా సినిమా 24 ఫ్రేమ్ లో ఎక్కడో ఒకచోట ఈ ఐటమ్ సాంగ్ ను ఇరికిస్తారు. ఒకప్పుడు రికార్డింగ్ డ్యాన్స్ లు మాత్రమే ఉండేవి. నాటకాల్లో కూడా నర్తకిలుగా డ్యాన్స్ చేసేవాళ్లు. నాటకాలు పోయి సినిమాలు వచ్చేశాయి. సినిమాల్లో కూడా ఐటమ్ సాంగ్ లు దర్శనమిచ్చాయి. కానీ, ప్రత్యేకించి కొందరు నటులు మాత్రమే ఐటమ్ సాంగ్ చేసేవాళ్లు. రానురాను ఐటమ్ సాంగ్స్కు పెరిగిన క్రేజ్ తో పెద్ద హీరోయిన్లు కూడా ఐటమ్ సాంగ్ చేస్తామంటూ ముందుకోస్తున్నారు. ఐదు నిమిషాల పాటు అందాలు ఆరబోసేందుకు కోట్ల రూపాయలు రెమ్యునురేషన్ తీసుకుంటున్నారు.    

ఐటమ్ తారలకే భారీ క్రేజ్..  
పాత సినిమాల్లో జయమాలిని, జ్యోతిచిత్ర, సిల్క్ స్మిత వంటి ఎందరో నటీమణులు తెలుగు వెండితెరపై ఊపు ఊపేశారు. ప్రత్యేకించి ఐటమ్ సాంగ్ ల కోసమే సినిమా థియేటర్లకు ప్రేక్షకులు క్యూ కట్టే వరకు వీరీ క్రేజ్ పెరిగిపోయింది. హీరోయిన్ల కంటే వీరికే భారీ క్రేజ్ వచ్చేసింది. కనిపించేది ఐదో ఆరో నిమిషాలు మాత్రమే. ఈ ఐటమ్ తారలే సినిమా ఇండస్ట్రీని శాసించే స్థాయికి చేరిపోయారు. సినిమా పరిశ్రమలో ఏ సినిమా విజయం సక్సెస్ సాధించాలన్నా, భారీ కలెక్షన్లు రాబట్టలన్నా ఐటమ్ సాంగ్ తప్పనిసరిగా పెట్టాల్సిందే. ఐటమ్ తారలకు భారీ రెమున్యురేషన్ ఇవ్వాల్సందే. రానురాను ఈ ఐటమ్ సాంగ్ అనవాయితీ ఈ తరం సినిమాలకు కూడా బ్రహ్మస్తంలా మారింది. చిన్న హీరో నుంచి పెద్ద హీరో వరకు, చిన్న తరహా బడ్జెట్ సినిమా నుంచి పెద్ద బడ్జెట్ సినిమా వరకు ఏ సినిమా అయినా ఐటమ్ సాంగ్ ఉండాల్సిందే. ప్రత్యేకించి లిరెక్ రైటర్లతో ఐటమ్ సాంగ్ లు రాయించు కుంటున్నారంటే.. ఐటమ్ సాంగ్ లకున్న క్రేజ్ ఎంత ఉందో తెలిసిపోతుంది. ఎందుకింత ఈ ఐటమ్ సాంగ్ లకు భారీ క్రేజ్. సినిమా ఇండస్ట్రీని ఊపేస్తున్న ఐటమ్ సాంగ్ ల కల్చర్ కు అసలు ఎక్కడ పునాది పడింది. ఏ సినిమాతో ఐటమ్ సాంగ్ పుట్టుకొచ్చింది. ఈ ఐడియా ఎవరూ ఇచ్చారో తెలుసుకుందాం రండి. 

ఐటమ్ సాంగ్ ఐడియా ఎవరిదంటే..
తమిళనాడు మద్రాసులో సినీపరిశ్రమకు కేరాఫ్ అడ్రస్ అని అందరికి తెలిసిందే. తమిళ, తెలుగు సినిమాలు పురుడు పోసుకుంది ఇక్కడే. అప్పట్లో ఉమ వంగల్ అనే ఫిల్మ్ ప్రొఫెసర్ ఓహియో, కెన్యన్ కాలేజీని సందర్శించారు. ఈ సందర్భంగా వంగల్.. ఐటమ్ సాంగ్ అనే చక్కని ఐడియా ఇచ్చారు. ఐటమ్ సాంగ్ సినిమాల్లో ప్రవేశానికి ముందు ఉమ వంగల్ ఈ ఆలోచనకు శ్రీకారం చుట్టారు. 1976లో తమిళంలో వచ్చిన భద్రకాళి సినిమాలో బ్రాహ్మణ వ్యక్తి (శివకుమార్) రికార్డు డ్యాన్స్ తో ఆకట్టుకున్నాడు. ఇదే సినిమాను ఆమె ఉదాహరణగా చూపించారు. అందులో శివకుమార్ భార్య (రాణి చంద్ర) డ్యాన్స్ ప్రదర్శన ఇస్తూ వినోదం పంచడాన్ని ఆ సన్నివేశంలో చూడొచ్చు. ఈ రికార్డింగ్ డ్యాన్స్ ను ‘కరగట్టమ్’ అని పిలిచేవారు. ఈ డ్యాన్స్ లో డ్యాన్స్ వేస్తున్న తారను ఎవరూ తాకరు. ఇలాంటి ఎన్నో పాత్రలను సినిమాల్లో సృష్టించి ఐటమ్ సాంగ్స్ గా మలిచి వినోదాన్ని పంచుతున్నారు. అప్పట్లో ట్రెండ్ సృష్టించిన ఆ ఐటమ్ సాంగ్ లు ఇప్పటి సినిమాల్లో సరికొత్త ట్రెండ్ ను క్రియేట్ చేస్తున్నాయి. దేనికైనా ఎక్స్ పైరీ డేట్ ఉంటుందేమో గానీ, ఈ ఐటమ్ సాంగ్ లకు ఎక్స్ పైరీ డేట్ ఉండదేమో మరి. ఇదే.. ఐటమ్ సాంగ్ వెనుక ఉన్న అసలైన స్టోరి.

Item song
first cinema
Tamil cinema
Uma Vangal
Bhadrakali

మరిన్ని వార్తలు