పాకిస్తాన్‌లో మన ఎలక్షన్ కౌంటింగ్ ప్రత్యక్ష ప్రసారం

Submitted on 23 May 2019
Islamabad to live telecast Election results

లోక్ సభ ఎన్నికల వేడి భారత్‌తో పాటు విదేశాలకు తాకింది. దాయాది దేశంలోనూ ఎన్నికల కౌంటింగ్ వివరాలను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. మే 23న జరగనున్న ఎన్నికల కౌంటింగ్ వివరాలను పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. 

ఇండియన్ హై కమిషన్ కార్యాలయంలో భారీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ప్రజాస్వామ్య పండగ పేరుతో జరగనున్న ఈవెంట్‌కు ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. రాబోయే ప్రభుత్వం భారత్.. పాకిస్తాన్ మధ్య సత్సంబంధాలు సృష్టిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 7:30గంటలకు కార్యక్రమం ఆరంభమవుతోంది. 

ఎగ్టిట్ పోల్ ఫలితాలు ఏ మేర నిజమవుతాయో.. ఎన్డీఏకే మళ్లీ అధికారం దక్కుతుందో లేదో తేలిపోనుంది. 

INDIAN HIGH COMMISSION
ISLAMABAD
May 23
Lok Sabha Election results

మరిన్ని వార్తలు