స్పెయిన్‌లో శర్వా- కాజల్

Submitted on 20 February 2019
Intresting Details about Sharwanand New Movie-10TV

యంగ్ హీరో శర్వానంద్, కాజల్ అగర్వాల్ జంటగా, సుధీర్ వర్మ డైరెక్షన్‌లో ఒక సినిమా రూపొందుతుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ నిర్మిస్తుంది. ప్రస్తుతం స్పెయిన్‌లో షూటింగ్ జరుగుతుంది. స్పెయిన్‌తో పాటు, అక్కడి చుట్టు పక్కల ప్రాంతాల్లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు, పాటలు కూడా చిత్రీకరించనున్నారు. ప్రస్తుతం శర్వా, కాజల్‌తో పాటు 250 మంది డ్యాన్సర్స్‌తో ఒక పాట పిక్చరైజ్ చేస్తున్నారు. శర్వానంద్, కాజల్ కలిసి నటించడం ఇదే ఫస్ట్ టైమ్.. ఈ సినిమాలో శర్వా లుక్, క్యారెక్టర్ డిఫరెంట్‌గా ఉంటుందని తెలుస్తుంది. తను గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనునన్నాడని, ఇదో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతుందని వార్తలు వస్తున్నాయి..

అక్కడి లోకేషన్ నుండి బయటకొచ్చిన ఫోటోలో శర్వా, హెయిర్ పెంచి, గెడ్డంతో కనిపిస్తున్నాడు. శర్వానంద్, పడి పడి లేచే మనసు, సుధీర్ వర్మ, దోచెయ్, కేశవ ఫ్లాప్‌ల తర్వాత చేస్తున్న సినిమా కాబట్టి, ఈ సినిమా ఆడడం వీళ్ళిద్దరికీ ఇంపార్టెంటే.. త్వరలో టైటిల్ ఫిక్స్ చేసి, ఫస్ట్ లుక్ రిలీజ్ చెయ్యనున్నారు.

Sharwanand
Kajal Agarwal
Sithra Entertainments

మరిన్ని వార్తలు