మీ ఐఫోన్ లో.. ఈ Apps ఉంటే మటాష్

Submitted on 7 February 2019
iPhone Apps to Be Secretly Recording Your Screen, Capturing Sensitive Data 

మీరు ఐఫోన్ వాడుతున్నారా? జర జాగ్రత్త. మీరు వాడే ఐఫోన్ పాపులర్ iOS యాప్స్ లో డేంజరస్ యాప్స్ ఉన్నాయట. ఈ యాప్స్ మీ ఫోన్ లో ఏం చేస్తున్నాయో గుర్తించలేరు. కనీసం మీ పర్మిషన్ కూడా తీసుకోవు. మీకు తెలియకుండానే ఐఫోన్ స్ర్కీన్ పై మీ పర్సనల్ డేటాను రికార్డు చేస్తున్నాయట. ఈ నమ్మలేని నిజాన్ని టెక్ క్రంచ్ బయటపెట్టింది. ఐఫోన్ లో ఉండే కొన్ని పాపులర్ యాప్స్ ఇదంతా చేస్తున్నట్టు గుర్తించింది. పాపులర్ ఐఫోన్ యాప్స్ ఎనాల్టిక్స్ కంపెనీ గ్లాస్ బాక్స్ (Glassbox)ను సెషన్ రిప్లేయింగ్ యూజ్ చేస్తున్నాయి. ఈ టెక్నాలజీ ఆధారంగా ఆయా యాప్ లపై యూజర్లు చేసే ప్రతి మూమెంట్ ను రికార్డు చేస్తాయి. క్రెడిట్, డెబిట్ వంటి ఫైనాన్షియల్ ఇన్మరేషన్ కూడా క్యాప్చర్ చేస్తున్నాయట. యూజర్ల స్ర్కీన్లను రికార్డు చేసే సమయంలో కనీసం సదరు యూజరు నుంచి ఎలాంటి అనుమతి తీసుకోనేది ఉండదు. చడిచప్పుడు కాకుండా మీ విలువైన డేటాను తస్కరిస్తుంటాయి. 

ఆ డేంజరస్ యాప్స్ ఇవే..
ఐఫోన్ లో పాపులర్ యాప్స్ బంచ్ గా పిలువబడే డేంజరస్ యాప్స్ ఇవే.. ఎయిర్ కెనడా, ఎక్సీపీడియా యాప్స్ యూజర్ల యాక్షన్లను ఎప్పటికప్పుడూ గ్లాస్ బాక్స్ ఎనాలిటిక్స్ ద్వారా రికార్డు చేస్తున్నట్టు టెక్ క్రంచ్ గుర్తించింది. ఈ యాప్స్ తో పాటు మరికొన్ని యాప్స్ ను కూడా హోటళ్లు, ట్రావెల్ వెబ్ సైట్లు, ఎయిర్ లైన్స్, బ్యాంకుల పేరుతో ఉన్నట్టు గుర్తించినట్టు తెలిపింది. ఈ యాప్స్ యూజర్ల డేటాను రికార్డు చేస్తున్నాయా? రికార్డు చేసిన డేటాను ఏం చేస్తారనేదానిపై కూడా స్పష్టత లేదు. కామన్ గా ఎవరీ సింగిల్ ట్యాప్, కీబోర్డు ఎంటరీ, బటన్ పుష్ వంటి వాటిపై యాప్ డెవలపర్లు యూజర్ల డేటాను రికార్డు చేసే టెక్నాలజీని ఎనేబుల్ చేస్తారు. యూజర్లు సదరు యాప్ వాడుతునప్పుడు మాత్రమే ఈ డేటా క్యాప్చరింగ్ జరుగుతుంది తప్ప యాప్ క్లోజ్ చేసినప్పడు మాత్రం ఉండదు. 
 

గ్లాస్ బాక్స్ సెషన్ రిప్లే టెక్నాలజీని సింగపూర్ Airlines, Hotels.com (ఎయిర్ లైన్స్, హోటల్స్.కామ్) కంపెనీ యాప్స్ కూడా వాడుతున్నాయి. ఈ టెక్నాలజీ సాయంతో యూజర్లు ఎలా వాడుతున్నారనేది బ్యాక్ అండ్ స్ర్కీన్లపై రికార్డు చేస్తుంటాయి. నిజానికి యూజ్ ఫుల్ డెవలపర్ ఫీచర్ మాత్రమే. కొన్ని పాపులర్ యాప్స్ మాత్రమే యూజర్ల ఫైనాన్షియల్ డేటాను రికార్డు చేస్తున్నాయని, అన్నీ యాప్స్ అలా కాదని పేర్కొంది. యూజర్లు డేటాను ఒకసారి డివైజ్ స్ర్కీన్ పై రికార్డు చేశాక.. సదరు యాప్ డెవలపర్ కు డేటాను సెండ్ చేస్తాయి. ఎయిర్ కెనడా ఐఓఎస్ యాప్ లో ఇదే జరిగినట్టు టెక్ క్రంచ్ గుర్తించింది. యూజర్ పాస్ పోర్ట్ నెంబర్, క్రెడిట్ కార్డు వివరాలను మొత్తం డెవలపర్ కు చేరవేసినట్టు తెలిపింది.


దీంతో యూజర్ల విలువైన డేటా దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. ఇటీవల ఎయిర్ కెనడా మొబైల్ యాప్.. డేటా బ్రీచ్ కు పాల్పడినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో 20వేల యూజర్ల విలువైన డేటా బహిర్గతమైనట్టు క్రంచ్ రిపోర్టు నివేదించింది. IOS App store లో ఏదైనా యాప్స్ ను స్టోర్ చేసే ముందు ప్రతి యాప్ డెవలపర్ తమ యాప్ లో ప్రైవసీ పాలసీని తప్పనిసరిగా ఉండాలి. వీటిలో ఏ ఒక్క యాప్ కూడా తమ ప్రైవసీ పాలసీలో యూజర్ల డేటాపై స్ర్కీన్ రికార్డు చేస్తామనే అంశాన్ని గుర్తించలేదని తెలిపింది. 

iPhone Apps
Secretly Record
Mobile Screen
Sensitive Data 

మరిన్ని వార్తలు