మార్పు ఎప్పటికో : ఈ మూడే ఇండియాను పట్టిపీడుస్తున్నాయి

Submitted on 16 April 2019
Indians most worried about terrorism, jobs and corruption: Global survey

దేశం ఎటు వెళ్తోంది. కోట్లాది మంది భారతీయుల ప్రశ్న. రైట్ డైరెక్షన్ లో వెళ్తోందా? అంటే.. కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో దేశాన్ని పట్టిపీడించే సమస్యల్లో మూడు ప్రధాన సమస్యలు భారతీయులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయని ఇటీవల నిర్వహించిన ఓ ఆన్ లైన్ గ్లోబల్ సర్వేలో తేలింది. అవే.. ఉగ్రవాదం, నిరుద్యోగం, ఆర్థిక, రాజకీయ అవినీతి. దేశంలో దాదాపు 73శాతం మంది భారతీయులు.. దేశం సరైన మార్గంలోనే వెళ్తుందనే ఆశావాదంతో ఉన్నట్టు సర్వే చెబుతోంది. ‘వాట్ వర్రీస్ ద వరల్డ్’పేరుతో నెలవారీగా నిర్వహించిన గ్లోబల్ సర్వేలో ఈ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ప్రపంచ దేశాల్లో ఇండియా, ఫ్రాన్స్, జర్మనీ, సౌదీ అరేబియా, యూనైటెడ్ స్టేట్స్ దేశాలతో కలిపి మొత్తం 28దేశాలకు చెందిన 65ఏళ్ల వారి నుంచి అభిప్రాయాలను ఆన్ లైన్ సర్వేలో సేకరించారు. ఉగ్రవాదం, నిరుద్యోగం, అవినీతి.. ఈ మూడు సమస్యలే భారతీయులను తీవ్రంగా మనోవేదనకు గురిచేస్తున్నట్టు సర్వే చెబుతోంది. 

ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో మొత్తం 28 దేశాల్లోని దేశీయులు తమ దేశం రాంగ్ ట్రాక్ లో వెళ్తోందని భావిస్తున్నట్టు గుర్తించింది. ఇందులో 22 దేశాలు నిరాశవాదంతో జీవిస్తుండగా.. వీటిలో భారత్ ప్రధానంగా ఉగ్రవాదం, నిరుద్యోగం, అవినీతి సమస్యలను ఎదుర్కొంటోందని సర్వేలో తేలింది. గ్లోబల్ సమస్యల జాబితాను గుర్తించేందుకు 28 సర్వే సంస్థలు వివిధ మార్గాల్లో పలు అంశాలపై సర్వే నిర్వహించాయి. వీటిలో ఆర్థిక, రాజకీయ అవినీతి, పేదరికం, సామాజిక అసమానత టాప్ స్లాట్ లో ఉండగా.. తర్వాతి స్థానాల్లో నిరుద్యోగం, నేరాలు, హింస, హెల్త్ కేర్ వరుసగా నిలిచాయి. పుల్వామా ఉగ్రదాడి ఘటన దేశవ్యాప్తంగా అందరిని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. రోజురోజుకు దేశంలో పెరిగిపోతున్న ఉగ్రవాదంపై భారతీయుల్లో భయాందోళన వ్యక్తమవుతోంది. 

రెండో ప్రధాన సమస్య.. నిరుద్యోగం.. ఉద్యోగాలు లేక భారతీయులు నిరుత్సాహంతో బతికేస్తున్నారు. నిరుద్యోగులు.. తమ చదువుకు తగిన ఉద్యోగం లేక చెడు మార్గాల బాటపడుతున్న పరిస్థితి నెలకొంది. నిరుద్యోగ యువత ఆలోచనల్లో మార్పు కనిపిస్తోంది. దీంతో కొంతమంది యువతలో నిరుత్సాహం.. విరక్తితో ఉగ్రవాదం వైపు అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వాలు వెంటనే ఉద్యోగాలను సృష్టించి యువతకు ఉద్యోగాలను కల్పిస్తే.. ఇలాంటి చెడు పరిణామాల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఐపోసీస్ పబ్లిక్ అఫైర్స్, సర్వీసు లైన్ లీడర్ పరిజాత్ చక్రవర్తి అభిప్రాయపడ్డారు.  

పొరుగుదేశమైన చైనాలో మాత్రం పాజిటీవ్ రెస్పాండ్ వస్తోంది. చైనా పౌరుల్లో చాలామంది తమ దేశం రైట్ డైరెక్షన్ లోనే వెళ్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. చైనాలో కనీసం పది మంది చైనీస్ పౌరులు తమ దేశ అభివృద్ధిపై ఆశాభావంతో జీవిస్తున్నారు. ఇందులో సౌదీ అరేబియా రెండోస్థానంలో నిలవగా.. ఆ తర్వాతి స్థానాల్లో భారత్, మలేసియా దేశాలు నిలిచాయి. మరోవైపు టాప్ ఐదు దేశాల్లోని పౌరులు భయాందోళనకు గురవుతున్నట్టు సర్వేలో తేలింది. వాటిలో సౌత్ ఆఫ్రికా, ఫ్రాన్స్, స్పెయిన్, బెల్జియం దేశాలు ఉన్నాయి.  

terrorism
jobs
Corruption
Global survey
right direction
Indians


మరిన్ని వార్తలు