శౌర్యమే కాదు మానవత్వమూ ఉంది :పావురాన్ని కాపాడిన జవాన్

Submitted on 25 May 2019
Injured pigeon was rescued by a CRPF Srinagar Constable

 దేశాన్ని మాత్రమే కాదు...ఆపదలో ఉన్న పక్షులను కూడా కాపాడుతామని నిరూపించాడు ఓ జవాన్. సృష్టిలో ప్రతీ జీవితం విలువైనదే. అది మనిషైనా,పక్షి అయినా,ఎవరైనా సరే. అందుకే తీవ్రగాయాలపాలై బాల్కనీలో చిక్కుకుపోయిన ఓ పావురాన్ని శ్రీనగర్ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అరుణ్ కాపాడాడు. నిచ్చెన వేసుకొని చిక్కుకొని ఉన్న పావురాన్ని ఆ జవాన్ రక్షించాడు.

దీనికి సంబంధించిన వీడియోను జమ్ముకశ్మీర్‌లో పనిచేస్తున్న సీఆర్పీఎఫ్ బెటాలియన్‌ కు చెందిన డిప్యూటీ సూపరింటెండెంట్ కశ్యప్ కడగట్టూర్ షేర్ చేశాడు.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.పావురం ప్రాణాలు కాపాడిన అరుణ్ పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఒకే నాణేనికి రెండువైపులా శౌర్యం,న్యాయం ఉన్నాయంటూ అరుణ్  గొప్ప మనసును మెచ్చుకుంటున్నారు.

VALOUR
Humanity
jawan
CRPF CONSTABLE
PIGEON
save
rescue
Injured
SRINAGAR
ARUN

మరిన్ని వార్తలు