International News

Friday, September 22, 2017 - 21:39

ఉత్తరకొరియా : అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఐక్యరాజ్యసమితిలో ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కిమ్‌....ఆయన మానసిక స్థితి సరిగా లేదన్నారు. ఉత్తర కొరియాను నాశనం చేస్తామని ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అమెరికా బెదిరింపుల నుంి తమ దేశాన్ని...

Friday, September 22, 2017 - 16:05

ముంబై : చలన చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డైన అస్కార్‌కు భారత దేశం నుంచి బాలీవుడ్‌ చిత్రం న్యూటన్‌ ఎంపికైంది. ఈ మూవీలో రాజ్‌కుమార్‌ రావు ప్రధాన పాత్ర పోషించారు.. దేశంలోని ఎన్నికల ప్రక్రియపట్ల ఓ ఉద్యోగి తీసుకువచ్చిన మార్పేంటి? అన్న అంశంపై ఈ చిత్రం సాగుతుంది. అమిత్‌ వీ మసుర్కర్‌ దర్శకుడు.. ఈ చిత్రం ఇవాళే థియేటర్లలో విడుదలైంది.....

Wednesday, September 20, 2017 - 19:45

చిలీ: మెక్సికోను భారీ భూకంపం కుదిపేసింది. భూకంపం ధాటికి అనేక భవనాలు పేక మేడల్లా కూలిపోయాయి. మరికొన్ని భవనాలు భూ ప్రకంపనలకు చెట్లలా ఊగాయి. భూకంపానికి బోట్లు ఊగిపోయాయి. బోటింగ్‌ షికారు చేస్తున్న టూరిస్టులు బెంబేలెత్తిపోయారు. ప్రకంపనలతో భయాందోళనకు గురైన వేలాదిమంది ప్రజలు ఇళ్లు, ఆఫీసుల నుంచి బయటకు పరుగులు తీశారు. చాలామంది గంటల తరబడి రోడ్లపైనే ఉండిపోయారు....

Wednesday, September 20, 2017 - 11:17

ఢిల్లీ : ఉక్రెయిన్ లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందారు. జపోరోజియా రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హయత్ నగర్ కు చెందిన శివకాంత్ రెడ్డి, బీఎన్ రెడ్డినగర్ కు చెందిన అశోక్ లు జపోరోజియాలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. ఇక్కడ వేయి మంది విద్యార్థులు చదువుతున్నారు. అందులో 600 మంది విద్యార్థులు తెలుగు వారు కావడం గమనార్హం. ఇదిలా ఉంటే పక్కనే ఉన్న సరస్సుకు...

Wednesday, September 20, 2017 - 06:27

ఢిల్లీ : మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై తీవ్రత 7.1గా నమోదయ్యింది. ప్రకంపనాల ధాటికి అనేక భవనాలు కూలిపోయాయి. అనేక మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. భూప్రకంపనలతో ప్రజలు వీధుల్లోకి పరుగులు తీశారు. విద్యుత్‌ లైన్లు, ఫోన్లు లైన్లు తెగిపోయాయి. 10 రోజుల్లోనే రెండు సార్లు భూకంపాలు రావడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. గతంలో 1985లో ఇదే...

Friday, September 15, 2017 - 11:16

ఉత్తరకొరియా : దేశం మరోసారి క్షిపణి ప్రయోగం చేసింది. జపాన్ మీదుగా మరో మిస్సైల్ ప్రయోగం చేసినట్టు తెలుస్తోంది. కొరియా నెల రోజుల్లో రెండోసారి క్షిపణి ప్రయోగం చేసింది. ఈ ప్రయోగం ప్యాంగ్యాంగ్ నుంచి ప్రయోగించారు. 770కి.మీ ఎత్తులో 3,700 కి.మీ దూరం లో ఈ ప్రయోగం జరిపారు. మిస్సైల్ జపాన్ ఉత్తర భాగంలోని హోకైడో మీదుగా ఫసిఫిక్ సముద్రంలో పడింది. జపాన్, దక్షణ కొరియాలు...

Thursday, September 14, 2017 - 09:37

మలేషియా : రాజధాని కౌలాలంపూర్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. జలాన్ దాతుక్ కెర్మాట్ లోని మత పాఠశాలలో మంటలు చెలరేగి 25 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉన్నారు. విద్యార్థులంతా 15ఏళ్లలోపు చిన్నారులే. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

Sunday, September 10, 2017 - 21:38

వాషింగ్టన్ : ఇర్మా తుఫాన్‌ ధాటికి అమెరికా చివురుటాకులా వణికిపోతోంది. ఇప్పటికే కరేబియన్‌ దీవులను ముంచెత్తిన ఇర్మా.. ఇపుడు ప్లోరిడాను అతలాకుతలం చేస్తోంది. ప్రచండగాలులకు విద్యుత్‌ సరఫరా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. మియామి, ఫ్లోరిడా రాష్ట్రాల తీరప్రాంతాల్లో అంధకారం నెలకొంది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 7గంటల ప్రాంతంలో ఇర్మా తుపాను తీరాన్ని తాకింది....

Friday, September 8, 2017 - 20:26

వాషింగ్టన్ : కరేబియన్‌ దీవుల్లో ఇర్మా తుఫాను పెను బీభత్సం సృష్టించింది. అట్లాంటిక్‌ మహాసముద్రంలో ఏర్పడ్డ హరికేన్లలో కెల్లా అత్యంత శక్తిమంతమైన ఈ తుపాను గత రెండు రోజులుగా కరేబియన్‌ దీవులను అతలాకుతలం చేసింది. కరేబియన్‌ దీవుల్లో విధ్వంసం సృష్టించిన ఇర్మా- క్రమంగా అమెరికాలోని ఫ్లోరిడా తీరం వైపు దూసుకెళ్తోంది. డొమినికన్‌ రిపబ్లిక్, హైతీలపై ప్రభావం చూపిన హరికేన్...

Friday, September 8, 2017 - 20:25

చీలి : మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. రిక్టార్‌ స్కేలుపై భూకంప తీవ్రత 8.1 నమోదైంది. గురువారం రాత్రి సంభవించిన భూ ప్రకంపనలకు భయభ్రాంతులకు గురైన జనం వీధుల్లోకి పరుగులు తీశారు. భూకంపం ధాటికి దక్షిణ మెక్సికోలో పలు భవనాలు దెబ్బతిన్నాయి. ఐదుగురు మృతి చెంది ఉంటారని సమాచారం. 90 సెకన్ల పాటు భవనాలు కంపించాయని స్థానికులు చెబుతున్నారు. భూకంపానికి మెక్సికో నగరంలో...

Wednesday, August 30, 2017 - 10:58

టెక్సాన్ : అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రంలో హెరికేన్‌ బీభత్సం సృష్టిస్తోంది. గడిచిన 50 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా వర్షాలు కురుస్తున్నాయి. హర్వే హెరికేన్‌ ధాటికి టెక్సాస్‌ రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. అమెరికాలోనే నాలుగో అతిపెద్ద నగరం హూస్టన్‌ ఇంకా నీటిలోనే నానుతోంది. గత శుక్రవారం తుపాను తీరం దాటగా... ఇప్పటి వరకు వర్షం విరామం లేకుండా కురుస్తూనే ఉంది. ఎడతెరపి...

Sunday, August 27, 2017 - 13:36
Friday, August 18, 2017 - 09:32

స్పెయిన్ : ఆగ్రదాడికి పాల్పడింది తామేనని ఐసిస్ ప్రకటించింది. అమెరికాతో సంబంధాలు కొనసాగిస్తున్నందుకు దాడులకు చేసినట్లు వారు తెలిపారు. ఉగ్రదాడిని అమెరికా, ఫ్రాన్స్ అధ్యక్షులు తీవ్ర ఖండించారు. ఒకే రోజు రెండు సార్లు ఉగ్రదాడుల జగటడంతో స్పెయిన్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

Friday, August 18, 2017 - 08:23

స్పెయిన్ : పోర్ట్ ఆఫ్ కామ్ బ్రిల్స్ రెండో ఉగ్రదాడిని పోలీసులు అడ్డుకున్నారు. అంతకుముందు పర్యటక కేంద్రం బార్సిలోనా సిటీలో పాదచారులపై ఉగ్రవాదుల దాడి చేశారు. వ్యాన్ తో పాదచారులను ఢీకొట్టిన ఉగ్రవాది తర్వాత దాడికి దిగాడు. ఈ ఉగ్రదాడిలో 13 మంది మృతి చెందారు. 100పైగా గాయాలయ్యాయి. ఉగ్రదాడిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఖండించారు. బార్సిలోనా దాడిపై భారత విదేశాంగ మంత్రి...

Friday, August 18, 2017 - 07:25

స్పెయిన్ : ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బార్సిలోనా పట్టణంలో వ్యాన్‌తో బీభత్సం సృష్టించారు. వాహనంతో పాదచారులను ఢీకొట్టారు. ఈ ఘటనలో 13 మంది స్పాట్‌లోనే మృతి చెందగా.. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. దాడి అనంతరం ఓ ఉగ్రవాది సమీపంలో ఉన్న రెస్టారెంట్లోలోకి దూరడంతో ఆ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్న భద్రతా దళాలు రెస్టారెంట్‌ను చుట్టుముట్టి.. ఉగ్రవాదిని బంధించాయి....

Sunday, August 13, 2017 - 12:00

ఇండోనేషియా : సుమత్రా దీవుల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.5 తీవ్రత నమోదైంది. బెంగకులు ప్రాంతానికి 73 కిలోమీటర్ల దూరంలో 35కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీని కారణంగా సుమత్రా దీవులు, సింగపూర్‌లోనూ అక్కడకక్కడా ప్రకంపనలు వచ్చాయి. ప్రజలందరూ ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు...

Wednesday, August 9, 2017 - 21:53

న్యూయార్క్ : అమెరికా, ఉత్తర కొరియాల మ‌ధ్య యుద్ధ మేఘాలు క‌మ్ముకున్నాయి. సై అంటే సై అని రెండు దేశాలు కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. ప్రపంచంలో ఎప్పుడూ జరగని విధంగా ఉత్తర కొరియాకు తగినరీతిలో బుద్ధి చెబుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిప్పులు చెరిగారు. ప్యాంగ్‌యాంగ్‌ మిసైల్‌, అణు కార్యక్రమాలను విస్తరిస్తుంటే చూస్తూ ఊరుకోమన్నారు. ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన...

Sunday, July 30, 2017 - 21:43

స్పెయిన్ : స్పెయిన్‌లోని బార్సిలోనాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. యునైటెడ్‌ స్పెయిన్‌ ఫెస్టివల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సంగీత కచేరి ముగిసిన వెంటనే ఒక్కసారిగా మంటలు చెలరేగి, వేదిక మొత్తం వ్యాపించాయి. దీంతో సంగీతోవ్సవానికి వచ్చిన వారు భయంతో ఆహాకారాలు చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన 22 వేల మందిని అధికారులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అగ్నిమాపక సిబ్బంది...

Friday, July 28, 2017 - 21:28

 

ఢిల్లీ : పాకిస్తాన్‌ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పనామా కేసులో షరీఫ్‌ను కోర్టు దోషిగా ఖరారు చేసింది. ప్రధాని పదవికి అనర్హుడిగా ప్రకటిస్తూ పాక్‌ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెల్లడించింది. కోర్టు తీర్పుతో నవాజ్‌ షరీఫ్‌ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. పనామా గేట్‌ కుంభకోణం కేసులో పాకిస్తాన్‌ ప్రధానమంత్రి...

Friday, July 21, 2017 - 08:15

 

గ్రీస్ : దేశంలో భారీ భూకంపం సంభవించింది. కోస్ ఐలాండ్ లో భూకంప తీవ్రత ప్రభావం ఎక్కువ చూపింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.7గా నమోదు అయింది. భూకంప ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో 100మందికి గాయాలయ్యాయి.

 

Friday, July 14, 2017 - 16:40

బ్రిటన్ : బ్యాంకులకు 9 వేల కోట్ల రుణాలు తీసుకుని ఎగనామం పెట్టిన ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ్‌ మాల్యా భారత్‌కు రావడానికి ఎలాంటి ఉత్సాహం చూపడం లేదు. లండన్‌లో జరిగిన ఫార్ములావన్‌ ప్రమోషనల్‌ ఈవెంట్‌లో పాల్గొన్న మాల్యాతో ఓ జర్నలిస్ట్‌.. భారత్‌ను మిస్సవుతున్నారా..? అని ప్రశ్నించారు. అక్కడ మిస్సవడానికి నాకేమీ లేదు. నా కుటుంబ సభ్యులంతా ఇంగ్లాండ్‌, అమెరికాల్లోనే...

Monday, July 10, 2017 - 21:54

లాస : టిబెట్‌లో భారీ వ‌ర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వ‌ర‌ద‌ల‌కు ఓ ఐదంతస్థుల భ‌వనం నీళ్లలో కుప్పకూలి పోయింది. అప్పటికే ఆ బిల్డింగ్‌లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. చూస్తుండగా.. బిల్డింగ్‌ కూలిపోయింది. అలాగే ఓ ట్రక్ కూడా నీళ్లలో కొట్టకుపోయింది.

 

Monday, July 10, 2017 - 21:50

చిలి : పెరూలో అధికవేగంతో వెళ్తున్న డబుల్‌ డెక్కర్‌ టూరిస్ట్‌బస్సు అదుపుతప్పి లోయలోపడిపోయింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రయాణికులు మరణించగా.. మరో 25 మంది గాయపడ్డారు. లిమాలోని అధ్యక్షభవనానికి 2 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది.నగర అందాలను శాన్‌ క్రిస్టోబల్ కొండపై నుంచి చూసేందుకు వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. 

Monday, July 10, 2017 - 21:46

బీజింగ్ : జర్మనీలో జరిగిన జి-20 సదస్సు సందర్భంగా ప్రధాని మోది, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగలేదని చైనా అధికార ప్రతినిది గెంగ్‌ షువాంగ్‌ స్పష్టం చేశారు. జి-20 సదస్సులో భాగంగా బ్రిక్స్‌ దేశాల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, ప్రధాని మోది కలుసుకున్నారు. ఒకరినొకరు ప్రశంసించుకున్నారు. వీరి మధ్య ద్వైపాక్షిక...

Saturday, July 1, 2017 - 16:01

న్యూయార్క్ : అమెరికాలోని న్యూయార్క్‌ హాస్పిటల్‌లో కాల్పుల ఘటన కలకలం రేపింది. న్యూయార్క్‌లోని వెయ్యి ప‌డ‌క‌లు ఉన్న బ్రాంక్స్-లెబ‌నాన్‌ హాస్పట‌ల్లో గ‌తంలో డాక్టర్‌గా ప‌నిచేసిన వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘ‌ట‌న‌లో ఓమహిళా డాక్టర్‌ చ‌నిపోగా మ‌రో ఆరుగురు గాయ‌ప‌డ్డారు. ఆ తర్వాత తనను తాను కాల్చుకుని సాయుధుడు ప్రాణాలు తీసుకున్నాడు. గాయపడ్డవారిలో ముగ్గురు...

Pages

Don't Miss