సెప్టెంబర్ 20 నుంచి సేల్ : iPhone 11, Pro, Pro Max ఫోన్లపై క్యాష్ బ్యాక్ ఆఫర్లు 

Submitted on 10 September 2019
iPhone 11, 11 Pro, 11 Pro Max to go on sale in India from September 20, may come with cashback offers

ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ ఐపోన్ 11 సిరీస్ ఫోన్లను లాంచ్ చేయనుంది. కాలిఫోర్నియాలోని క్యూపర్టినోలో మంగళవారం (సెప్టెంబర్ 10)న రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఆపిల్ స్పెషల్ ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఆపిల్ 2019 ఐఫోన్ 11 సిరీస్ ఫోన్లు రిలీజ్ చేయనుంది. వచ్చే జనరేషన్ ఐఫోన్లకు సంబంధించి పేర్లను ఇంకా రివీల్ చేయలేదు. ఈవెంట్ లో మొత్తం మూడు కొత్త ఐఫోన్ మోడల్స్ ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ రిలీజ్ కానున్నాయి. ఇండియాలో కొత్త ఐఫోన్ 11 సిరీస్ ఫోన్లు సెప్టెంబర్ 20న లాంచ్ కానున్నాయి. సంబంధిత వర్గాల ప్రకారం. అన్ని మూడు ఐఫోన్ 11 మోడల్స్ సెప్టెంబర్ 20 నుంచి పేటీఎం మాల్లో సేల్స్ ప్రారంభం కానున్నాయి. పేటీఎం మాల్ 2019 ఐఫోన్ మూడు మోడల్స్ పై రూ.10వేల వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్లు అందిస్తోంది. 

ఐఫోన్ 11 బేసిక్ మోడల్ : 
2019 ఐఫోన్ మోడల్ జాబితాలో iphone 11 బేసిక్ వేరియంట్ ఫోన్ (బేసిక్ మోడల్ 64GB ఇంటర్నల్ స్టోరేజీ) ధర 749 డాలర్లు.. అంటే భారత కరెన్సీలో రూ.53వేలు వరకు ఉంటుంది. 128GB స్టోరేజీ ఫోన్ ప్రారంభ ధర 799డాలర్లు.. రూ.57వేల 500 ఉండగా.. 256GB స్టోరేజీ వేరియంట్ ప్రారంభ ధర 899 డాలర్లు.. భారత కరెన్సీలో రూ.64వేల 700కే లభ్యం కానున్నాయి. 

ఐఫోన్ 11 ప్రో : 
* 128GB స్టోరేజీతో ఐఫోన్ 11 ప్రో.. ప్రారంభ ధర 999డాలర్లు (రూ.71వేలు) 
* 512GB స్టోరేజీ వేరియంట్ ఫోన్ ప్రారంభ ధర 1,199 డాలర్లు (రూ.86వేలు)

ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ : 
* 128GB స్టోరేజీ బేసిక్ మోడల్ ప్రారంభ ధర 1,099 డాలర్లు (రూ.79వేలు)
* 512GB వెర్షన్ ప్రారంభ ధర 1,299 డాలర్లు (రూ.93వేల 500)

అమెరికాలో ఐఫోన్ 11 సిరీస్ ఫోన్ల ధరల కంటే ఇండియాలోని ఐఫోన్ 11 సిరీస్ ఫోన్ల ధరలు ఎక్కువ. ఆపిల్ ప్రొడక్టులను బట్టి వాటి ధరలతో అందుబాటులో ఉండనున్నాయి. ఇండియాలో రిలీజ్ అయ్యే ఐఫోన్ 11 సిరీస్ ఫోన్లకు సంబంధించి అధికారిక ధరలను కంపెనీ త్వరలో రివీల్ చేయనుంది. 

iPhone 11
11 Pro
11 Pro Max
sale in India
September 20
cashback offers

మరిన్ని వార్తలు