పవన్ తేజ్: కొణిదెల కుటుంబం నుంచి కొత్త హీరో

Submitted on 12 January 2020
Introducing pavantej  as hero with EeKathaloPaathraluKalpitam

మెగా కుటుంబం నుంచి ఇప్పటికే చాలా మంది హీరోలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. కొణిదెల కుటుంబం నుంచి మెగా లెగసీని కంటిన్యూ చేస్తూ.. పదిమందికి పైగానే వారసులు తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే కొణిదెల కుటుంబం నుంచి మరో హీరో ఎంట్రీ ఇస్తున్నాడు. రామ్ చరణ్‌కు వరసకు తమ్ముడు అయ్యే వ్యక్తి పవన్ తేజ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతుంది. 

‘పవన్ తేజ్ కొణిదెల’ హీరోగా కొత్త డైరెక్టర్ అభిరామ్ దర్శకత్వంలో నిర్మాత రాజేష్ నాయుడు ఓ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ కొత్త సినిమాకు ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్‌తో సినిమా తీస్తున్నారు. హీరోయిన్‌గా ఇందులో మేఘన చేస్తోంది. ‘కొణిదెల’ అనే బ్రాండ్ నేమ్‌తో వస్తున్నాడు కాబట్టి ఈ కొత్త హీరో పవన్ తేజ్ సినిమా ఆడియన్స్ కు ఈజీగానే దగ్గరయ్యే అవకాశం కనిపిస్తుంది.

‘పవన్ తేజ్’ ఇంతకుముందు చిరంజీవి ‘ఖైదీ నెం.150’, రామ్ చరణ్ రంగస్థలం, వరుణ్ తేజ్ వాల్మీకి సినిమాల్లో నటించి సినిమాకు కావాల్సిన మెళకువలు నేర్చుకున్నాడు. ఈ కొత్త సినిమాకు కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ ‌లేటెస్ట్‌గా విడుదలైంది. 

Pavantej
EeKathaloPaathraluKalpitam

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు