International News

Monday, October 1, 2018 - 19:12

పాకిస్థాన్ : పాకిస్థాన్ లో వున్న పలు సమస్యలకు బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి చిటికెలో పరిష్కారాన్ని చెప్పేశారు. పేదిరకం,ఉగ్రవాదం, సైస్యం పెత్తనం వంటి సమస్యలు పోవాలంటే పాకిస్థాన్ ను నాలుగు ముక్కలు చేయడమే ఆ దేశానికి పరిష్కారమన్నారు. ‘‘పాకిస్తాన్‌కు ఒకే ఒక్క మార్గం ఉంది. బలోచ్‌లు పాకిస్తాన్‌తో కలిసి ఉండేందుకు ఇష్టపడడం లేదు....

Monday, October 1, 2018 - 17:51

స్వీడన్ : నోబెల్ బహుమతులు భౌతిక శాస్త్రంలో, రసాయన శాస్త్రంలో, సాహిత్యంలో, వైద్యశాస్త్రంలో కృషి చేసిన శాస్త్రవేత్తలకు మరియు ప్రపంచ శాంతికి కృషిచేసిన మహానుభావులకు ప్రతియేటా బహూకరిస్తుంటారు. ఈ ఐదు బహుమతులు ప్రఖ్యాత స్వీడిష్ శాస్త్రవేత్త అయిన ఆల్ఫ్రెడ్ నోబెల్ 1895 నాటి వీలునామా ప్రకారం 1901లో ప్రారంభించబడ్డాయి. ఈ నేపథ్యంలో 2018 సంవత్సరానికి...

Monday, October 1, 2018 - 08:34

ఇండోనేషియా :  సునామీ ఇండోనేసియాని అతలాకుతలం చేసేసింది. వెయ్యికి పైబడే ప్రాణాలను హరించేసింది. పాలూ నగరాన్ని శవాలదిబ్బగా మార్చేసింది. సముద్ర తీరాన ఉన్న పాపానికి ఈ నగరం.. సునామీ ధాటికి తన స్వరూపాన్నే కోల్పోయింది. ఇక్కడ నివసిస్తున్న వారిని సముద్రపు అలలు.. సుమారు 20 కిలోమీటర్ల వరకూ లాక్కు వెళ్లాయంటే.....

Monday, October 1, 2018 - 08:23

ఇండోనేషియా : వృత్తిధర్మం కోసం ప్రాణాలను పణంగా పెట్టేవారు అరుదుగా కనిపిస్తారు. ఇండోనేషియాకు చెందిన ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌.. వృత్తిధర్మం కోసం తన ప్రాణాలనే కోల్పోయాడు. చనిపోతావంటూ సహచరులు హెచ్చరించినా..తనకు అప్పగించిన పని పూర్తి చేసి ప్రాణ త్యాగం చేశాడు. ఇండోనేషియా ప్రజల దృష్టిలో హీరోగా మారిపోయాడు..ఆథనియస్‌ గునావన్‌. వయసు 21 ఏళ్లు. ఎయిర్‌ ట్రాఫిక్‌...

Sunday, September 30, 2018 - 19:30

చైనా : జీవితంలో మధురస్మృతిగా నిలిచిపోయే ముఖ్యమైన వాటిలో పెళ్లి ప్రత్యేకమైనది. తమ వెడ్డింగ్‌ డ్రెస్‌పైనే అందరి కళ్లు నిలిచిపోవాలని ప్రతి జంట కలలు కంటుంది. కొంత మంది కోట్లు పోసి ప్రత్యేకంగా డిజైన్‌ చేయించుకుంటారు. అయితే చైనాలోని లిలీతాన్‌ అనే  మహిళా రైతు ఇంట్లో ఉన్న 40 సిమెంట్‌ బస్తాలను తీసుకుని గౌన్‌ కుట్టుకుంది. కేవలం 3 గంటల్లో...

Sunday, September 30, 2018 - 16:49

ఢిల్లీ : మనిషికి బలహీనతలు వుండటం సహజమే.కానీ ఆ బలహీనతలో భాగంగా చేసిన తప్పును ఒప్పుకోవటంలో వున్న ఔన్నత్యం మాత్రం అందరికీ సాధ్యం కాదు. కానీ నిజం నిప్పులాంటిదంటారు. అది తప్పు చేసినవారిని నిలువునా దహించివేస్తుంది. కానీ చేసిన తప్పుని ఒప్పుకోవటమేకాదు..పశ్చాత్తాపం చెందిన ఓ వ్యక్తి చేసిని తప్పు దాదాపు శతాబ్దాల తరువాత కూడా బైటపడింది. ఇది నమ్మటానికి...

Sunday, September 30, 2018 - 08:40

ఇండోనేషియా : ప్రకృతి విపత్తులకు నిలయమైన ఇండోనేసియాను రాకాసి అలలు ముంచెత్తాయి. తీవ్రమైన భూకంపం, దాని పర్యవసానంగా వెంటనే సంభవించిన సునామీ పెను విషాదాన్ని నింపింది. సులవేసి దీవిలోని పాలూ నగరంలో  స్థానికులు బీచ్‌ ఫెస్టివల్‌ నిర్వహణలో తలమునకలయిన సమయంలో సునామీ ముంచెత్తింది. పాలూ నగరంలో భవనాలకు భవనాలే...

Sunday, September 30, 2018 - 07:21

ఢిల్లీ : ఫేస్‌బుక్‌ యూజర్లు వెంటనే తమ ఖాతాలను లాగ్‌ అవుట్‌ చేసి మళ్లీ రీ-లాగిన్‌ అవడం మంచిదని సైబర్‌, ఐటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దాదాపు 5కోట్ల ఖాతాలను యాక్సెస్‌ టోకెన్స్‌ను హ్యాకర్లు చోరీ చేసిన నేపథ్యంలో నిపుణులు ఈ సూచన చేస్తున్నారు. వీరి సూచనల ప్రకారం 'మొబైల్స్‌, ల్యాప్‌టాప్‌, డెస్క్‌టాప్‌ ఇలా...

Sunday, September 30, 2018 - 06:46

చైనా : జీవితంలో మధురస్మృతిగా నిలిచిపోయే ముఖ్యమైన వాటిలో పెళ్లి ప్రత్యేకమైనది. తమ వెడ్డింగ్‌ డ్రెస్‌పైనే అందరి కళ్లు నిలిచిపోవాలని ప్రతి జంట కలలు కంటుంది. కొంత మంది కోట్లు పోసి ప్రత్యేకంగా డిజైన్‌ చేయించుకుంటారు. అయితే చైనాలోని లిలీతాన్‌ అనే  మహిళా రైతు ఇంట్లో ఉన్న 40 సిమెంట్‌ బస్తాలను తీసుకుని గౌన్‌...

Friday, September 28, 2018 - 19:21

జకార్తా: పెద్దఎత్తున భూమి కంపించడంతో ఇండోనేషియా ప్రభుత్వం సునామీ హెచ్చరికను జారీచేసింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.5 గా నమోదైంది. భూకంపం ప్రభావంతో సముద్రంలో అలలు పెద్ద ఎత్తున లేచి దగ్గరలోని ప్రాంతాలను ముంచివేసినట్టు వార్తలు అందుతున్నాయి. సులవేసి అనే ప్రాంతంలో భూమి కంపించినట్టు సమాచారం. జులై, ఆగస్టు నెలల్లో లోమ్‌బక్...

Friday, September 28, 2018 - 17:26

జకార్త : మధ్య ఇండోనేషియాలో భారీ భూంకంపం సంభవించింది. శుక్రవారం ఓ ప్రాంతంలో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.7గా నమోదైంది. సులవేశి పట్టణంలోని ఓ ప్రాంతంలో భూంకంప తీవ్రత గుర్తించినట్లు, ఒకే రోజు రెండుసార్లు భూంకంప తీవ్రత వచ్చినట్లు యుఎస్ జియోలజికల్ సర్వే పేర్కొంది. ప్రస్తతం సంభవించిన ఈ భూంకంపం వల్ల ఎలాంటి ప్రమాదం...

Friday, September 28, 2018 - 15:45

ముంబయి: ఫేస్‌బుక్ తన అసలు బండారాన్ని బట్టబయలు చేసింది. మీ అకౌంట్ భధ్రత పేరుతో సేకరిస్తున్న ఫోన్ నెంబర్లు అసలు లక్ష్యం వేరే ఉందని ఇప్పుడు తెలుస్తోంది. ఈ నెంబర్లను తమ అడ్వర్‌టైజ్‌మెంట్లను ఎవరిని టార్గెట్ చేయాలో తెలుసుకొనేందుకే నంటూ అసలు విషయాన్ని చిన్నగా తెలియజేసింది ఫేస్‌బుక్.

‘‘మాకు వచ్చిన సమాచారాన్ని వ్యక్తిగత...

Friday, September 28, 2018 - 13:12

ఢిల్లీ : విమానం ప్రమాదాలు పైలట్ల తప్పిదాలతో కొన్ని జరుగుతుంటే పైలట్ల చాకచక్యంతో కూడా పలు సందర్భాలలో తప్పుతున్నాయి. ఇది ఆహ్వానించదగిన విషయమే. కానీ కొన్ని కొన్ని సందర్భాలలో విమాన ప్రమాదాలు పైలట్స్ తప్పిదమో లేక ప్రకృతి సహకరించలేదో గాని రన్‌వేపై ల్యాండ్‌ కావాల్సిన విమానం సముద్రంలోకి దూసుకుపోయింది....

Friday, September 28, 2018 - 11:30

ఢిల్లీ : వివాహేతర సంబంధం నేరం కాదని, ఈ అంశంలో స్త్రీస్వేచ్ఛకు సమాన హక్కు ఉందని,  బ్రిటీష్‌ కాలంలో పుట్టుకు వచ్చి 497 రాజ్యాంగ నిబంధన ఈ తరానికి అవసరం లేదంటూ భారత అత్యున్నత  న్యాయస్థానం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్ర మంత్రి ఉమాభారతి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోర్టు తీర్పు నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘యత్రనార్యంతు పూజ్యంతి తత్ర రమంతు దేవతా’...అన్న...

Thursday, September 27, 2018 - 19:22

జార్జియా :  ప్రేమకు కులం, మతం, ప్రాంతం, ఆస్తులు, అంతస్థులు వీటితో సంబంధం లేదు. భాషకు సంబంధం లేదు. భావంతో మనస్సులు కలుస్తాయ్. ప్రేమ అనేది ఎప్పుడు, ఎలా పుడుతుందో ఎవరూ చెప్పలేరు. అందుకేనేమో దేశాలతో సంబంధం లేకుండా ఖండాంతర వివాహలు జరుగుతుండటమే దానికి నిదర్శనం. ఒకరి భాష ఒకరికి అర్థం కాకపోయినప్పటికీ ప్రేమ జంటగా మారతారు. అటువంటి...

Thursday, September 27, 2018 - 18:35

ఢిల్లీ : యువతకు ఏది నచ్చితే అదే ట్రెండ్ అవుతుంది.వారు దేన్ని ఇష్టపడితే అదే మార్కెట్ లో సేల్స్ వర్షం కురుస్తుంది. ముఖ్యంగా యువత బైక్స్ అంటే ప్రాణం పెడతారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న బైక్ తయారీ కంపెనీలు యూత్ కి నచ్చే విధంగా తయారుచేస్తున్నారు. ఆకర్షించే లుక్..రయ్ మని దూసుకెళ్లే సత్తా..పక్కవారిని కూడా...

Wednesday, September 26, 2018 - 21:42

హైదరాబాద్‌ : విమానంలో చిన్నారి మృతి చెందాడు. శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతూ మరణించాడు. ఆర్నవ్‌ వర్మ అనే 11 నెలల బాబు తన తల్లిదండ్రులతో కలిసి ఖతార్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానం ఎస్‌ఆర్‌-500లో ఖతార్‌లోని దోహా నుంచి హైదరాబాద్‌ వస్తున్నాడు. అయితే విమానంలో ఉండగా అతనికి  ఊపిరి తీసుకోవడంలో సమస్య తలెత్తింది. దీంతో విమానం హైదరాబాద్‌లో ల్యాండ్‌ అవ్వగానే వెంటనే...

Wednesday, September 26, 2018 - 20:46

ఢిల్లీ : ప్రముఖ హాలీవుడ్‌ నటుడు విల్‌ స్మిత్‌ తన 50వ పుట్టిన రోజును అత్యంత సాహసోపేతంగా జరుపుకొన్నారు. ఆరిజోనాలోని గ్రాండ్‌ కేనియన్‌ పర్వత శ్రేణుల్లో అత్యంత ప్రమాదకరమైన రీతిలో బంగీ జంప్‌ చేశారు. సుమారు 550 అడుగుల ఎత్తులో హెలికాఫ్టర్‌ నుంచి పర్వతాల మధ్య కిందికి దూకారు. ఈ సాహస చర్య మొత్తాన్ని యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఆ సమయంలో అతని కుటుంబ సభ్యులంతా...

Wednesday, September 26, 2018 - 17:48

అస్సాం : కాజీరంగా నేషనల్ పార్క్ అస్సాంకే గర్వకారణంగా ఉంటుంది. ఇది అంతరించిపోతున్న ఇండియన్ ఒక కొమ్ము గల ఖడ్గమృగాలకు నిలయంగా ఉంది. సుమారు 429,93 sq కిలో మీటర్ల విస్తీర్ణం కలిగిన ఈ పార్క్ లో ఖడ్గమృగాల జోలికెళ్లితే కాల్చిపడేస్తారు. మన దేశంలో మాత్రమే కనిపించే ఈ ఖడ్గమృగాలు అధిక సంఖ్యలో కంజిరంగా పార్క్ లోనే వుంటాయి. కాగా ఖడ్గమృగాల కొమ్ము చాలా విలువైనదిగా...

Wednesday, September 26, 2018 - 15:05

దుబాయ్‌ : దుబాయ్‌లో ప్రపంచంలోనే ఖరీదైన పాదరక్షల జతను ఆవిష్కరించనున్నారు. పాదరక్షల జత అక్షరాలా రూ.123 కోట్లు. మేలిమి బంగారం, మేలుజాతి వజ్రాలతో పాదరక్షలు పొదిగివున్నాయి. జాదా దుబాయ్ ఆభరణాల సంస్థ ఈ పాదరక్షలను తీర్చి దిద్దింది.

 

Wednesday, September 26, 2018 - 13:35

ఢిల్లీ : కేంద్రం ప్రభుత్వం మెడకు రాఫెల్ ఉచ్చు రోజురోజుకు పెరుగుతోంది. ప్రతిపక్షాల ముప్పేట దాడికి కేంద్రం ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రాఫెల్‌ యుద్ధవిమానాల కొనుగోలు అంశంపై కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ రాహుల్‌గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తన మాటల దాడిని ఉదృతం చేశారు. దేశానికి సేవలందించే సైనికులారా అమర వీరుల కుటుంబాల్లారా, హాల్‌ సంస్థ ప్రతినిధులారా...బీజేపీ...

Wednesday, September 26, 2018 - 11:57

జమ్ము కశ్మీర్ : అందాల కశ్మీరం మరోసారి హెచ్చరికల నిఘాలోకి వెళ్లిపోయిందా? పోలీసుల విధులకు అడ్డుతగులతు..ఉగ్రవాదులు పోలీసులపై బెదిరింపులకు పాల్పడతున్నారు. తమ హెచ్చరికలు ఖాతరు చేయకుంటే  ఖతం చేస్తాం..ఉద్యోగాలకు రాజీనామా చేసి, ఇంటికి పరిమితం కాకుంటే మరణం తప్పదంటూ హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు ట్వీట్ చేసిన తరువాత, నాలుగు రోజుల వ్యవధిలో 40 మంది పోలీసులు రిజైన్ చేసినట్టు...

Tuesday, September 25, 2018 - 13:25

ఢిల్లీ : రక్షణశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ఆత్మరక్షణలో పడ్డారు.  రఫెల్ విమానాల విషయంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. విపక్షాలు ముప్పేట దాడి చేయటంతో కేంద్రం మల్లగుల్లాలు పడుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఆత్మరక్షణలో పడిపోయారు. రాఫెల్ ఒప్పందంపై మీడియా ప్రశ్నలకు కూడా ఆమె సమాధానాలు చెప్పలేకపోతున్నారు. నిన్న మీడియా ప్రతినిధులతో...

Tuesday, September 25, 2018 - 12:37

ముంబై : గత కొంతకాలం నుండి పెట్రోల్ ధరలపై తీవ్రంగా చర్చలు, నిరసనలు, ఆగ్రహాలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యుడు ఏ వస్తువు కొనాలన్నా.. ఆ ప్రభావం పెట్రోల్ ధరలకు సంబంధం వుంటుంది. ఆ భారం మోయాల్సింది సామాన్యుడే. పెరుగుతున్న పెట్రోల్ ధరలు కనీసం ఏడాదికి ఒకసారి వచ్చే దీపావళి పండుగకు రూ.100లకు పెరగనుంది. ఇప్పటికే వాహనదారులు పలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ వార్త...

Tuesday, September 25, 2018 - 11:57

ఢిల్లీ : పాకిస్థాన్‌ను ఇటీవల వదరలు అతలాకుతలం చేశాయి. ఈ వరదలకు కారణ భారతదేశమేనని ఓ పత్రిక ఆరోపణలు చేసింది. భారత్ కు దాయాది దేశమైప పాక్ తరచు భారత్ పై ఏదోక ఆరోపణలు చేస్తునే వంది. ఈ నేపథ్యలో పాకిస్థాన్‌కు ఎగువన వున్న రిర్వాయర్‌ల నుండి ఒక్కసారిగా నీటిని వదలడం ద్వారా భారత్ ప్రతీకార చర్యలకు దిగుతోందని, దీని ఫలితంగా చాలా గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయని పాకిస్థాన్ కేంద్రంగా...

Tuesday, September 25, 2018 - 09:10

అమెరికా : ఐక్యరాజ్య సమితిలో ఏపీ సీఎం చంద్రబాబు ‘సుస్థిర సేద్యానికి ఆర్థిక చేయూత: అంతర్జాతీయ సవాళ్లు-అవకాశాలు’ అనే అంశంపై  ప్రసంగించారు. అనంతరం ఈ సమావేశవంలో పాల్గొన్న అంతర్జాతీయ సంస్థలు ఏపీలోని ప్రకృతి వ్యవసాయంపై ప్రశంసలు కురిపించాయి. 30 దేశాల్లో వ్యవసాయ-అటవీ రంగంలో పరిశోధనలు చేస్తున్న తమ సంస్థ ..ఏపీలో జరుగుతున్న సేంద్రీయ సేద్యాన్ని ఆసక్తికరంగా...

Tuesday, September 25, 2018 - 07:46

అమెరికా  : ఐక్యరాజ్య సమితిలో మాట్లాడే అరుదైన అవకాశం దక్కించుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. కొద్దిసేపటి క్రితం ప్రసంగాన్ని తెలుగులోనే ప్రారంభించారు. ఐక్యరాజ్య సమితిలో పాల్గొనే అరుదైన అవకాశం దక్కటం అదృష్టంగా భావిస్తున్నానని చంద్రబాబు తెలిపారు. ప్రపంచ ఆర్థిక వేదిక, బ్లూంబర్గ్ గ్లోబల్ బిజినెస్ ఫోరం ఆధ్వర్యంలో ‘సుస్థిర సేద్యానికి ఆర్థిక చేయూత: అంతర్జాతీయ...

Pages

Don't Miss