ఇండియాలోనే IPL : మార్చి 23 నుంచి మ్యాచ్ లు

Submitted on 8 January 2019
IPL 2019 to be played in India from March 23

IPL 2019 షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. ఇండియాలోనే నిర్వహించనున్నట్లు ప్రకటించింది బీసీసీఐ. దేశం విడిచి వెళ్లనున్నట్లు వస్తున్న వార్తలను ఖండిస్తూ.. అధికారికంగా ప్రకటించింది బోర్డు. తేదీ కూడా కన్ఫామ్ చేసింది. 2019, మార్చి 23వ తేదీ నుంచి మ్యాచ్ లు ప్రారంభం కాబోతున్నట్లు వెల్లడించారు అధికారులు. ఏయే తేదీలు, వేదికలు ఎక్కడెక్కడ అనేది మాత్రం ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే పూర్తి షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది సుప్రీంకోర్టు నియమించిన కమిటీ.

మార్చి - మే నెలల మధ్య దేశంలో జనరల్ ఎలక్షన్స్ జరనున్నాయి. ఇదే సమయంలో ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహించటం అంటే భద్రతాపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే గత ఎన్నికల సమయంలో ఐపీఎల్ ను విదేశాలకు తరలించారు. ఈసారి కూడా అలాంటి పరిస్థితే ఉందని వార్తలు వచ్చాయి. ఈ వార్తలన్నింటినీ కొట్టిపారేస్తూ.. సంచలన నిర్ణయం తీసుకుంది బీసీసీఐలోని కమిటీ. ఇండియాలోనే నిర్వహించటానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. మార్చి 23వ తేదీ నుంచి మ్యాచ్ లు ప్రారంభం అవుతాయని కూడా ప్రకటించటం విశేషం. 

IPL 2019
india
IPL
March 23

మరిన్ని వార్తలు