International News

Sunday, February 11, 2018 - 19:00

హాంకాంగ్‌ : ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డబుల్‌ డెక్కర్‌ బస్సు బోల్తా పడిన ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 47 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అభిమానులు రేస్‌ కోర్స్‌ను తిలకించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సు... థాయ్‌ పో నుంచి షాటిన్‌ రేస్‌కోర్స్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్‌ బస్సును అతివేగంగా...

Sunday, January 21, 2018 - 08:31

ఢిల్లీ : ఆర్థిక సంక్షోభంతో అమెరికా షట్‌డౌన్‌ అయింది. నిర్ణీత వ్యవధిలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందక పోవడంతో అమెరికా ప్రభుత్వం మూత పడింది. అత్యవసర సేవలు మినహా ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించాయి. ఈ పరిస్థితికి నువ్వంటే నువ్వని రిపబ్లికన్లు, డెమోక్రాట్లు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. అమెరికా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రభుత్వ ఖర్చులకు సంబంధించి...

Sunday, January 21, 2018 - 06:47

ఢిల్లీ : ఆఫ్గనిస్థాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కాబూల్‌ సిటీలోని ఇంటర్‌కాంటినెంటల్‌ హోటల్‌పై గ్రనేడ్‌లతో దాడి చేశారు. ముష్కరుల దాడిలో 36 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు. శనివారం రాత్రి 9గంటల ప్రాంతంలో మారణాయుధాలతో హోటల్‌లోకి దూరిన నలుగురు ఉగ్రవాదులు.. విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. కనిపించిన వారిని విడువకుండా తుపాకులతో కాల్చివేశారు....

Thursday, January 18, 2018 - 06:32

ఢిల్లీ : భారత పర్యటనలో ఉన్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గుజరాత్‌ చేరుకున్నారు. అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టులో బెంజమిన్ నెతన్యాహు దంపతులకు ప్రధాని మోది స్వాగతం పలికారు. అనంతరం బెంజమిన్‌తో కలిసి మోది సబర్మతి ఆశ్రమం వరకు రోడ్ షోలో పాల్గొన్నారు. సబర్మతి ఆశ్రమం ప్రత్యేకతలను నెతన్యాహు దంపతులకు ప్రధాని వివరించారు. ఆశ్రమంలో ఉన్న మగ్గంపై బెంజమిన్ దంపతులు నూలు...

Monday, January 15, 2018 - 21:26

అమెరికా : కాలిఫోర్నియాలో కారు అదుపుతప్పి గాల్లోకి ఎగిరి ఏకంగా భవనం రెండో అంతస్థులోకి దూసుకెళ్లింది. స్థానిక శాంతా అనా ప్రాంతంలో మితిమీరిన వేగంతో వెళ్తున్న ఓ సెడాన్‌ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. దీంతో ఒక్కసారిగా కారు గాల్లోకి లేచి పల్టీలు కొట్టి రోడ్డు పక్కనే ఉన్న ఓ కార్యాలయం రెండో అంతస్తులోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో కారులో ఇద్దరు ప్రయాణిస్తున్నారు....

Sunday, December 31, 2017 - 17:29

అక్లాండ్ : ప్రపంచవ్యాప్తంగా కొత్త సంవత్సరం సంబరాలు మొదలయ్యాయి. న్యూజిలాండ్‌లో ముందుగా.. కొత్త సంవత్సరం వేడుకలు ప్రారంభమయ్యాయి. అక్కడి కాలమానం ప్రకారం 12 గంటలకు న్యూ ఇయర్ వేడుకలు అంబరాన్నంటాయి. బాణాసంచా వెలుగుల మధ్య ఆక్లాండ్ నగరం వెలిగిపోయింది.

Friday, December 15, 2017 - 08:30

విజయవాడ : సాన్ ప్రాన్సిస్కోలోని గూగుల్ ఎక్స్ కార్యాయంలో ఏపీ ప్రభుత్వం, గూగుల్ ఎక్స్ కంపెనీ మధ్య ఒప్పందం కుదిరింది. ఏపీ ప్రభుత్వం తరపున మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఈ ఒప్పందం జరిగింది. ఒప్పందంలో భాగంగా ఏపీలో డెవలప్ మెంట్ సెంటర్ ను గూగుల్ ఏర్పాటు చేయనుంది. మొదటిసారిగా గూగుల్ ఎక్స్ ఇండియాలో అడుగుపెట్టనుంది. త్వరలో విశాఖ జిల్లాలో సెంటర్ ను ఏర్పాటు చేయనుంది....

Wednesday, November 15, 2017 - 21:32

జింబాబ్వేలో సైనిక తిరుగుబాటు కలకలం రేపింది. అధికారాలను హస్తగతం చేసుకున్న ఆర్మీ... ఆ దేశ అధ్యక్షుడు రాబర్ట్‌ ముగాబేను హౌస్‌ అరెస్ట్‌ చేసింది. తాము ఎలాంటి తిరుగుబాటుకు ప్రయత్నించలేదని ...అధ్యక్షుడు రాబర్ట్‌ ముగాబే చుట్టూ ఉన్న క్రిమినల్స్‌ను నాశనం చేసేందుకు పవర్‌ను తమ చేతుల్లోకి తీసుకున్నట్లు జింబాబ్వే మిలటరీ ప్రకటించింది. మంగళవారం అధ్యక్షుడు రాబర్ట్‌ ముగాబే ప్రయివేట్‌...

Monday, November 13, 2017 - 08:31

ఇరాన్ : భూకంపంతో ఇరాక్- ఇరాన్ సరిహద్దులు కదిలిపోయాయి. ఇరాన్ - ఇరాక్ సరిహద్దులో ఆదివారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 7.3గా నమోదైంది. ఈ భూకంపంతో భారీ స్థాయిలో ఆస్తి..ప్రాణ నష్టం సంభివించింది. చాలా గ్రామాలకు రవాణా పూర్తిగా స్థంభించింది. పాక్..లెబనాన్..టర్కీ దేశాల్లో కూడా భూ ప్రకంపనాలు చోటు చేసుకున్నాయి. మొత్తంగా 130 మంది మృతి చెందగా 200...

Monday, November 6, 2017 - 21:30

ఢిల్లీ : ఉత్తరకొరియా విషయంలో సహనం నశించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. ఉత్తరకొరియా దూకుడుకు కళ్లెం వేసేందుకు అమెరికా వ్యూహాలకు జపాన్ మద్దతు పలికిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఉత్తరకొరియా అణు పరీక్షలు.. యావత్‌ ప్రపంచానికి, అంతర్జాతీయ శాంతి, సుస్థిరతకు పెను ముప్పుగా పరిణమించిందని ట్రంప్‌ పేర్కొన్నారు. ఉత్తరకొరియా నుంచి పొంచి ఉన్న...

Sunday, November 5, 2017 - 21:03

ఢిల్లీ : ఆసియాలో పర్యటిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఉత్తర కొరియా గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఉత్తరకొరియా గురించి నిర్లక్ష్యంగా వ్యాఖ్యలు చేసినా కఠిన చర్యలు తప్పవని కొరియా పత్రిక హెచ్చరించింది. జపాన్ రాజధాని టోక్యోలో ట్రంప్ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఏ నియంత అమెరికాను తక్కువగా అంచనా వేయొద్దని పరోక్షంగా ఉత్తర కొరియాను హెచ్చరించారు. ట్రంప్ వ్యాఖ్యలు...

Thursday, November 2, 2017 - 21:29

 

ఢిల్లీ : న్యూయార్క్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో అమెరికా వలస విధానంపై ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. వలస విధాన చట్టాలను మరింత కఠినతరం చేయాలని ట్రంప్‌ నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా గ్రీన్‌కార్డు జారీల్లో అనుసరిస్తున్న లాటరీ విధానాన్ని రద్దు చేసేందుకు ట్రంప్‌ ప్రతిపాదించారు. న్యూయార్క్‌లో దాడికి పాల్పడింది ఉజ్బెకిస్థాన్‌కు...

Saturday, October 28, 2017 - 10:31

ఢిల్లీ : స్పెయిన్‌లో అంతర్భాగంగా ఉన్న కాటలోనియా స్వతంత్రం ప్రకటించుకుంది. స్పెయిన్‌ నుంచి వేరుపడేందుకు రూపొందించిన బిల్లుకు పార్లమెంట్‌ అనుకూలంగా ఓటువేసింది. మొత్తం 135 మంది ఉన్న ఛాంబర్‌లో 70 మంది స్వతంత్రానికి మద్దతుగా ఓటేశారు. ఇప్పటి వరకు స్వతంత్ర ప్రతిపత్తి గల ప్రాంతంగా ఉన్న కాటలోనియాలో ప్రత్యక్ష పాలన ప్రవేశపెట్టేందుకు స్పెయిన్‌ సిద్ధమవుతున్న తరుణంలో ఈ...

Tuesday, October 24, 2017 - 21:48

చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ పదవిని మరో ఐదేళ్లు పొడిగిస్తూ అధికార కమ్యూనిస్టు పార్టీ నిర్ణయం తీసుకుంది. 2022 వరకు ఆయన చైనా అధ్యక్ష పదవిలో కొనసాగనున్నారు. 64 ఏళ్ల జిన్‌పింగ్‌ మరో అరుదైన ఘనతను కూడా అందుకున్నారు. దేశంలో తిరుగులేని నేతగా ఎదిగిన జిన్‌పింగ్‌ పేరును చైనా కమ్యూనిస్టు పార్టీ రాజ్యాంగంలో చేర్చింది. దీంతో మావో తర్వాత అత్యంత శక్తిమంతమైన అధ్యక్షుడిగా జిన్‌పింగ్...

Monday, October 23, 2017 - 18:28

ఢిల్లీ : యూఏఈ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అబుదాబీ ఇన్వెస్ట్ మెంట్ అథార్టీ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. భారత్ లో పెట్టే బిలియన్ డాలర్ల పెట్టుబడుల్లో అధిక శాతం ఏపీలో పెట్టాలని బాబు కోరారు. ఇందుకు ఏడీఐఏ సంసిద్ధత వ్యక్తం చేసింది. అత్యంత క్లిష్ట సమయంలో నవ్యాంధ్రలో సీఎంగా బాధ్యతలు స్వీకరించాననని, సంస్కరణలు చేపట్టి సంక్షోభాన్ని అధిగమించడం జరిగిందని...

Sunday, October 22, 2017 - 21:16

విజయవాడ : ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు దుబాయికి చెందిన డీపీ వరల్డ్‌ గ్రూపు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఏయే రంగాల్లో పెట్టుబడులు పెట్టాలన్న అంశాలను పరిశీలించేందుకు జాయింట్‌ టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం, డీపీ వరల్డ్‌ గ్రూపు నిర్ణయించాయి. ఓడ రేవులు, విమానయాన రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు DP వరల్డ్‌ ఆసక్తి వ్యక్తం చేసింది. UAE పర్యటనలో...

Sunday, October 22, 2017 - 18:15

విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దుబాయ్‌ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. బిజినెన్‌ లీడర్స్‌ ఫోరం సమావేశంలో పాల్గొన్నారు. దుబాయ్‌లోని ప్రవాస తెలుగువారి సదస్సులో ప్రసంగించారు. దుబాయ్‌ ఆర్థిక మంత్రి సుల్తాన్‌ బీన్‌ సయీద్‌ అల్‌ మన్సూరీ, డీపీ వరల్డ్‌ గ్రూపు చైర్మన్‌ సుల్తాన్‌ అహ్మద్‌ బీన్‌తో భేటీ అయ్యారు. పరస్పరం పెట్టుబడులకు అవకాశం ఉన్న రంగాలపై చర్చించారు....

Saturday, October 21, 2017 - 15:07

ఢిల్లీ : 2015లో కిడ్నాప్‌కు గురైన పాకిస్తాన్‌ జర్నలిస్టు జీనత్‌ షెహజాదీ ఆచూకి లభించింది. పాకిస్తాన్‌-ఆఫ్గనిస్తాన్‌ సరిహద్దులో ఆమెను రెస్క్యూ చేసినట్లు అధికారులు వెల్లడించారు. మానవ హక్కుల కోసం పోరాడుతున్న జీనత్‌ను పాకిస్తాన్‌ నిఘావర్గాలే కిడ్నాప్‌ చేశాయని ఆమె కుటుంబం సభ్యులు, మానవహక్కుల సంఘాలు ఆరోపించాయి. 25 ఏళ్ల జీనత్‌ ఫ్రీలాన్స్‌ రిపోర్టర్‌గా...

Wednesday, October 18, 2017 - 21:33

బీజింగ్ : చైనా కొత్త శకంలోకి అడుగుపెట్టనుందని ఆ దేశ అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ ప్రకటించారు. చైనా కమ్యూనిస్టు పార్టీ 19వ సమావేశాలు నేడు బీజింగ్‌లో మొదలయ్యాయి. సమావేశంలో చైనా ఆర్థిక ప్రగతి, భవిష్యత్ లక్ష్యాల గురించి... అధ్యక్షుడు జిన్ పింగ్ మూడున్నర గంటల పాటు సుదీర్ఘ ఉపన్యాసంలో వివరించారు. రాజకీయ, ఆర్థిక, సైనిక, పర్యావరణ విషయాల్లో ప్రపంచాన్ని నడిపించే బలమైన...

Wednesday, October 18, 2017 - 21:32

వాషిగ్టంన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన ఓవల్ ఆఫీసులో దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు. భారతీయ సంతతకి చెందిన విజిటర్స్‌తో పాటు యూఎన్ అంబాసిడర్ నిక్కీ హేలీ, సీమా వర్మ, ఇతరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ట్రంప్ కూతురు ఇవాంకా కూడా ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. వైట్‌హౌజ్‌లో దీపావళి వేడుకలను జరుపుకునే సంప్రదాయాన్ని మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్...

Saturday, October 7, 2017 - 18:09

నార్వే : మానవాళి ఎదుర్కొంటోన్న తీవ్రమైన సమస్యపై ఐకెన్ పని చేస్తోంది. ఐకెన్ అంటే ఇంటర్నేషనల్ క్యాంపెయిన్‌ టు అబాలిష్‌ న్యూక్లియర్ వెపన్స్‌ సంస్థ. అణ్వస్త్ర ప్రయోగంతో ఎదురయ్యే విధ్వంసకర పరిణామాలపై అవగాహన కల్పిస్తూ, అణ్వస్త్ర నిర్మూలనకు కృషి చేస్తోంది. ఒప్పంద ఆధారిత అణ్వస్త్ర నిషేధం కోసం ఆ సంస్థ చేస్తోన్న ప్రయత్నాలకు గుర్తింపు, ప్రోత్సాహం...

Tuesday, October 3, 2017 - 07:23

లాస్ వెగాస్ : అమెరికాలో కాల్పులు మరోసారి బీభత్సం సృష్టించాయి. లాస్‌వెగాస్‌లోని మ్యూజిక్‌ ఫెస్టివల్‌లో ఓ సాయుధుడు జరిపిన కాల్పుల్లో 58 మృతి చెందారు. ఐదు వందల మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాల్పులు జరిపిన అనంతరం దుండగుడు గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దుండగుడు అమెరికన్‌ పౌరుడు స్టీఫెన్‌ ఫెడాక్‌గా...

Monday, October 2, 2017 - 13:08

అమెరికా : అగ్ర రాజ్యంలో మళ్లీ కాల్పులు కలకలం సృష్టించాయి. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అమెరికాలో రోజు రోజుకీ గన్ కల్చర్ పెరిగిపోతుంది. తుపాకీ చేతిలో ఉన్న ప్రతివాడు పిచ్చివాడిలా మారిపోతున్నాడు. కారణం లేకుండానే తమ చేతుల్లో తుపాకులకు పని చెప్పి రక్తాన్ని కళ్ల చూస్తున్నారు. ప్రతి చిన్న సంఘటనకు తుపాకీ మోత మోగుతోంది. బుల్లెట్లు...

Friday, September 29, 2017 - 10:26

నేపాల్ లో హిందూ మత గురువులు మూడేళ్ల బాలిక త్రిష్ణా శాక్యను తమ ఇష్ట దేవతగా ఎంపిక చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతోంది. ఒకసారి కుమారీగా ఎంపికైన బాలిక యుక్త వయస్సు వచ్చే వరకు దేవతగా ఉండనున్నారు. నాలుగేళ్ల యవస్సులో కుమారీగా మారిన 'ప్రీతి శక్యా' యుక్త వయస్సుకు చేరుకుంది. దీనితో తాజా ఎంపిక అవసరమైంది. నేపాల్ అధ్యక్షుడు ఆమోదం తెలుపడంతో ఎంపిక ప్రక్రియను...

Tuesday, September 26, 2017 - 11:20

ఎమాన్ అహ్మద్..పేరు వినగానే...ఆమె భారీ శరీరం ముందుగా గుర్తుకొస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో ఈమె భారీకాయురాలిగా నమోదైంది. పాపం ఈమె తీరని లోకాలకు వెళ్లిపోయింది. ఈమె మృతి చెందడం పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. ఇటీవలే ముంబైలో చికిత్స చేయించుకున్న ఎమన్ పూర్తిగా కొలుకొంటుందన్న ఆనందంలో ఆమె కుటుంబం ఉండగానే ఆమె తీరని లోకాలకు వెళ్లిపోయింది. దీనితో ఆమె కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో...

Monday, September 25, 2017 - 21:38

రోమ్ : ఇటలీ ఎయిర్‌ షోలో విషాదం చోటుచేసుకుంది. విన్యాసాలు చేస్తున్న ఓ విమానం సముద్రంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఫైలెట్‌ మృతి చెందాడు. రోమ్‌కు 110 కిలోమీటర్ల దూరంలో టెరాసినా సముద్రతీరంలో ఎయిర్‌ షో నిర్వహించారు. ఇటలీ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన పలు విమానాలు ఈ ప్రదర్శనలో పాల్గొని విన్యాసాలు చేశాయి. ఎయిర్‌షోను తిలకించేందుకు వేల మంది పర్యాటకులు సముద్రతీరానికి...

Pages

Don't Miss