టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్

Submitted on 24 April 2019
IPL 2019: RCB vs KXIP win toss opt to bowling at Chinnaswamy Stadium

ఐపీఎల్ 2019 సీజన్ లో భాగంగా బుధవారం (ఏప్రిల్ 24, 2019) ఇక్కడ బెంగళూరులోని చిదంబరం స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. తొలుత టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. 

పంజాబ్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. శామ్ కరన్, హర్ ప్రీత్ బ్రార్ స్థానంలో నికోలస్ పూరన్, అంకిత్ రాజ్ పూట్ జట్టులోకి వచ్చారు. బెంగళూరు జట్టులో కూడా రెండు మార్పులు జరిగాయి. స్టెయిన్ తప్పించి అతని స్థానంలో సౌథీ జట్టులోకి రాగా.. నెగీ స్థానంలో వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వచ్చాడు. 
Also Read : వేలంలో నన్నేవరూ కొనరు : అదో ట్రేడ్ సీక్రెట్.. CSK సక్సెస్ మంత్రా చెప్పను

బెంగళూరు జట్టు నుంచి పార్థీవ్ పటేల్, కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. పంజాబ్ జట్టు నుంచి తొలి ఓవర్ అంకిత్ రాజ్ పుట్ బౌలింగ్ అందుకున్నాడు.  

పంజాబ్ 10 మ్యాచ్ లు ఆడగా.. అందులో 5 మ్యాచ్ లు ఓడి 5 మ్యాచ్ లు గెలిచి 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో నిలిచింది. బెంగళూరు జట్టు ఆడిన 10 మ్యాచ్ ల్లో మూడు గెలిచి 7 మ్యాచ్ లు ఓడింది. దీంతో కోహ్లీసేన పాయింట్ల పట్టికలో 6 పాయింట్లతో దిగువ (8) స్థానంలోకి పడిపోయింది.

Teams  : 

Royal Challengers Bangalore :

Parthiv Patel(w), Virat Kohli(c), AB de Villiers, Marcus Stoinis, Akshdeep Nath, Moeen Ali, Washington Sundar, Tim Southee, Navdeep Saini, Umesh Yadav, Yuzvendra Chahal


Kings XI Punjab :

KL Rahul(w), Chris Gayle, Mayank Agarwal, David Miller, Mandeep Singh, Nicholas Pooran, Ravichandran Ashwin(c), Hardus Viljoen, Murugan Ashwin, Ankit Rajpoot, Mohammed Shami 

IPL 2019
royal challengers bangalore
rcb
KXIP
kings xi punjab
Virat Kohli
Ravichandran Ashwin 

మరిన్ని వార్తలు