షాపింగ్ మాల్‌లో ప్రపోజ్.. ప్రేమ జంటకు పోలీసుల ట్విస్ట్

Submitted on 11 March 2019
Iran Couple Arrested Love Proposal In Shoping Mall

షాపింగ్ మాల్‌లో ప్రపోజ్ చేసిన యువకుడిని, అతడిని పెళ్లాడటం ఇష్టమేనని చెప్పిన యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇరాన్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అరాక్ నగరంలోని ఓ షాపింగ్ మాల్‌లో హార్ట్ షేపులో పువ్వులు పరిచి, చుట్టూ రంగురంగుల బెలూన్ల మధ్య ఓ యువకుడు అమ్మాయికి ప్రపోజ్ చేశాడు. ఆమె ఎస్ చెప్పడంతో వెంటనే జనం మధ్య ఉంగరం తొడిగి హత్తుకున్నాడు. చుట్టూ ఉన్న వాళ్లంతా వారిని ఎంకరేజ్ చేశారు.
Read Also : లేచిన వేళ బాగుంది : 2 నిమిషాల ఆలస్యమే అతన్ని కాపాడింది!

ప్రపంచంలోని మిగతా దేశాల్లో అది సాధారణమే కావచ్చు కానీ.. తమ సంస్కృతి, సంప్రదాయాలకు విరుద్ధమని అరాక్ డిప్యూటీ పోలీస్ చీఫ్ ముస్తాఫా నొరౌజీ తెలిపారు. ఇస్లామిక్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో వారిని అరెస్ట్ చేశామని, అనంతరం బెయిల్ మీద రిలీజ్ చేశామని పోలీసులు తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
Read Also : మేయర్ అయిన మేక : కుక్కపై 13 ఓట్ల తేడాతో గెలుపు

Iran Couple Arrested
Love Proposal
Shoping Mall

మరిన్ని వార్తలు