కోట్ల పన్ను ఎగ్గొట్టారు : రూ.20వేల కోట్ల హవాలా రాకెట్

Submitted on 12 February 2019
IT Department to caught Hawala Racket Of Rs. 20,000 Crore

దేశ రాజధాని ఢిల్లీలో కోట్ల విలువైన హవాలా రాకెట్ గుట్టురట్టు అయింది. మనీ లాండరింగ్ రాకెట్ నిర్వాహకులపై ఐటీ శాఖ కొరడా ఝళిపించింది. ఐటీ దాడుల్లో దాదాపు రూ.20వేల కోట్ల రూపాయల విలువైన ఆర్థిక అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. పాత ఢిల్లీతో కలిపి గతకొన్నివారాలుగా వివిధ శాఖలుగా ఏర్పడిన ఐటీ శాఖ.. అక్రమ వ్యాపారాలు జరిగే ప్రాంతాల్లో సర్వేలు, సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో నమ్మలేని అక్రమాలు ఐటీ అధికారులను షాక్ కు గురిచేశాయి. 


ఈ హవాలా రాకెట్ వెనుక మూడు గ్రూపులు అక్రమ ఆర్థిక కార్యకలాపాలను నడుపుతున్నట్టు గుర్తించినట్టు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ గ్రూపులో ఒకదానిపై నయా బజార్ ఏరియాలో ఐటీ అధికారులు సర్వే నిర్వహించగా రూ.18వేల కోట్లు బోగస్ భవనాలు నిర్మించినట్టు తేలింది. నకిలీ బిల్లులు సృష్టించి డజన్లకు పైగా ఆస్తులను ఈ హవాలా రాకెట్ గ్రూపు కూడబెట్టినట్టు సర్వేలో వెల్లడైనట్టు ఆయన తెలిపారు. పట్టుబడిన హవాలా రాకెట్ నిర్వాహకులు ఎవరో బహిర్గతం చేయమని ఐటీ శాఖ స్పష్టం చేసింది. రెండో కేసులో.. భారీ మనీ లాండరింగ్ రాకెట్ వ్యవహారం కూడా బయటపడింది. ఏళ్ల తరబడి పాత షేర్లపై అక్రమంగా అమ్మకాలు జరిపి కోట్ల కుంభకోణానికి తెరలేపినట్టు తనిఖీల్లో గుర్తించారు. 


ఈ వ్యవహారంలో అక్రమరీతిలో దీర్ఘకాలిక క్యాపిటల్‌గెయిన్స్‌ను పొందినట్లు తెలిపారు. ఇందులో రూ.1000 కోట్ల మేర భారీ కుంభకోణం జరిగి ఉంటుందని ఐటీ అంచనా వేస్తోంది. పైకి కనిపిస్తున్నవి కేవలం అంకెలు మాత్రమేనని, ఎన్నో ఏళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా ఈ భారీ కుంభకోణం సాగుతున్నట్టు తెలిపారు. అంతేకాదు.. హవాలా, మనీలాండరిగ్ రాకెట్ కు సంబంధించిన గ్రూపులపై సోదాలు నిర్వహించారు.


ఈ లెక్కల్లో లేని విదేశీ బ్యాంకు అకౌంట్ లు, ఎగుమతుల ఇన్‌వాయిస్, బోగస్ సుంకాలు, GSTక్లెయిమ్‌ చేస్తున్నట్టు గుర్తించినట్టు తెలిపారు. బోగస్ ఎగుమతుల విలువ సుమారు రూ.1500 కోట్లకు పైగానే ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిపారు. బయటపడిన అక్రమ ఆర్థిక కార్యకలాపాలను లెక్కిస్తే.. సుమారు రూ.20 వేల కోట్లదాకా పన్ను ఎగవేసినట్టు తనిఖీల్లో గుర్తించినట్లు ఐటీ శాఖ వెల్లడించింది. 

Also Read: ఎన్నారైల పెళ్ళి రిజిష్ట్రేషన్ తప్పని సరి : లేకపోతే ఆస్తులు జప్తు

Also Read: CBI మాజీ బాస్‌కు సుప్రీం తీర్పు : లక్ష కట్టు.. కోర్టులో ఓ మూలన కూర్చో

Also Read: మగ మినిస్టర్ చేతిదూల : వేదికపైనే మహిళా మంత్రిని గోకారు

Also Read: మనిషి బ్రతకటం కష్టమే : 100 ఏళ్లకు పురుగులు అంతం

Delhi Taxmen
Hawala Racket
Income Tax
money laundering racket
Naya Bazar area

మరిన్ని వార్తలు