International News

Thursday, September 24, 2015 - 10:40

సైప్రస్‌ : ఇద్దరు జర్మనీ మహిళలు విమానాశ్రయాన్నే తమ ఆశ్రయంగా మలుచుకొని ఏకంగా 15నెలలుగా నిరీక్షిస్తున్నారు. ఈ విషయం కాస్త ఆశ్చర్యమనిపించినా ముమ్మాటికి నిజం. వీసాపై ఇజ్రాయిల్‌లో నివసించిన తల్లీ కూతుళ్లకు అనుకోని అవాంతరం ఎదురైంది. వారి వీసా గడువు ముగియడంతో ఇజ్రాయిల్‌ ప్రభుత్వం వెనక్కి పంపింది....

Thursday, September 24, 2015 - 10:38

ప్రపంచంలోనే భారీ లగ్జరీషిప్‌గా రికార్డు
మాస్కో: బడా బిజినెస్‌మెన్లు తమ స్థోమతను చాటుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. భారీగా డబ్బులు ఖర్చు చేస్తూ బంగ్లాలు..స్థలాలు..విమానాలు..ఇలా ఎవో కొంటుంటారు. తాజాగా ఓ బిజినెస్ ప్రపచంలోనే అత్యంత ఖరీదైన లగ్జరీ 'నౌక'ను సొంతం చేసుకున్నాడు....

Wednesday, September 23, 2015 - 19:40

ఢిల్లీ : చేసింది తప్పని తెలుసు. సరిదిద్దుకుంటే సరిపోతుందని కూడా తెలుసు. కానీ అలా చేయలేదు. తప్పును ఒప్పును చేయాలనుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని తప్పుకు కవరింగ్‌ ఇచ్చే ప్రయత్నం చేసారు. కానీ తల తన్నే వాడొకడుంటే తాడి తన్నేవాడొకడుంటానే నిజం తెలుసుకోలేక అంతర్జాతీయ స్ధాయిలో బొక్క బోర్లా పడ్డారు. ఎక్కడ తల ఎత్తుకు తిరిగారో అక్కడే తలదించుకునే...

Tuesday, September 22, 2015 - 10:10

గ్రహశకలాన్ని (ఉల్క) రోదసిలోనే ముక్కలు చేసే షాట్‌గన్‌ను రూపొందించే కార్యక్రమాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా చేపట్టింది. భూమికి సమీపం గా రోదసిలో ప్రయాణించే గ్రహశకలంలోని కొద్ది భాగాన్ని ముక్కలు చేసి వాటిలో కొన్నింటిని భూమికి చేర్చి పరిశోధించాలనేది నాసా ప్రణాళిక. 'హానీబీ రోబోటిక్స్' అనే సంస్థతో కలిసి ఆస్టరాయిడ్‌ రీ డైరెక్ట్ మిషన్‌ (ఏఆర్‌ఎం) పేరుతో నాసా ఈ ప్రాజెక్ట్...

Saturday, September 19, 2015 - 10:31

చిన్న పిల్లలు ఖాళీ సమయం దొరికితే ఏం చేస్తారు ? ఆ ఏం చేస్తారు..బొమ్మలతో ఆడుకుంటూ ఉంటారు..లేదా టీవీల్లో వచ్చే పోగో, కార్టూన్స్ సీరియల్స్ చూస్తే సమయాన్ని గడిపేస్తుంటారు అని అంటారు కదా. కానీ కొంతమంది చిన్నారులు మాత్రం తమ ప్రతిభను చాటుతుంటారు. రేండేళ్ల వయస్సున్న చిన్నారి మాత్రం ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ కొట్టేశాడు. ఇరాన్ లోని బబోల్ టౌన్ లో 'ఆరాత్ హోస్సైనీ' అనే చిన్నారి ఉంటున్నాడు...

Sunday, September 13, 2015 - 08:14

వాషింగ్టన్ : మన షూ సైజు ఎంతుంటుంది. ఇదేం ప్రశ్న ? మన పాదం సైజు ఎంతుంటుందో అంత ఉంటుందని అంటారు అంతేనా ? పాదం సైజు ఎంతుంటుంది అంటే ? ఆ ఆరు లేదా ఎనిమిది ఇంకా అంటే తొమ్మిది అంటారు కదా. కానీ ఒకతని షూ సైజ్ మాత్రం 26. ఆశ్చర్యపోతున్నారు కదా..అవును ఇది నిజం.
ప్రపంచంలోనే అతి పెద్ద 'పాదాలు' కలిగిన వ్యక్తిగా 'జెసన్ ఆర్లాన్డో' రికార్డు సృష్టించాడు. ఏకంగా గిన్నిస్...

Wednesday, September 9, 2015 - 16:29

వాహనాలు వేటితో నడుస్తాయి? గిదేం ప్రశ్న..పెట్రోల్ లేదా డీజిల్ లేదా గ్యాస్ లతో నడుస్తాయి అని అంటారు కదా. ఇందులో వింతేముంది ? అని అనుకుంటున్నారా ? కానీ 'విస్కీ'తో వాహనాలు నడుస్తాయంట తెలుసా ?. ఔనండీ మీరు చదువుతున్నది నిజమే. సాంప్రదాయ ఇంధన వాడకాన్ని తగ్గించేందుకు స్కాట్లాండ్ కు చెందిన శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ కు బదులు విస్కీ తో కార్లు నడిచే దిశగా...

Wednesday, September 9, 2015 - 15:59

ప్ర‌పంచాన్ని క‌న్నీటి సంద్రంలోకి నెట్టిన చిన్నారి అయిల‌న్ కుర్దీ ఘ‌ట‌నను బాహ్య ప్ర‌పంచానికి తెలిసేలా ఓ మ‌హిళా జ‌ర్న‌లిస్టు పనిచేస్తే....మరో వీడియో జ‌ర్నలిస్టు పెట్రాలాజ్లో మాత్రం ఛీ కొట్టించుకునే ప‌నిచేసింది. సోషల్ మీడియాలో ఈ వీడియో హల్ చల్ చేస్తోంది.
స‌మాజంలో ఉన్న‌త‌మైన విలువ క‌ల్గిన జ‌ర్నలిస్టు వృత్తిలో ఉండి.. అప‌హాస్యానికి ఒడిగ‌ట్టింది. సిరియాలో జ‌రుగుతున్న అంత‌ర్గ...

Tuesday, September 8, 2015 - 16:33

వీడియో గేమ్..చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఈ గేమ్ లను ఆడుతుంటారు. సెల్ ఫోన్ లో కూడా గేమ్స్ ను డౌన్ లౌడ్ చేసుకుంటుంటారు. తీరికగా ఉన్న సమయంలో కొంతమంది వీటిని ఆడుతూ టైం పాస్ చేస్తుంటారు. మరికొంతమంది అయితే అదే పనిగా ఆడుతుంటారు. ఇలా ఆడుతున్న వారికి ఒక హెచ్చరిక. అవును. ఓ వ్యక్తి వీడియో గేమ్ ఆడి ప్రాణాలు కోల్పోయాడు. ఒకటి, రెండు కాదు ఏకంగా 22 రోజుల పాటు ఏకధాటిగా వీడియో గేమ్ ఆడి...

Monday, September 7, 2015 - 12:22

ఢిల్లీ : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను ఏ క్షణంలోనైనా మట్టుబెట్టడం ఖాయమని కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ సంచలన ప్రకటన చేశారు. ఓ జాతీయ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు వ్యాఖ్యలు చేశారు. 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ను నిర్వీర్యం చేసేందుకు కోవర్ట్ ఆపరేషన్ లేదా స్పెషల్ ఆపరేషన్ నిర్వహిస్తామని వెల్లడించారు. కోవర్టు...

Saturday, September 5, 2015 - 09:20

ఢిల్లీ : బెంగళూరు, ఢిల్లీ విమానాశ్రయాల్లో సీఐఎస్ఎఫ్ బలగలు, తనిఖీలు చేపట్టాయి. ఆరు విమానాల్లో బాంబులు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రతా బలగాలు సోదాలు కొనసాగించాయి. ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని కాలర్ ఐడీ ద్వారా ట్రేస్ చేసి పట్టుకున్నారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నట్లు సమాచారం. ఒక్కసారిగా బాంబు బెదిరింపులు...

Saturday, September 5, 2015 - 08:57

సిరియా : ఈ ఫొటో చూడండి. ఎంత ముద్దుగా ఉన్నాడు..హాయిగా బీచ్ లో పడుకున్నాడు అని అనుకుంటున్నారా ? కాదు. అతను విగతజీవి. అవును ఈ చిన్నారికి అప్పుడే నూరేళ్లు నిండాయి. ఈ ఫొటో సోషల్ మీడియాలో ప్రత్యక్ష మైంది. ఎంతో మందిని కదిలించింది. ఈ చిన్నారి ఫొటో చూసి ఎంతో మంది కంటతడి పెట్టారు.

రోదించిన ప్రపంచం..
సిరియా బాలుడు అయలాన్‌ కుర్దీ విషాద మరణం చూసి ప్రపంచమే...

Friday, September 4, 2015 - 13:42

తెలుగు వారు పలు రాణిస్తూ పలు దేశాల్లో ఉన్నత పదవులను చేజిక్కించుకుంటున్నారు. మైక్రో సాఫ్ట్ సీఈవో గా అనంతపురం జిల్లాకు చెందిన సత్య నాదెళ్ల ఎంపికై ఓ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సోషల్ మీడియాలో మరో వార్త సంచలనం సృష్టిస్తోంది. కీలకమైన ట్వీట్టర్ సీఈవో గా తెలుగు అమ్మాయి పేరు పరిశీలనకు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. విజయవాడకు చెందిన పద్మశ్రీ వారియర్ అని తెలుస్తోంది....

Wednesday, August 26, 2015 - 13:08

సెల్‌ఫోన్‌.. ఇది లేకపోతే ఏదో వెలితి ఉన్నట్లు చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది. అంతలా జీవితంలో ఓ భాగమై పోయింది. వివిధ కంపెనీలు మార్కెట్ లో రోజుకో కొత్త రకం సెల్ ఫోన్ లు విడుదల చేస్తూ వినియోగదారులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తుంటారు. కానీ సెల్ ఫోన్ ఎలక్ట్రానిక్ పరికరంపై బ్యాక్టీరియా తయారవుతోందని గత పరిశోధనల్లో వెల్లడైంది. మరి ఈ బ్యాక్టీరియాను నిర్మూలించడానికి ఒక కొత్త పరికరాన్ని...

Thursday, August 20, 2015 - 14:07

న్యూయార్క్ : ప్రపంచంలో టెక్నాలజీ దూసుకపోతోంది. రోజుకో కొత్త కొత్త సాఫ్ట్ వేర్ లు ప్రవేశిస్తున్నాయి. న్యూస్ సైట్ల రద్దీపై పర్సాడాట్ లీ అనే సంస్థ అధ్యయనం చేసింది. అందులో గూగుల్ ను ఫేస్ బుక్ అధిగమించినట్లు తేలింది. ఫేస్ బుక్, ట్విట్టర్ లో షేర్ చేసిన లింక్ లు ఇంటర్ నెట్ వినియోగదారులకు వార్తల కోసం ప్రధాన వనరుగా మారాయని సంస్థ తెలిపింది. ఇక మీడియా సైట్లకు...

Thursday, August 20, 2015 - 13:40

ఈ రోజు ప్రపంచ 'దోమల' దినం. కొన్ని సంవత్సరాల క్రితం సర్ 'రోనాల్డ్ రాస్' అనే బ్రిటీష్ ఆర్మీ డాక్టర్ మలేరియా దోమ కాటు వల్ల వస్తుందని కనుక్కొన్నాడు. రోనాల్డ్ రాస్ అనే శాస్త్రవేత్త మలేరియా వ్యాధి దోమల ద్వారా ప్రబలుతున్నట్లు తొలిసారిగా మన హైద్రాబాద్ లోనే గుర్తించి ప్రపంచానికి చాటిచెప్పాడు. 1897 ఆగస్టు 20న ఆడ ఎనాఫిలిస్ దోమ వల్ల మలేరియా వ్యాధి మానవులకు వస్తుందని సర్ రోనాల్డ్ రాస్...

Thursday, August 20, 2015 - 13:07

అమెరికా : కూతురుని నిర్లక్ష్యం చేస్తున్న ఓ భర్తకు బుద్ధి చెప్పాలని ఓ తల్లి తన ముగ్గురు కుమారులను కడతేర్చింది. అమెరికలోని ఓహియో నగరానికి చెందిన జోసెఫ్, బ్రిట్నీ దంపతులకు నలుగురు పిల్లలున్నారు. వారిలో ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. కానీ కొడుకులపైనే జోసెఫ్ ప్రేమ చూపిస్తున్నాడని, కూతురుని పట్టించుకోవడం మానేశాడని బ్రిట్నీ భావించింది. ఆవేశంలో కన్నతీపిని కూడా...

Thursday, August 20, 2015 - 12:54

అమెరికా : పెంపుడు జంతువులంటే కొంతమందికి ఇష్టం. వాటిని చాలా మంది పెంచుకుంటూ ప్రేమగా చూసుకుంటుంటారు. వారికి ఏమన్నా అయితే చలించిపోతారు. కొంతమంది పెంచుకున్న జంతువుల ప్రాణాలు పోతే ఏకంగా సమాధిలే కట్టిస్తుంటారు. కానీ ఓ దంపతులు మాత్రం తమ పెంపుడు పిల్లికి అనారోగ్యం వస్తే ఏకంగా రూ.19 లక్షలు ఖర్చు చేశారు. అవును నిజం.
అమెరికాలో ఉన్న గాన్సియర్ దంపతులు ఓ పిల్లి (...

Tuesday, August 18, 2015 - 12:59

శ్రీలంక : పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా పోటీచేసిన మహీంద్రా రాజపక్సే ఆశలు గల్లంతయ్యాయి. అధ్యక్ష పదవి ఎన్నికల్లో ఓడిన రాజపక్సే ప్రధాని ఎన్నికల్లోను ఓటమి పాలయ్యారు. తన ఓటమిని అంగీకరించని రాజపక్సే.. యునైటెడ్ నేషనల్ ఫ్రీడం అలయన్స్ పార్టీ ఓడిపోవడం బాధకరంగా ఉందన్నారు. 225 స్థానాలున్న లంక పార్లమెంటు ఎన్నికల ఫలితాలు ఇవాళ పూర్తిస్థాయిలో వెలువడనున్నాయి.

Sunday, August 16, 2015 - 13:34

అమెరికా : ప్రకాశం జిల్లాకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న బాలసుందర్‌ అమెరికాలో దుర్మరణం చెందాడు. టెక్సాస్‌లో ఎంఎస్ చేస్తున్నాడు. స్విమ్మింగ్‌పూల్‌లో ఈత కొట్టడానికి వెళ్లి మృతి చెందాడు. దీంతో చీరాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాలసుందర్ మృతిపట్ల స్థానికులు విచారం వ్యక్తం చేశారు.

 

Saturday, August 15, 2015 - 12:11

వాకింగ్ కారు ఏంటీ అని ఆశ్చర్యపోతున్నారా ? అది కూడా ఓ బ్యాగులో పెట్టుకోవడమా ? వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదా ? కానీ నిజం చేశాడో ఇంజినీర్. ఇక్కడ ఇంజినీర్లు కాదు. జపాన్ దేశానికి చెందిన ఇంజినీర్ కునియాకో ఈ 'వాక్ కారు'ను తయారు చేశాడు. బ్యాగులో ఈ కారును పెట్టుకుని మీకు ఎక్కడ కావాలంటే అక్కడ కారును కిందకు దింపి దానిపై నిలబడితే చాలు. రయ్యిమంటూ దూసుకెళుతుంది. ఏ రూట్లో వెళ్లాలని...

Saturday, August 15, 2015 - 11:55

కాలిఫోర్నియా : రిజర్వాయర్ లో ఉండే నీరు ఆవిరి కాకుండా ఉండేందుకు ఏం చేయాలి ? దేశంలో..ప్రపంచంలో ఉండే రిజర్వాయర్ లో ఉన్న నీరు ఆవిరై పోవడం వల్ల ఎన్నో లక్షల గ్యాలన్ల నీరు వృధాగా పోతోంది. ఇందుకు లాస్ ఏంజెల్స్ అధికారులు ఈ సమస్యకు చెక్ పెట్టారు. ఇందుకు 'షేడ్ బాల్స్ తయారు చేశారు. ఈ నల్లరంగు బాల్స్ లను రిజర్వాయర్ లో వేయడం వల్ల నీరు ఆవిరై పోదంట. నాణ్యమైన 9 కోట్ల 60...

Monday, August 10, 2015 - 13:27

న్యూఢిల్లీ : అంతరిక్ష పరిశోధనలతో దూసుకుపోతున్న నాసా ఓ అద్బుత కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రష్యాకు చెందిన ఇద్దరు వ్యోమగాములతో అంతరిక్షంలో వాక్ చేయించడానికి రెడీ అయింది. సుమారు ఆరు గంటల పాటు వాక్ చేయనున్నారు. ఎక్స్పెడిషన్ 44 కమాండర్ గెన్నడీ పడల్కా, ఫ్లైట్ ఇంజనీర్ మైకెల్ లు సోమవారం రాత్రి 7.44 నుంచి స్పేస్ వాక్ చేయనున్నారు. ప్రపంచం మొత్తం వీక్షించడానికి...

Monday, August 3, 2015 - 08:51

చైనా : దోమల నుండి రక్షించుకోవడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. కానీ చైనా దేశం మాత్రం ఏకంగా దోమల ఫ్యాక్టరీనే పెట్టబోతుందంట. ఏంటీ దోమల వల్ల ఎన్నో రోగాలు వస్తుంటాయి. అలాంటి ఫ్యాక్టరీ పెట్టి దోమలను ఉత్పత్తి చేయడమా ?అని ఆశ్చర్యపోతున్నారా !. కానీ వారు ఎందుకు ఇలా చేస్తున్నారో తెలుసుకోవాలంటే ఇది చదవండి..
చైనాలో డెంగ్యూ వ్యాధి తీవ్రంగా ఉంది. దీనిని...

Thursday, July 30, 2015 - 18:04

ఖమ్మం: జిల్లాలోని కొత్తగూడెంలో కొందరు మున్సిపల్ కార్మికులు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. మున్సిపల్ భవనం ఎక్కి.. దూకుతామంటూ హడావుడి చేశారు. 'సీఎం కేసీఆర్ డౌన్ డౌన్' అంటూ నినాదాలు చేశారు. నెలరోజులుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని కార్మికులు మండిపడ్డారు. అధికారులు హామీ ఇచ్చేవరకూ భవనం దిగేదిలేదని హెచ్చరించారు. అంతకుముందు చెత్త ఊడ్చేందుకు...

Wednesday, July 29, 2015 - 10:49

ఢిల్లీ : సాంకేతికరంగంలో మరో విప్లవాత్మకమైన మార్పు చోటు చేసుకుంది. స్మార్ట్ ఫోన్, టాబ్లెట్ బాట పట్టిన కొత్త తరానికి మైక్రో సాప్ట్ సరికొత్త సాఫ్ట్ వేర్ ను ప్రవేశ పెట్టింది. మార్కెట్ లో సరికొత్త సాఫ్ట్ వేర్ 'విండోస్ -10'ను విడుదల చేసింది. ఫోన్లు, గేమ్స్, హాలో గ్రాఫిక్, హెడ్ సెట్టింగ్ లలో వినియోగించేలా విండోస్ 10ను రూపొందించారు. విండోస్ 10 అప్ గ్రేడ్ కోసం నమోదు...

Monday, July 27, 2015 - 10:14

పంజాబ్ : రాష్ట్రంలోని గురుదాస్ పూర్ జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు ఎనిమిది మంది దుర్మరణం చెందారు. వీరిలో ఆరుగురు సాధారణ పౌరులు ఉండగా ఇద్దరు పోలీసులున్నారు. మొత్తం పదిహేను మంది ఉగ్రవాదులు ఈ దాడిలో పాల్గొన్నట్లు సమాచారం. సమాచారం తెలుసుకున్న కేంద్ర హోం శాఖ అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. పీఎంఓ కార్యాలయం...

Pages

Don't Miss