2019 వాలంటైన్స్ డే: ‘రోజా’లకు ఫుల్ గిరాకీ.. 30 కోట్లుపైనే!

Submitted on 7 February 2019
Indian more Expected To Earn Rs 30 Crore From Rose Export Ahead Of Valentine’s Day

వాలంటైన్స్ డే వచ్చేస్తోంది. ఇక వారం రోజులే మిగిలింది. ప్రేమికులంతా వాలంటైన్స్ డే కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రేమికుల రోజున తమ ప్రియనేస్తానికి ఎలా ప్రపోజ్ చేయాలా అని తెగ ఆలోచిస్తుంటారు. వెరైటీ గిఫ్ట్ లు, రంగుల పూల బుకేలతో ఇంప్రెస్ చేయాలని ఆరాటపడుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసిన వాలంటైన్స్ డే రోజున ప్రేమికులంతా స్వేచ్ఛగా విహరిస్తుంటారు. ప్రేమికుల రోజు అనగానే అందరికి గుర్తుచ్చే పూలు.. రోజా పూలు. రోజాపూలకు ప్రేమికులకు ఎంతో స్పెషల్. లవ్ ప్రపొజ్ చేయాలంటే.. రోజా పూలు ఉండాల్సందే. ఒక్క వాలంటైన్స్ డే రోజునే కాదు.. ఏ ఫంక్షన్ జరిగినా.. ఏ ఈవెంట్ చేసినా.. వెడ్డింగ్, బర్తడే సెలబ్రేషన్స్, యానివర్శరీ ఫంక్షన్లు కావచ్చు.. ఏ ఫంక్షన్ అయిన కచ్చితంగా గులాబీ బుకేలు ఉండాల్సిందే. లేదంటే.. అది అసలు ఫంక్షనే కాదంటారు. ఒక్క గులాబీ పూలే కాదు.. పరిమాళాలు వెదజల్లే మరెన్నో పూలు (లిల్లీలు, ప్రైమ్ రోజెస్, పాలియాంథీస్ ట్యూబ్ రోసా లేదా రంజిగంధ), తెల్ల రోజా, పింక్ రోజాపూలు, స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తాయి.


ఒక రోజా పువ్వు.. కాస్ట్ రూ.100  
రోజాపూలకు అయితే చెప్పనక్కర్లేదు. వాలంటైన్స్ డే రోజున ఫుల్ గిరాకీ. ఆ రోజుంతా ఎరుపు రంగుతో గుబాళించే పరిమాళాలతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ప్రేమికులే కాదు.. ప్రతి ఒక్కరూ గులాబీ అంటే ఎక్కువ మక్కువ చూపిస్తారు. ఇంతటి క్రేజ్ ఉన్న రోజాపూలకు వాలంటైన్స్ డే రోజున ఫుల్ డిమాండ్ ఉంటుంది. మిగిలిన రోజుల్లో రోజాపూలకు ఉండే గిరాకీ కంటే ఈ ఒక్క రోజులో ఉండే గిరాకీ కోట్లలో ఉంటుందంటే నమ్ముతారా? అవును. ఈ రోజున ఒక్క రోజాపువ్వు కాస్ట్ రూ.100 ఉంటుందటే అతిశయోక్తి కాదు. వాలంటైన్స్ డే స్పెషల్ గా భావించే వారంతా రోజాపూలను ఎగబడి కొనేస్తారు. ధర ఎంతైనా సరే కళ్లుమూసుకొని కొనేస్తారు. 

 

రూ.30 కోట్ల వరకు టర్నోవర్..
వాలంటైన్ డే రోజున గులాబీ పూలపై వచ్చే ఆదాయం రూ.30 కోట్లపైనే ఉంటుందని భారత్ అంచనా వేస్తోంది. ఈ ఒక్కరోజులోనే రోజాపూల ఎగుమతిపై కోట్ల బిజినెస్  జరుగుతుంది. రోజా పూలను మహారాష్ట్రలోని పుణె జిల్లా నుంచి ఎక్కువగా ఎగుమతి చేస్తుంటారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాలకు సైతం రోజాపూలను ఎగుమతి చేస్తారు. ఈ ఏడాది రోజాపూల ఉత్పత్తితో రైతులకు ఫుల్ బెనిఫెట్స్ కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రోజాపూలు సాగు చేసే రైతులకు ఫుల్ బిజినెస్ నడిచే రోజు.. వాలంటైన్స్ డే.  రోజాపూల ఎగుమతిపై ఈ ఏడాది 15 నుంచి 20 శాతం మేర ఆదాయం పెరుగుతుందని రోజా సాగుదారులు అంచనా వేస్తున్నారు. అందులోనూ వింటర్ సీజన్. సన్ లైట్, చల్లని ఉష్ణోగ్రత.. రోజాపూల ఉత్పత్తికి మంచి అనుకూల సమయంగా భావిస్తున్నారు. 2019 ఫిబ్రవరి వాలంటైన్స్ డే రోజున రోజాపూల ఎగుమతిపై రాబడి రూ.30 కోట్ల వరకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.


విదేశాలకు భారీగా ఎగుమతి.. కోట్లలో ఆదాయం
2018 ఫిబ్రవరి వాలంటైన్స్ డే సమయంలో రోజాపూల ఎగుమతిపై రూ.23 కోట్ల వరకు రాబడి వచ్చినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాదిలో చాలామంది రైతులు రోజాపూలు ఉత్పత్తిపైనే ప్రధానంగా దృష్టిపెట్టడంతో భారీ మొత్తంలో రాబడి ఉంటుందనే అంచనాలు నెలకొన్నాయి. వాలంటైన్స్ సీజన్ లో .. టాలెగన్ ఆధారిత భారత సొసైటీ ప్లోరీకల్చర్ ప్రొఫెసనల్స్ (ISFP) రోజాపూలను విదేశాలకు ఎగుమితి చేసి రూ. 24 కోట్లుకు పైగా లాభాలను గడించాయి. యూకే, మలేసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్ స్పెషల్ ఆర్డర్ లపై ఎగుమతి చేశాయి. ప్రత్యేకించి 2018 నవంబర్ నెలలో వాలంటైన్స్ సీజన్ లో గల్ఫ్ దేశాలకు కూడా భారీ స్థాయిలో ఎగుమతి చేసి అధిక లాభాలను గడించాయి.  

Also Read : 'వాలెంటైన్స్ డే' ను ఫిబ్రవరి 14నే ఎందుకు జరుపుకుంటారు...?

Also Read :  ఈ దేశాల్లో ప్రేమికుల దినోత్సవం నిషేధం!

Also Read :  2019 వాలంటైన్స్ డే ఆఫర్: నో లవర్స్.. సింగిల్స్‌కు మాత్రమే ఫ్రీ ఆఫర్

 

Valentine’s Day
Rose export
Indian farmers
bouquet
flower
primroses
Polianthes tuberosa or Rajnigandha 

మరిన్ని వార్తలు