ఆసి, సుజాత ‘ఉప్పెన’లా వచ్చేశారు..

Submitted on 14 February 2020
Introducing Panja Vaisshnav Tej as 'AASI' and Krithi Shetty as 'SANGEETA' from Uppena

మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘ఉప్పెన’.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబుదర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో కలిసి సుకుమార్ కూడా నిర్మాణంలో పాలు పంచుకుంటున్నాడు.

Vijay Sethupathi

ఇటీవల విడుదల చేసిన సినిమా ఫస్ట్ లుక్, ఫస్ట్ వేవ్ అండ్ విజయ్ సేతుపతి పోస్టర్స్‌కి మంచి స్పందన లభించింది. ప్రేమికులరోజు సందర్భంగా ఈ సినిమాలో నాయకా నాయికలో పాత్రల పేర్లతో పాటు వారి లుక్స్ రిలీజ్ చేశారు. వైష్ణవ్ తేజ్ ‘ఆసి’ అనే క్యారెక్టర్ చేస్తున్నాడు. బోటులో నిలబడి ఉన్న అతని లుక్ చూస్తే సాయిధరమ్ తేజ్‌ని చూసినట్టే ఉంది.

Panja Vaisshnav Tej

కథానాయిక కృతి శెట్టి ‘సంగీత’ పాత్రలో కనిపించనుంది. ఈ పోస్టర్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రేమ, కుటుంబ విలువల నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘ఉప్పెన’ చిత్రాన్ని 2020 ఏప్రిల్ 2న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు.

 

 

Krithi Shetty

కెమెరా : శ్యామ్ దత్ సైనుద్దీన్, ఎడిటింగ్ : నవీన్ నూలి, ఆర్ట్ : మౌనిక రామకృష్ణ, ఫైట్స్ : వెంకట్, కొరియోగ్రఫీ : బృంద, ప్రేమ్ రక్షిత్, సీఈఓ : చెర్రీ, సమర్పణ : సుకుమార్, నిర్మాతలు : నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్, సుకుమార్.
 
 

Panja Vaisshnav Tej
Krithi Shetty
Vijay Sethupathi
Devi Sri Prasad
Mythri Movie Makers
Sukumar Writings
BuchiBabu Sana
Uppena On April 2nd

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు