తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు మరోసారి వాయిదా

Submitted on 20 May 2019
Inter-Advanced Supplementary Examination again postponed in Telangana

తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. జూన్ 7, 2019 నుంచి జూన్ 14, 2019వ తేదీ వరకు అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. జూన్ 15, 2019 నుంచి జూన్ 18, 2019 వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగనున్నాయి. ఈమేరకు ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది.  

ఇంటర్ ఫలితాల్లో గందరగోళం తర్వాత రెండోసారి ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీల్లో మార్పులు చేర్పులు చేశారు. అయితే ఇప్పటివరకు కూడా వెరిఫికేషన్ కు సంబంధించిన ఫలితాలు వెల్లడి కాలేదు. దీంతో ఆ ఫలితాలు వెల్లడైన తర్వాతే సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలనే ఉద్దేశంతో ఇంటర్ బోర్డు హుటాహుటినా  ఈ నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికీ రెండోసారి ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన తేదీలను మార్చారు. అయితే ఈ వెరిఫికేషన్ కు సంబంధించిన ఫలితాలను మే 27, 2019 లోపు ప్రకటించాలని గతంలో హైకోర్టు తెలిపిన ప్రకారం వెరిఫికేషన్ ఫలితాలను ప్రకటించిన తర్వాతే అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించాలనే ఉద్దేశంతోనే అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా వేస్తూ వస్తోంది. 

ఒకవేళ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించి...వాటి ఫలితాలు విడుదల చేయడం చాలా ఆలస్యం అవుతుందని, విద్యార్థులకు చాలా ఇబ్బంది కూడా కల్గుతుంది. ఇప్పటికే ఎంసెట్ ఎగ్జామ్ కు సంబంధించిన ఫలితాలు రాబోతున్నాయి. అలాగే నీట్ ఎగ్జామ్ నిర్వహించారు...వాటికి సంబంధించిన ఫలితాలు కూడా రావాల్సివుంది. వీటన్నిటికి ప్రాసెస్ ఆలస్యం అవ్వడానికి ఇంటర్ ఫలితాల్లో జరిగిన గందరగోళమే ప్రధాన కారణం చెప్పవచ్చు. 

ముఖ్యంగా ఈ ఎగ్జామ్స్ ఆలస్యమవుతుంటే సప్లిమెంటరీ పరీక్షలు ఆలస్యమవుతూ వెరిఫికేషన్ ఫలితాలు ఆలస్యమవుతుండటంతో మిగతా ఎగ్జామ్స్ పై ఎక్కువగా ప్రభావం పడే అవకాశం ఉంది కాబట్టి ఇంటర్ బోర్డు త్వరగా వెరిఫికేషన్ కు సంబంధించిన ఫలితాలను ప్రకటించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. అయితే ఇవాళా అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను వాయిదా వేయడంతో మరింత ఆందోళన పెరిగిందని విద్యార్థులు అంటున్నారు.

Inter
Advanced
Supplementary
Examination
Postpone
Telangana

మరిన్ని వార్తలు