IPL ఫైనల్‌కు సీట్లు దొరక్క హైదరాబాదీల ఇక్కట్లు

Submitted on 12 May 2019
IPL final tickets NOT AVAILABLE Fans FRUSTRATED

భారీ అంచనాలతో ఉత్కంఠభరితంగా మొదలైన ఐపీఎల్ సీజన్‌కు ముగింపు వచ్చేసింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా ఆదివారం జరగనున్న పోరు చూసేందుకు వేల సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఇరు జట్లు బలాబలాలు సమంగా కనిపిస్తుండటంతో పోటీ హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది. ఆదివారం రాత్రి టాస్ సమయం ఏడు గంటల నుంచి స్టేడియంవైపే అందరి కళ్లు. క్వాలిఫయర మ్యాచ్‌లకే అమ్మకాలు మొదలైన కాసేపటిలోనే టిక్కెట్లు అమ్ముడైపోతే ఇక ఫైనల్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. 

చెన్నై, ముంబై నుంచే:
చెన్నై నుంచి సూపర్ కింగ్స్ అభిమానులు, మహారాష్ట్ర నుంచి ముంబై ఇండియన్స్ అభిమానులకు స్థానికులు కూడా తోడవడంతో స్టేడియం వీక్షకులతో కిటకిటలాడిపోనుంది. చెన్నై.. ముంబైల మధ్య పోరును ముందుగానే ఊహించిన సూపర్‌ కింగ్స్, ముంబై యాజమాన్యాలు స్టేడియంలో 90 శాతం టికెట్లు బ్లాక్‌ చేసేశాయి. వారు అనుకున్నట్లుగానే తమిళనాడు, మహారాష్ట్రకు వారితోనే స్టేడియాన్ని నింపేయనున్నాయి. స్టేడియం కెపాసిటీ 39,450 మందికి ఉంటే వాటిలో 35 వేలకు పైగా సీట్లను యాజమాన్యాలే బ్లాక్ చేశాయి. 

హోటళ్లు ఫుల్:
ఇక మిగిలిన 4,450 టికెట్లలో 2,500 టికెట్లను స్పాన్సర్‌ షిప్‌ చేసిన కార్పొరేట్‌ కంపెనీలకు ఇవ్వడంతో సామాన్య ప్రజలకు కేవలం 2 వేల టికెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ మేరకు ఫైనల్‌ మ్యాచ్ చూసేందుకు మహారాష్ట్ర, తమిళనాడుకు చెందిన దాదాపు 25 వేల మంది శనివారం మధ్యాహ్నానికి చేరుకున్నారు. ఈ ఎఫెక్ట్‌కు రాజధానిలోని స్టార్ హోటళ్లు మొత్తం వీరితోనే నిండిపోయాయి. 5 వేల మంది రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన ఎగ్జిక్యూటివ్‌లు ఫైనల్‌ మ్యాచ్‌ను తిలకించేందుకు హైదరాబాద్‌లో హోటళ్లలో దిగారు. 

వీవీఐపీలకు తప్పని నిరాశ:
సీట్లు భారీ సంఖ్యలో బ్లాక్ చేసేయడంతో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వీవీఐపీలకు కూడా నిరాశే మిగిలింది. ఐపీఎల్‌ నిర్వాహకులు హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కు కొద్దిపాటి పాసులే ఇవ్వడంతో అడిగిన వారికి సీట్లు కేటాయించలేని పరిస్థితిలో పడ్డారు. హైదరాబాద్ స్టేడియంలోనే జరుగుతున్నా టిక్కెట్లు దొరక్కపోవడంతో సర్వత్రా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. 

chennai super kings
MUMBAI INDIANS
IPL 2019
IPL 12
ipl final

మరిన్ని వార్తలు