కొత్త ఐఫోన్-XI ఫస్ట్ లుక్ లీక్ : 3 రియర్ కెమెరాలు!

Submitted on 7 January 2019
iPhone XI first picture is out, finally an iPhone with triple rear cameras

2019 కొత్త ఏడాదిలో ఐఫోన్ లవర్స్ కు గుడ్ న్యూస్. మరో సరికొత్త మోడల్ ఐఫోన్ ను ఆపిల్ త్వరలో మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. ఇప్పటివరకూ ఐఫోన్ XS, ఐఫోన్ XS MAX, ఐఫోన్ XR లాంటి ఎన్నో మోడల్స్ తో యూజర్లను ఆకర్షించిన యాపిల్ మొబైల్ తయారీ సంస్థ.. మరో మోడ్రాన్ ఐఫోన్ (నెక్ట్స్ జనరేషన్) ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అదే ఐఫోన్ XI. కానీ, ఈ ఫోన్ విడుదల కాక ముందే ఫోన్ ఫీచర్లకు సంబంధించిన ఫస్ట్ ఫొటో లీకయింది.

అదిరిపోయే ఫీచర్లు..
లీకైన ‘ఐఫోన్ ఎలెవన్’ సిరీస్ ఫస్ట్ లుక్ ను ఓసారి పరిశీలిస్తే.. గతంలో ఎన్నడూ లేనంతంగా స్పెషల్ అప్ కమింగ్ ఐఫోన్స్ ను ఆపిల్ ప్రవేశపెట్టనుందా అనే ప్రశ్న తలెత్తకమానదు. అవును. ఐఫోన్ ఎలెవన్ సరికొత్త మోడల్. ఇంతకీ ఈ ఫోన్ లో ప్రత్యేకత ఏంటంటే.. కొత్త ఐఫోన్ ఎలెవన్ లో మూడు రియర్ కెమెరాలు ఉన్నాయి. పక్కనే ఎల్ఈడీ ప్లాష్ లైట్.. అక్కడే మూడు రియర్ కెమెరాలు స్క్యేయిర్ ఫోజిషన్ లో దర్శనమిచ్చాయి. ఐఫోన్ వెనుక భాగంలో టాప్ కార్నర్ లో కనిపిస్తున్న ఈ మూడు ఫీచర్లు ఐఫోన్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

ఫ్రంట్ ఫ్యానెల్ పై సస్పెన్స్..
మరో ప్రత్యేకత కూడా ఉందండోయ్.. మైక్రోఫోన్ ఫీచర్ కూడా అదే బాక్స్ లో పీక్స్ చేశారు. బ్లాక్ కలర్. టాప్ పోర్షన్, వెనుక మూడు రియర్ కెమెరాలు మాత్రమే కనిపిస్తున్నాయి. కింది భాగంలో ఆపిల్ బ్రాండ్ లోగోను డిజైన్ ఉంది. ఫోన్ ఫ్రంట్ ప్యానెల్ మాత్రం రివీల్ చేయలేదు. ఐఫోన్ ఎలెవన్ ఫోన్ ట్రేడేషన్ వైడ్ నాచ్ కు భిన్నంగా వాటర్ డ్రాప్ నాచ్ తో డిజైన్ తో రూపొందిస్తున్నారేమో.

వచ్చే జనరేషన్ కు తగట్టుగా ఈ సరికొత్త ఐఫోన్ ఎలెవన్ ప్రస్తుతానికి ఇంజినీరింగ్ వ్యాలీడేషన్ టెస్టు (ఈవీటీ) స్టేజ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఫైనల్ డిజైన్ తో త్వరలో ఈ ఐఫోన్ ఇండియన్ మార్కెట్లోకి కూడా విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

iPhone XI
 iPhone
triple rear cameras
iPhones 2019
Apple Leak
New iPhone XI

మరిన్ని వార్తలు