వాట్సాప్ వెబ్ తరహాలో: ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్

Submitted on 15 February 2019
Instagram to now allow users to send direct messages from web

ఇన్ స్టాగ్రామ్ యూజర్లకు గుడ్ న్యూస్. వాట్సప్ వెబ్ తరహాలో ఇన్ స్టాగ్రామ్ యాప్ లో కూడా కొత్త ఫీచర్ వచ్చేస్తోంది. అదే.. ఇన్ స్టాగ్రామ్ వెబ్ వర్షన్. డైరెక్ట్ మెసేజింగ్ (DM)వంటి బేసిక్ ఫీచర్లు త్వరలో రానున్నాయి. ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్ వెబ్ వర్షన్ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉన్నట్టు ఫేస్ బుక్ ఆధారిత ఫొటో షేరింగ్ యాప్ పేర్కొంది. ఈ ఫీచర్ ద్వారా ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను.. మీ మొబైల్ వెబ్ బ్రౌజర్ లేదా డెస్క్ టాప్ బ్రౌజర్ నుంచి నేరుగా మెసేజ్ లు పంపుకోవచ్చు. ఇప్పటివరకూ Instagram వెబ్ యూజర్లు తమ ఫీడ్ ను స్ర్కోల్ ద్వారా మాత్రమే చూడగలరు. DM ఫీచర్ ఆప్షన్ లేకపోవడంతో ఏదైనా ఆర్టికల్స్ ను పోస్టు చేసే వీలు లేదు. డెస్క్ టాప్ నుంచి ఫొటోలు, స్టోరీస్ అప్ డేట్ చేసేలా యూజర్లకు ఛాన్స్ లేదని తెలిపింది. 


ఒకవేళ ఫొటోలు అప్ లోడ్ చేయాలనుకుంటే.. వెబ్ వర్షన్ నుంచి ఇన్ స్టాగ్రామ్ మొబైల్ యాప్ లోకి స్విచ్ కావాల్సి ఉంటుందని పేర్కొంది. Instagram DM ఫీచర్ వెబ్ వర్షన్ ను జానే మన్ చున్ వాంగ్ అనే టెక్ బ్లాగర్ గుర్తించారు. ఈ ఫీచర్ కు సంబంధించిన స్ర్కీన్ షాట్స్ ను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ఇన్ స్టాగ్రామ్ డైరెక్ట్ మెసేజింగ్ ఫీచర్ పై ఆరు విదేశాల్లో వేర్వేరుగా టెస్టింగ్ జరుపుతోంది. ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్ట్రాగ్రామ్ ఇంటిగ్రేషన్ తో డైరెక్ట్ మెసేజింగ్ యాప్ ను రూపొందిస్తున్నారు.


2016 ఆరంభంలో ఇన్ స్టాగ్రామ్ నోటిఫికేషన్ ఫీచర్ యాడ్ అయింది. 2017 తరువాత వెబ్ యూజర్ల కోసం ఈ ఫీచర్ ను విస్తరించారు. ఇప్పుడు ఈ డైరెక్ట్ మెసేజ్ పంపే విధానంతో కంపెనీకి బిగ్ రిలీఫ్ గా భావిస్తోంది. ఇప్పటికే ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం Facebook కూడా మొబైల్ ఫోన్లపై వెబ్ సిరీస్ చాట్ ఫీచర్ ను ఆవిష్కరించింది. 2015లో వాట్సాప్ కూడా వాట్సాప్ వెబ్ వర్షన్ ను లాంచ్ చేసింది. 


Also Read : PUBGలో కొత్త మోడ్: ఫిబ్రవరి 19న అందుబాటులోకి..

Also Read : వెరీ చీప్ : జియో 4జీ డేటా ప్లాన్ వోచర్లు ఇవే

Also Read : వన్ నేషన్ - వన్ నెంబర్ : 112 గుర్తుపెట్టుకుంటే చాలు

instagram
users
direct messages
web Version 

మరిన్ని వార్తలు