ఐటీలో కలకలం..ఇన్ఫోసిస్ ఎఫెక్ట్ తో ఒక్కరోజే 53వేల కోట్ల నష్టం

Submitted on 22 October 2019
Investors Lose Rs. 53,000 Crore As Infosys Shares Sink Amid Row Over CEO

ఇన్ఫోసిస్ ఉదంతంలో ఐటీ మార్కెట్లో కలకలం రేగింది. దీంతో ఇన్ఫోసిస్ ఫేర్లు భారీగా పతనమయ్యాయి. ఇన్వెస్టర్లు బాగా నష్టపోయారు.ఇన్ఫోసిస్ సీఈవో,సీఎఫ్ వో అనైతిక విధానాలకు పాల్పడుతున్నారంటూ ఆ కంపెనీకి చెందిన కొందరు ఉద్యోగులు(విజిల్ బ్లోయర్స్) ఆరోపణలతో దేశీయ రెండవ అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కు భారీ షాక్ తగిలింది. స్టాక్ మార్కెట్లో ఇన్ఫోసిస్ షేర్లు భారీగా పడిపోయాయి. మంగళవారం(అక్టోబర్-22,2019) ఒక్కరోజే ఆ కంపెనీకి చెందిన షేర్లు 17శాతం పడిపోయాయి

. గత ఆరేళ్లలో తొలిసారిగా ఆ కంపెనీ షేర్లు అత్యంత కనిష్టాన్ని నమోదుచేశాయి. ఇన్వెస్టర్లు దాదాపు 53వేల కోట్లు నష్టపోయారు. సీఈవో,సీఎఫ్ వోలు కంపెనీ రాబడిని ఎక్కువ చేసి చూపించడానికి ప్రయత్నించారని, షార్ట్ టర్మ్ రెవిన్యూ, ఫ్రాఫిట్స్ కోసం అనైతిక అకౌంటింగ్ విధానాలను అనుసరిస్తున్నారని  ఆరోపణలు చేశారు. కంపెనీ బోర్డుకు ఫిర్యాదు చేయడమే కాదు.. ఆ ఆరోపణలకు బలాన్ని చేకూర్చేలా ఈ మెయిల్స్, వాయిస్ రికార్డింగ్‌లు కూడా పంపారు. దీంతో ఈ ఇష్యూపై విచారణ జరిపేందుకు కంపెనీ ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అదే ఇపుడు ఆ కంపెనీలో దుమారాన్నిరేపింది. షేర్ మార్కెట్లో అనూహ్య పతనానికి కారణమైంది.

ఇన్ఫోసిస్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్,అదేవిధంగా యూఎస్ సెక్యూరిటీ అండ్ ఎక్సేంజ్ కమిషన్(SEC)కి విజిలిబ్లోయర్స్ లేఖ రాశారు. తామ ఆరోపణలు నిజం అని నిరూపించే ఈమెయిల్స్, వాయిస్ రికార్డింగ్‌లు ఉన్నాయని ఆ లేఖలో వారు తెలిపారు. ఈ క్వార్టర్(త్రైమాసికం)లో ఎఫ్‌డిఆర్ కాంట్రాక్టులో 50 మిలియన్ డాలర్ల ముందస్తు చెల్లింపు రివర్సల్‌లను గుర్తించవద్దని చాలా ఒత్తిడి తెచ్చారని, ఇది అకౌంటింగ్ ప్రాక్టీస్‌కు విరుద్ధమని, ఇది త్రైమాసికంలో లాభాలను తగ్గిస్తుందని, స్టాక్ ధరకు ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఇన్ఫోసిస్ సీఈవో,సీఎఫ్ వో ఒత్తిడి చేస్తున్నారని బోర్డుకి రాసిన లేఖలో వారు ఆరోపించారు. అదేవిధంగా ఆడిటర్లు,బోర్డ్ ఆఫ్ డైరక్టర్ల నుంచి కూడా క్లిష్టమైన సమాచారం దాచబడిందని లేఖలో తెలిపారు.

వెరిజోన్, ఇంటెల్,ఏబిన్ అమ్రో వంటి పెద్ద కాంట్రాక్టులలో ఆదాయ గుర్తింపు విషయాలు అకౌంటింగ్ ప్రమాణాల ప్రకారం లేవని,దీనికి సంబంధించిన ఈమెయిల్స్,వాయిస్ రికార్డింగ్స్ తమ దగ్గర ఉన్నాయని,విచారణఅధికారులు తమను అడిగినప్పుడు వీటిని సమర్పిస్తామని విజిల్ బ్లోయర్స్ తెలిపారు. ఆడిటర్స్ కి పెద్ద డీల్ సమాచారం  తెలియజేయవద్దని తమను అడిగినట్లు వారు ఆ లేఖలో తెలిపారు
 

infosys
CO
CFO
53K CRORES
Shares
SINK
Stock market
Lose

మరిన్ని వార్తలు