అమెరికాను మించిపోయాం : 3 నెలల్లో 480 కోట్ల Apps డౌన్ లోడ్

Submitted on 25 May 2019
Indian Users Download Most Number Of Apps In World, Cross 480 Crore Downloads In Just 3 Months

ఇండియన్ మార్కెట్లోకి రిలయన్స్ జియో ఎంట్రీ ఇచ్చిన ఏడాదిలోనే టెలికం ఇండస్ట్రీని షేక్ చేసింది. జియో రాకతో ఇంటర్నెట్ డేటా ప్లాన్స్ ఎంతో చీప్ అయ్యాయి. తక్కువ ఖరీదు.. ఎక్కువ డేటా అందించే జియో కోసం ఎగబడ్డారు. అలానే చాలామంది ఇండియన్స్.. ఆన్ లైన్ లో దొరికే ఎన్నో రకాల యాప్స్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు. జియో డేటా ప్లాన్స్ వచ్చాకే ఇండియాలో యూజర్లు యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవడంపై ఎక్కువగా దృష్టిపెట్టినట్టు ఓ కొత్త రిపోర్ట్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఇండియన్స్.. ఆన్ లైన్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇప్పటివరకూ ఎన్ని యాప్స్ డౌన్ లోడ్ చేసుకున్నారో తెలుసా? కోట్లకు పైనే.

వరల్డ్ Apps డౌన్ లోడ్.. ఇండియా ఫస్ట్ :
2019 ఏడాదిలో తొలి మూడు నెలల్లోనే 4.8 బిలియన్ల (480 కోట్లు) యాప్స్ డౌన్ లోడ్ చేసుకున్నారు. ప్రపంచంలో ఆన్ లైన్ యాప్స్ డౌన్ లోడ్ చేసుకున్న ఇండియన్ యూజర్లలో ఆండ్రాయిడ్, ఐఓఎస్ అకౌంట్ యూజర్లే ఎక్కువగా ఉన్నట్టు పేర్కొంది. అత్యంత ఖరైదీన ఐఫోన్లతో పోలిస్తే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్లే ఎక్కువ మంది యాప్స్ డౌన్ లోడ్ చేసుకున్నారు.

ప్రపంచంలో అత్యధికంగా కోట్లాది యాప్స్ డౌన్ లోడ్ చేసుకున్న దేశంగా ఇండియా ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. భారత్ తర్వాత అమెరికా Q1లో 3 బిలియన్ల (300 కోట్లు) యాప్స్ డౌన్ లోడ్ చేసిన దేశంగా రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో బ్రెజిల్, రష్యా, ఇండోనేషియా, మెక్సికో టర్కీ, వియత్నాం, జపాన్, సౌత్ కొరియా వరుసగా నిలిచాయి. 

టాప్ 5 పాపులర్ యాప్స్ ఇవే :
ఇండియాలో సోషల్ మీడియా ప్రభావం ఉండటంతో యూజర్లు ఎక్కువగా డౌన్ లోడ్ చేసుకున్న టాప్ 5 పాపులర్ యాప్స్ లో వాట్సాప్, మెసేంజర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ వంటి సోషల్ యాప్స్ టాప్ ప్లేస్ లో నిలిచాయి. ఆ తర్వాత వివాదాస్పద యాప్ TiTok (తాత్కాలిక నిషేధం విధించినప్పటికీ) ఐదో స్థానంలో నిలిచింది. పాపులర్ యాప్స్ జాబితాలో ఇండియన్ యాప్ MX Player  మాత్రమే చోటు దక్కించుకోగా.. ఎక్కువ సంఖ్యలో అమెరికా, చైనా బేసిడ్ పబ్లిషర్ యాప్స్ డౌన్ లోడ్ చేసుకున్నారు.

ఇండియాలో యాప్స్ డౌన్ లోడ్, ఇన్ స్టాల్ చేసుకోవడంపై ట్రాకింగ్ చేయగా ప్రత్యేకించి ఆండ్రాయిడ్ యూజర్లు ఎక్కువగా ఉన్నట్టు Sensor Tower, మొబైల్ ఇన్ సైట్స్ హెడ్ ర్యాండీ నెల్సన్ తెలిపారు. జియో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాక.. 2016 నుంచి ఇండియాలో యూజర్లు.. యాప్ డౌన్ లోడ్ చేసుకోవడం శరవేగంగా పెరిగిపోయినట్టు నెల్సన్ తెలిపారు. 
Indian Users Download Most Number Of Apps In World, Cross 480 Crore Downloads In Just 3 Months

Indian Users
Smart phone User
App Downloads
Wordwide Apps
Google Play store
iPhone users
reliance jio
Data plans

మరిన్ని వార్తలు