సెల్ ఫోన్ వ్యసనం తగ్గించేందుకు కొత్త చట్టం

Submitted on 22 July 2019
Italy Drafts "No-Mobile-Phone Phobia" Law To Prevent, Treat Addiction

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉన్న విషయం తెలిసిందే. స్కూల్ కి వెళ్లే పిల్లలు కూడా సెల్ ఫోన్ కి బానిసలైపోతున్నారు. గంటల తరబడి మొబైల్ ఫోన్స్ లోనే కాలం గడుపుతున్నారు. కొందరు పిల్లలు అయితే సెల్ ఫోన్ చేతిలో పెట్టకపోతే అన్నం కూడా తినమంటూ మారం చేస్తారు. సెలవు దొరికిందంటే చాలు పిల్లలు ఇట్టే మొబైల్‌కు అతుక్కుపోతున్నారనేది నేడు తల్లిదండ్రులు చేసే కంప్లెయింట్. అంతా సెల్ ఫోన్ మనుషుల జీవితాల్ని శాసిస్తోంది. అయితే ఇది ఏ ఒక్క దేశానికో పరిమితం కాదు. ఇతర దేశాల్లోనూ ఇదే పరిస్థితి. అందుకే ఇటలీ ప్రభుత్వం ఇందుకోసం ఓ చట్టం తెచ్చేందుకు రెడీ అయింది.

అధికార యాంటీ ఎస్టాబ్లిష్‌మెంట్‌ ఫైవ్‌స్టార్‌ మూవ్‌మెంట్‌ (M5S) పార్టీ ఓ ముసాయిదా చట్టం రూపొందించింది. పిల్లల్లో పెరుగుతున్న మొబైల్‌ ఫోన్‌, కంప్యూటర్‌ వ్యసనాన్ని తగ్గించడం,పిల్లలను నొమోఫోబియాకు దూరం చేయడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ బిల్లు ప్రకారం.. పిల్లలు ఎక్కువ సేపు ఫోన్‌ వాడకుండా గుర్తించే విధంగా తల్లిదండ్రులకు విద్యా కార్యక్రమాలను నిర్వహించడం..స్కూళ్లు, యూనివర్సిటీల్లో మనస్సాక్షికి లోబడి ఇంటర్నెట్‌, సోషల్‌ మీడియాను వాడే విద్య ఉండాలనేది ఈ బిల్లులో ప్రతిపాదించారు.

సాధారణంగా సోషల్‌మీడియా, మెసేజింగ్‌ యాప్‌లను వాడకుండా ఉండలేకపోవడాన్ని నొమోఫొబియాగా పిలుస్తారు. ముఖ్యంగా యువతలో దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇటలీలో 15-20 ఏళ్ల వయస్సున పిల్లలు రోజుకు 75 సార్లు మొబైల్‌ చూసుకుంటున్నారని ఓ పరిశోధనలో తేలింది.

మొత్తంగా 61 శాతం ఇటాలియన్లు మొబైల్‌, ట్యాబ్లెట్లను పడక సమయంలో కూడా ఉపయోగిస్తున్నారని ఓ సర్వేలో తేలింది. ఇందులో 18-34 మధ్య వయసున్నవారు 81 శాతం ఉండడం గమనార్హం. దీంతో అధికార పార్టీ ఈ చట్టం తెచ్చేందుకు రెడీ అయింది.

Italy
DRAFT
mobile phone
NO MOBILE PHOBIA
Treat
ADDICTION
Control

మరిన్ని వార్తలు