జ్యోతి గ్యాంగ్ రేప్, హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం

Submitted on 12 February 2019
Investigation speed up in Jyothi murder case

గుంటూరు : మంగళగిరిలో కలకలం రేపిన యువతి గ్యాంగ్ రేపు, హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. జ్యోతి హత్య కేసులో పోలీసులు శ్రీనివాస్ ను ప్రశ్నిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ను మంగళగిరి పోలీసులు పరిశీలిస్తున్నారు. నిన్న సాయంత్రం బైక్ పై శ్రీనివాస్, జ్యోతి వెళ్తున్న దృశ్యాలను పోలీసులు సేకరించారు. నవ్వులూరు వైపు వెళ్లినట్లు సీసీ ఫుటేజీలో రికార్డు అయింది. ఆ దృశ్యాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇంకా సమీపంలోని సీపీ టీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరులోని డార్మెట్ లో ఉంచి ఆ ఇద్దరిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. బంధువులు జ్యోతి హత్యపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాస్ రావు పక్కా పథకం ప్రకారమే జ్యోతి హత్యకు కారణమయ్యాడని ఆరోపిస్తున్నారు. నిన్న మంగళగిరి నవ్వులూరు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. శ్రీనివాస్ ను తీవ్రంగా గాయపర్చారు. యువతిని గాయపర్చి, ఆమెపై గ్యాంగ్ రేపుకు పాల్పడ్డారు. ఎందుకు జ్యోతిపై దాడి చేసి, హత్య చేయాల్సివచ్చిందన్న కోణంలో విచారిస్తున్నారు. శ్రీనివాస్ రావే పతకం ప్రకారం చేశాడా ? యాదృచ్ఛికంగా జరిగిందా? వీరిని గుర్తించిన ఆకతాయిలు హత్య చేసివుంటారా? అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరులో ఫిబ్రవరి 11 సోమవారం రాత్రి 9 గంటల సమయంలో ఏకాంత ప్రదేశంలో ఉన్న ప్రేమికులు జ్యోతి, శ్రీనివాస్ పై నలుగురు యువకులు దాడి చేశారు. దుండగులపై జ్యోతి, శ్రీనివాస్ తిరగబడ్డారు. దీంతో వారు మరింత రెచ్చిపోయారు. ప్రియుడు శ్రీనివాస్ ను బీరు సీసాలతో కొట్టి, తీవ్రంగా గాయపర్చారు. ప్రియురాలు జ్యోతిని కూడా కొట్టిన నలుగురు యువకులు.. ఆ తర్వాత అత్యాచారం చేసి, హత మార్చారు. 
 

Police
Investigation speed up
Jyothi murder case
guntur

మరిన్ని వార్తలు