International News

Friday, August 24, 2018 - 18:20

కేరళ : వరదలతో అతలాకుతలమైన కేరళకు యూఏఈ 700 కోట్ల సహాయంపై చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో భారత్‌లో ఆ దేశ రాయబారి అహమద్‌ అలబానా స్పందించారు. ఇప్పటివరకు అధికారికంగా ఎన్ని కోట్లు ఇవ్వాలన్నది ఇంకా ఖరారు కాలేదని చెప్పారు. దీనిపై తమ ప్రభుత్వం అంచనా వేస్తోందని అలబానా పేర్కొన్నారు. విదేశీ ప్రభుత్వాల నుంచి ఆర్థిక సహకారాన్ని తీసుకునేది లేదని భారత...

Wednesday, August 22, 2018 - 17:07

ఢిల్లీ : ఏషియన్‌ గేమ్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు రికార్డ్‌ సృష్టించింది. ఇవాళ జరిగిన పూల్‌ మ్యాచ్‌లో హాంగ్‌కాంగ్‌ను 26-0 తేడాతో భారత్‌ ఓడించింది. ఈ మ్యాచ్‌ నలుగురు భారత క్రీడాకారులు హ్యాట్రిక్స్‌ గోల్స్‌ చేశారు. ఈ భారీ విజయం ద్వారా భారత్‌ ఒలెంపిక్స్‌ గేమ్స్‌లో స్థాపించిన 86 ఏళ్ల రికార్డ్‌ను బద్దలు కొట్టింది. 1932 ఒలెంపిక్స్‌ గేమ్స్‌లో...

Wednesday, August 22, 2018 - 16:57

ఢిల్లీ : ఆసియాడ్‌లో భారత్‌ బుధవారం మరో స్వర్ణ పతకం ఖాతాలో వేసుకుంది. మహిళల 25 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌లో షూటర్‌ రహీ జీవన్‌ సర్నోబత్‌ పసిడిని గురిచూసి కొట్టింది. ఈ పోరు ఆద్యంతం ఉత్కంఠకరంగా జరగడం గమనార్హం. బంగారాన్ని ముద్దాడేందుకు రహీ రెండు సార్లు షూటాఫ్‌‌లో పోటీ పడటం విశేషం. థాయ్‌ షూటర్‌ యంగ్‌పైబూన్‌, కొరియా అమ్మాయి కిమ్‌ మిన్‌జుంగ్‌ రజత,...

Wednesday, August 22, 2018 - 16:53

ఢిల్లీ : ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో 203 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది. చివరిరోజు 2.5 ఓవర్లు ఆడిన ఇంగ్లండ్‌ 317 పరుగుల వద్ద చివరి వికెట్‌ కోల్పోయింది. 9 వికెట్లకు 311 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లండ్‌.. మరో ఆరు పరుగులు మాత్రమే చేసింది. 11 పరుగులు చేసిన అండర్సన్‌... అశ్విన్‌ బౌలింగ్‌ ఔటయ్యాడు...

Tuesday, August 21, 2018 - 17:09

కేరళ : భారీ వర్షాలతో అతలాకుతలమైన కేరళకు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ఆపన్న హస్తం అందించింది. రాష్ట్రాన్ని ఆదుకునేందుకు 700 కోట్ల భారీ ఆర్థిక సహాయాన్ని ప్రకటించినట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ వెల్లడించారు. అబుదాబి యువరాజు ప్రధాని మోదితో ఫోన్లో మాట్లాడి ఈ విషయం చెప్పారని సిఎం తెలిపారు. కేరళకు అండగా నిలుస్తున్న ఆయా దేశాలు, రాష్ట్రాలకు...

Monday, August 20, 2018 - 17:43

పాకిస్థాన్ : ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్‌కు ప్రధాని నరేంద్రమోదీ లేఖ రాసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ లేఖలో ఇరుదేశాల చర్చలకు సంబంధించి మోది ప్రస్తావించలేదు. పొరుగు దేశాలతో మంచి సంబంధాలనే కోరుకుంటామని మోది లేఖలో తెలిపారు. ఇమ్రాన్‌ఖాన్‌కు మోదీ లేఖ రాసినట్లు పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ఎమ్ ఖురేషి...

Monday, August 20, 2018 - 17:42

ఢిల్లీ : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కుంభకోణంలో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోది ఆచూకి లభించింది. అతను బ్రిటన్‌లో ఉన్నట్లు సిబిఐ అధికారులు ధృవీకరించారు. నీరవ్‌ మోదిని తమకు అప్పగించాలని హోంమంత్రిత్వ శాఖకు సిబిఐ విజ్ఞప్తి చేసింది. నీరవ్‌ మోదిని స్వదేశానికి రప్పించేందుకు విదేశాంగ శాఖ సహకారంతో తన ప్రతినిధులను బ్రిటన్‌కు పంపనుంది....

Sunday, August 19, 2018 - 10:12

ఢిల్లీ : ఎప్పటి నుండో చిక్కకుండా ఉంటున్న అండర్ వరల్ డాన్..దావూద్ ఇబ్రహిం భారత్ కు రప్పించేందుకు యత్నాలు జరుగుతున్నాయా ? అంటే అవుననే అనిపిస్తోంది. ఎందుకంటే దావూద్ కు కీలక అనుచరుడు, ఆర్థిక మేనేజర్ జబిన్ మోతీని లండన్ పోలీసులు అరెస్టు చేశారు. విల్సన్ హోటల్ లో ఉన్న జబీర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దావూద్ కు ఆర్థిక మేనేజర్ గా ఉంటున్న జబీర్ ఆర్థిక...

Saturday, August 18, 2018 - 20:40

ఢిల్లీ : ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ జనరల్‌, నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత కోఫీ అన్నన్‌ కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా కోఫీ అన్నన్‌ మృతిచెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. చివరి రోజుల్లో భార్యతో పాటు ముగ్గురు పిల్లలు ఆయనతోనే ఉన్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఉదయం అస్వస్థతకు గురైన కోఫి అన్నన్‌ను స్విట్జర్లాండ్‌లోని బెర్న్‌లో ఓ ఆస్పత్రికి తరలించగా,...

Thursday, August 16, 2018 - 12:49

సచిన్ టెండూల్కర్ ప్రపంచ క్రికెటర్ దిగ్గజాల్లో ఒకరు. కేవలం 16 సంవత్సరాల వయస్సులోనే క్రికెట్ లో అడుగు పెట్టి సెంచరీల రారాజుగా పేరు తెచ్చుకుని మాస్టర్ బ్లాస్టర్ గా పేరొందాడు. ఇప్పుడు ఆయన కుమారుడు అర్జున్ కూడా క్రికెట్ లో రాణిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రపంచ క్రికెట్ మక్కాగా పేరొందిన లార్డ్స్ లో 18 సంవత్సరాల అర్జున్ టెండూల్కర్ హల్ చల్ చేశాడు. ఎంసీసీ యంగ్...

Tuesday, August 14, 2018 - 13:42

ముంబై : డాలర్ తో రూపాయి మారకపు విలువ ఆల్ టైమ్ కనిష్ఠాన్ని నమోదు చేసింది. చరిత్రలో తొలిసారిగా ఒక డాలర్ మారకపు విలువ రూ. 70.08ను తాకింది. టర్కీలో ఆర్థిక సంక్షోభంతో డాలర్ కు డిమాండ్ పెరుగగా, ఆ ప్రభావం రూపాయిపై పడిందని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. క్రితం ముగింపుతో పోలిస్తే, ఈ ఉదయం ఫారెక్స్ మార్కెట్ లో 69.85 వద్ద ప్రారంభమైన రూపాయి విలువ, ఆపై...

Tuesday, August 14, 2018 - 09:58

సూర్యుడిపై మిస్టరీలను ఛేదించేందుకు నాసా ప్రయోగించిన పార్కర్ సోలార్ ప్రోబ్ నింగికెగిసింది. షెడ్యూల్ ప్రకారం ఈ ప్రయోగం ఒకరోజు ముందే జరగాల్సి ఉన్నప్పటికీ…చివరి నిమిషంలో వాయిదా పడింది. లక్ష కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన పార్కర్ సోలార్ ప్రోబ్ ప్రయోగాన్ని ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి చేపట్టారు. డెల్టా -4 హెవీ రాకెట్‌ ద్వారా అంతరిక్షంలోకి పార్కర్‌ చేరుకుంటుంది. కానీ...

Saturday, August 11, 2018 - 19:14

ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌ తెహ్రీక్‌-ఎ-ఇన్సాఫ్ చీఫ్‌ ఇమ్రాన్‌ఖాన్‌ ప్రధానమంత్రిగా ఆగస్టు 18న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 14న ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా 18కి వాయిదా పడింది. ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆహ్వానితుల జాబితాలో కొంత మార్పు చేశారు. భారత్‌కు చెందిన మాజీ క్రికెటర్లు కపిల్‌ దేవ్‌, సునీల్‌ గవాస్కర్, నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూలకు మాత్రమే ఇమ్రాన్‌...

Friday, August 10, 2018 - 13:14

కారులో షికారుకు వెళ్లటం హయిగానే వుంటుంది. కానీ కొన్ని కార్లు నడిపేవాళ్లను టెంప్ట్ చేస్తాయి. జోరుగా వెళ్లమని ప్రోత్సహిస్తాయి. ఎందుకంటే ఆ కార్ల డిజైన్ అలా వుంటుంది. లగ్జరీ కార్ల తయారీ అలా వుంటుంది. ఇక ఆ కార్లకు విశాలమైన రోడ్డు వుంటే మరింతగా దూసుకుపోవాలనిపిస్తుంది. కానీ మనం నడిపే కారు ఎక్కడ తయారైనా..ఆ కార్లు నడిపే రోడ్లు..ఆరోడ్లపై మనం నడిపే కారు ఏ దేశంలో వుంది? అక్కడ వుండే...

Friday, August 10, 2018 - 12:23

రుచికరమైనది..సురక్షితమైనది..పోషకాల ఘనిగా వుండేది..అరచేతిలో ఇమిడిపోయేంత బుజ్జి ఆకారంలో వుండేది..చటుక్కున వండుకునేవీలుండేది..ముఖ్యంగా అన్ని కాలాల్లోనూ అతి తక్కువ ధరకే దొరికేది..అన్ని వయసుల వారు మెచ్చేది.. ఒకే ఒక్కటి..అదే అనండీ..గుడ్డు..మరి ముఖ్యంగా నాన్ వెజ్ తినని వారు కూడా తినగలిగేది గుడ్డు?? రుచిని..ఆరోగ్యాన్ని కూడా సమపాళ్లలో అందించే గుడ్డు రోజుకొకటి తింటే గుండె జబ్బులు...

Friday, August 3, 2018 - 07:07

ఢిల్లీ : పాకిస్తాన్‌ ప్రధానమంత్రిగా ఇమ్రాన్‌ఖాన్‌ ప్రమాణస్వీకారం కార్యక్రమానికి విదేశీ నేతలను ఆహ్వానించడం లేదని పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ కార్యక్రమానికి ఇమ్రాన్‌కు అత్యంత సన్నిహత స్నేహితులైన విదేశీ వ్యక్తులను కొందరిని మాత్రమే ఆహ్వానించినట్లు తెలిపింది. పాకిస్థాన్ ప్రధాన మంత్రిగా మాజీ క్రికెటర్, 65 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్ ఆగస్టు 11న...

Wednesday, August 1, 2018 - 13:28

ఢిల్లీ : బ్రిటిష్ పాలనకు మునుపు భారతదేశం చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేదని, బ్రిటిష్ పాలన తరువాత భారతదేశం చిన్న చిన్న రాజ్యాలన్నింటిని కలుపుకుని ఒక పరిపూర్ణ అఖండ భారతదేశంగా రూపాంతరం చెందిదని అభిప్రాయపడతారు. వారి ఈ అభిప్రాయానికి కారణం మనం చిన్నప్పుడు చదువుకున్న పాఠ్య పుస్తకాలు ఒక కారణం కావచ్చు. అంతే కాక భారత దేశం అంతటా వివిధ రకాల సంస్కృతులు...

Monday, July 30, 2018 - 13:35

 బ్రెజిల్ :  ఊహించుకుంటేనే ఒళ్లు గగుర్పొడిచే సంఘటన ఓ రోడ్డు ప్రమాదంలో చోటుచేసుకుంది. ప్రసం కోసం వెళుతున్న ఓ యువతి రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకున్నారు. అనంతరం అక్కడ ఎదురైన సంఘటన వారిని విభ్రాంతికి గురిచేసింది.

ప్రసవం కోసం వెళుతు..రోడ్డు ప్రమాదం..
ఓ...

Saturday, July 28, 2018 - 19:29

ఢిల్లీ : ఉత్తర కాలిఫోర్నియా అడవుల్లో ఐదు రోజుల క్రితం రగులుకున్న కార్చిచ్చు దావానంలా మారి చుట్టుపక్కల ప్రాంతాలను దహించి వేస్తోంది. ఇప్పటికే 500 ఇళ్లు బుగ్గి పాలయ్యాయి. రెడ్డిమ్‌ ఎస్టేట్స్‌ను పూర్తిగా దగ్ధం చేసిన అగ్నికీలలు సాప్రామెన్‌ నది పరివాహాక ప్రాంతాలపై విరుచుకుపడుతున్నాయి. షష్ట-ట్రినిటీ ప్రాంతంలో మంటలు శరవేగంగా వ్యాపించడంతో శుక్రవారం 65 ఇళ్లు...

Friday, July 27, 2018 - 21:33

పాకిస్తాన్‌ : దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ పాకిస్తాన్‌ తెహ్రిక్‌ ఎ ఇన్సాఫ్‌ విజయం సాధించింది. అతిపెద్ద పార్టీగా అవతరించిన పిటిఐ ఇతర పార్టీల మద్దతులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇమ్రాన్‌ఖాన్‌ ప్రధాని పదవిని చేపట్టడం దాదాపు ఖాయమైనట్లే. కెప్టెన్‌గా పాకిస్తాన్‌కు ప్రపంచకప్‌ సాధించి పెట్టిన ఇమ్రాన్‌ఖాన్‌-ప్రధానిగా దేశాన్ని ఎలా ముందుకు...

Friday, July 27, 2018 - 20:58

చైనా ప్రభుత్వంలా పేదరికాన్ని నిర్మూలిస్తానని పాక్ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు సిద్ధంగా వున్నా ఇమ్రాన్ ఖాన్ ధీమా వ్యక్తంచేస్తున్నారు. మరి అది సాధ్యమేనా? పాక్ పేదరిక నిర్మూలన ఇమ్రాన్ కు సాధ్యమేనా?..సైన్యం చేతిలో ఇమ్రాన్ పావుగా మారతాడా?..లేక ప్రజాస్వామ్యానికి కృషి చేస్తాడా? ఉగ్రవాదం పట్ల ఇమ్రాన్ వైఖరి ఏమిటి? భారత్ పట్ల ఇమ్రాన్ వైఖరి ఏమిటి? ఎన్నో ఆశలతో...

Friday, July 27, 2018 - 10:16

ఢిల్లీ : పాకిస్తాన్‌లో మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ఖాన్‌ ప్రధాని పదవిని చేపట్టడం దాదాపు ఖాయమైంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఇమ్రాన్‌ ఖాన్‌కు చెందిన పాకిస్తాన్‌ తెహ్రిక్‌ ఎ ఇన్సాఫ్‌ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మేజిక్‌ ఫిగర్‌ రాకపోవడంతో ఇమ్రాన్‌ఖాన్‌ ఇతర పార్టీల మద్దతు కూడగట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత్‌తో స్నేహ సంబంధాలనే...

Thursday, July 26, 2018 - 12:21

ఢిల్లీ : పాక్ జాతీయ అసెంబ్లీలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రావడం లేదు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా (ఇమ్రాన్ ఖాన్) పీటీఐ నిలిచింది. 115 స్థానాల్లో పీటీఐ ముందంజలో కొనసాగుతోంది. పీఎంఎల్‌ఎన్ పార్టీ 64, పీపీపీ పార్టీ 43 స్థానాలతో దూసుకెళుతున్నాయి. ఇతరులతో కలసి పీటీఐ అధికారం చేజిక్కించుకొనే అవకాశం కనిపిస్తోంది. జాతీయ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే...

Thursday, July 26, 2018 - 12:11

ఢిల్లీ : పాక్ జాతీయ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. బుధవారం హింసాత్మక ఘటనల మధ్య జాతీయ అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అనంతరం కౌంటింగ్ నిర్వహించారు. 114 స్థానాల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ ముందంజలో కొనసాగుతోంది. 59 స్థానాల్లో నవాజ్ ఫరీఫ్ పార్టీ, 34 స్థానాల్లో పీపీపీ పార్టీలు కొనసాగుతున్నాయి.

దేశ 70 ఏళ్ల చరిత్రలో ప్రజాస్వామ్య...

Tuesday, July 24, 2018 - 21:00

సంఘర్షణాత్మక వైఖరితో పొరుగుదేశం అయిన పాకిస్థాన్. మంచో చెడో భారత్ తో బంధం పెనవేసుకున్న దాయాది దేశం. ఇరు దేశాల మధ్య మూడుసార్లు యుద్ధాలు చోటుచేసుకున్నా..దాడులు ముప్పిరిగొంటున్నా..కలిసి నడవక తప్పని నైబర్ దేశం పాకిస్థాన్. స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా..ప్రజాస్వామ్యం పరిమళించని బాధిత దేశం పాకిస్థాన్..అన్నింటా ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్న ఆల్ పవర్ ఫుల్ ఆర్మీ ఒకపక్క...

Monday, July 23, 2018 - 15:42

పాకిస్తాన్ : అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అస్వస్థతకు గురయ్యారు. మూత్ర పిండాల వ్యాధితో ఆయన బాధ పడుతున్నట్లు రావల్పిండిలోని జైలు బృందం పేర్కొంది. రక్తంలో నత్రజని..యూరియాలు ప్రమాదకరస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. హృదయస్పందనలో తేడా కనిపిస్తోందని...డీ హైడ్రేషన్ సమస్యతో బాధ పడుతున్నట్లు పేర్కొన్నారు. జైల్లో చికిత్సకు...

Saturday, July 21, 2018 - 11:50

శ్రీలంక : యునెస్కో గుర్తింపు కావాలో..ప్రఖ్యాతి చెందిన క్రికెట్ స్టేడియం కావాలో తేల్చుకోవాల్సిన పరిస్థితిలో శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. యునెస్కో వివిధ అవార్డులను, బహుమతులను, శాస్త్ర, సాంస్కృతిక, శాంతి రంగాలలో ప్రధానం చేస్తుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వివిధ కట్టడాలకు యునెస్కో గుర్తింపునిస్తుంది. ఈ...

Pages

Don't Miss