తప్పించారా: ఢిల్లీ క్యాపిటల్స్‌కు రవిచంద్రన్ అశ్విన్

Submitted on 7 November 2019
IPL: Ashwin, Kings XI Punjab part ways

టీమిండియా వెటరన్ స్పిన్నర్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్‌గా 2018, 2019సీజన్లలో వ్యవహరించిన రవిచంద్రన్ అశ్విన్ జట్టు మారనున్నాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ కు వెళ్లనున్నాడు. కొద్ది నెలలుగా జరుగుతున్న చర్చలు ఫలించడంతో ఢిల్లీ యాజమాన్యం అశ్విన్‌ను దక్కించుకోగలిగింది. గత సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి శిఖర్ ధావన్ రావడంతో బలంగా కనిపించిన జట్టు అశ్విన్ రాకతో మరింత బలం పుంజుకోనుంది. 

ఈ మేర ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. వీరేంద్ర సెహ్వాగ్ మెంటార్ గా ఉన్నప్పుడు కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్న అశ్విన్.. పంజాబ్ జట్టుతో అనిల్ కుంబ్లే కలవడంతో ఢిల్లీకి వెళ్లిపోనున్నాడు. ఈ ఒప్పందం అనంతరం అశ్విన్ కు బదులుగా ఢిల్లీ నుంచి ఇద్దరు ప్లేయర్లను తీసుకోవాలని పంజాబ్ ప్లాన్ చేస్తుంది. ఢిల్లీ నుంచి తీసుకోనున్న ప్లేయర్లు కన్‌ఫామ్ అయిన తర్వాత అధికారికంగా ప్రకటిస్తారు. 

'అశ్విన్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో చేరనున్న మాట నిజమే. అతనికి బదులుగా పంజాబ్ జట్టు ఢిల్లీ నుంచి ఇద్దరు ప్లేయర్లను తీసుకుంది. 99 శాతం ఈ ప్రక్రియ పూర్తి అయినట్లే' అని బీసీసీఐ అధికారి వెల్లడించారు. 2018లో పంజాబ్ జట్టు కెప్టెన్సీ అందుకున్న అశ్విన్.. 2019 సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడి 15 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. బౌలింగ్ లోనే కాకుండా కెప్టెన్ గానూ ఫెయిల్ అయ్యాడు. 

IPL
ashwin
kings xi punjab
IPL 2020
ravichandran ashwin
delhi capitals

మరిన్ని వార్తలు