బ్యూటిఫుల్ మెలోడీ

Submitted on 12 February 2019
Inthena Inthena Lyrical Song from Suryakantam-10TV

మెగా డాటర్ కొణిదెల నిహారిక, రాహుల్ విజయ్ మెయిన్ లీడ్స్‌గా, ముద్దపప్పు ఆవకాయ్ వెబ్ సిరీస్‌తో ఆకట్టుకున్న ప్రణీత్ బ్రహ్మాండపల్లి డైరెక్షన్‌లో, నిర్వాణ సినిమాస్ బ్యానర్‌పై రూపొందుతున్న సినిమా.. సూర్యకాంతం. మొన్నామధ్య రిలీజ్ చేసిన సూర్యకాంతం టీజర్‌‌కి చక్కటి స్పందన వస్తుంది. ఇప్పుడు ఈ సినిమాలోని ఫస్ట్‌సాంగ్ రిలీజ్ అయ్యింది. ఇంతేనా ఇంతేనా, ప్రేమంటే ఇంతేనా.. పడిన దాకా తెలియదే.. ఇంతేనా ఇంతేనా, నీకైన ఇంతేనా.. మనసు లోలో నిలువదే.. అంటూ సాగే బ్యూటిఫుల్ మెలోడీ ఆకట్టుకుంటుంది.

మార్క్ కె రాబిన్ ట్యూన్, కృష్ణకాంత్ లిరిక్స్, సిడ్ శ్రీరామ్ వాయిస్ బాగున్నాయి. యూత్‌ని అలరించేలా ఉందీ పాట.. మార్చ్ 29న సూర్యకాంతం సిల్వర్ స్ర్కీన్స్‌పైకి రాబోతుంది. మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ సమర్పణలో, సందీప్ ఎర్రంరెడ్డి, సృజన్ యరబోలు, రామ్ నరేష్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేసారు.

వాచ్ అండ్ లిజన్ సాంగ్...

Niharika Konidela
Rahul Vijay
Mark K Robin
Krishna Kanth
Sid Sriram
Pranith Bramandapally


మరిన్ని వార్తలు